కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
జమ్ము కాశ్మీర్ , లద్దాక్‌లలోని సుదూర ప్రాంతాలకు ప్రత్యేక తపాలా ఏర్పాటు
వయోధికులైన పింఛన్‌దారులకు ఇంటివద్దకే పించన్ అందిస్తున్న పోస్టాఫీసులు
Posted On:
15 APR 2020 4:48PM by PIB Hyderabad
కోవిడ్ -19 పై పోరాటం , సామాజిక దూరాన్ని పాటించడం, పోస్టాఫీసులలో జనం గుంపులుగా చేరడాన్ని నిరోధించేందుకు పోస్టాఫీసులు వయోధికులైన పింఛన్‌దారులకు వారి ఇంటివద్దకే పింఛన్ అందించే చర్యలు చేపట్టాయి. పొరుగునే ఉన్న తపాలా కార్యాలయం సమాజానికి ఈ మేరకు సేవలు అందిస్తోంది. దీని ద్వారా ప్రస్తుత కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఏర్పడిన సవాలు వంటి సమయంలో ప్రజల ఆర్థిక, ఆరోగ్యసంరక్షణను వారికి అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర, స్థానిక పాలనాయంత్రాంగాలు చేపడుతున్న చర్యలకు తోడుగా పోస్టాఫీసులు చర్యలు తీసుకుంటున్నాయి.
బారాముల్లా వద్ద డోర్ స్టెప్ పెన్షన్ చెల్లింపు
జమ్మూ తావి వద్ద ఆర్థిక లావాదేవీలు చేస్తున్న కస్టమర్
జమ్ము కాశ్మీర్, లద్దాక్ లలోని తపాలా కార్యాలయాలు, ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసే ప్రాధమిక లక్ష్యంతో తెరిచి ఉంచుతున్నారు. సులభంగా నగదు ఉపసంహరణ చేసుకోవడం, నగదు డిపాజిట్ సౌకర్యం కల్పించడం ద్వారా ప్రజలు తమ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇది వారికి నగదు అందుబాటులో ఉండేట్టు చేస్తుంది. ఇందుకు అనుగుణంగా, పోస్టాఫీసుల లో ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఎఇపిఎస్)ను కూడా ప్రారంభించారు., తద్వారా ఏ బ్యాంకులోనైనా ఖాతా ఉన్నవారు ఏ పోస్టాఫీసు నుంచైనా నెలకు రూ .10000 / - వరకు ఉపసంహరించుకోవచ్చు. అయితే బ్యాంక్‌ఖాతాను లబ్ధిదారుడి ఆధార్‌తో తప్పకుండా అనుసంధానించి ఉండాలి..
జమ్ము కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతం లోని సుదూర సరిహద్దు ప్రాంతాలకు స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్ మొదలైన ప్రాధాన్యతా మెయిల్ సజావుగా చేరేలా ప్రత్యేక మెయిల్ బట్వాడా ఏర్పాట్లు జరిగాయి. ప్రాధాన్యతా మెయిల్ విండో డెలివరీ తపాలా కార్యాలయాలలో కూడా జరిగేట్టు చూశారు.
ప్రస్తుతకోవిడ్ వ్యాప్తి సంక్షోభ సమయంలో సమాజంలోని పేదలు, బలహీన వర్గాలకు ఉపశమనం కల్పించి, వారికి సహాయాన్ని అందించాల్సిన అవసరం తపాలా శాఖకు తెలుసు.
. రేషన్ , మాస్క్‌లు, శానిటైజర్లు , సబ్బుల వంటి వాటిని రాష్ట్ర , స్థానిక పాలనాయంత్రాంగాల సన్నిహిత సమన్వయంతో ప్రజలకు అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆహారం , ఇతర వస్తువులు, మందుల పంపిణీకి అవసరమైన రవాణా సహకారం అందించడానికి డిపార్ట్‌మెంటల్ మెయిల్ మోటారు వాహనాలను జిల్లా , మునిసిపల్ అధికారుల వద్ద అందుబాటులో ఉంచారు. మునిసిపల్ అధికారుల సమన్వయంతో, తపాలా కార్యాలయ ప్రాంగణాల పరిశుభ్రతకు చర్యలు తీసుకోవడం జరిగింది.
డ్రై రేషన్ పంపిణీ
తపాలా కార్యాలయాల పరిశుభ్రత
డాక్ సేవా జాన్ సేవా
***
(Release ID: 1614748)
Visitor Counter : 191