విద్యుత్తు మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా సిఎస్సార్ కార్యక్రమాలు నిర్వహించిన పవర్ గ్రిడ్
Posted On:
14 APR 2020 5:10PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా సర్వత్రా తీవ్ర ఆందోళన నెలకొంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర విద్యుత్ శాఖకు సంబంధించిన పవర్ గ్రిడ్ దేశవ్యాప్తంగా ఎలాంటి అంతరాయం కలగకుండా 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తూ ప్రజాసేవలో నిమగ్రమైంది. అంతే కాదు ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడానికిగాను పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బాధ్యతాయుతమైన కార్పొరేట్ పౌరుని పాత్రను నిర్వహిస్తున్న పవర్ గ్రిడ్.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలు చేయడంలో ముందుంది. మొదటగా పిఎం కేర్స్ కు రూ. 200 కోట్లను విరాళంగా ఇచ్చింది. అంతే కాదు దీంతోపాటు పవర్ గ్రిడ్ ఉద్యోగులు తమ ఒక రోజు జీతాన్ని పిఎం కేర్స్ కు అందించారు.
పిఎం కేర్స్ కు ఆర్ధిక సాయమే కాకుండా పవర్ గ్రిడ్ కోసం పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు పండ్లు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తోంది. అంతే కాకుండా సబ్ స్టేషన్ల దగ్గర, ట్రాన్స్ మిషన్ లైన్ కార్యాలయాల సమీపంలో నివసిస్తున్న ప్రజలకు అండగా నిలుస్తోంది. నిత్యావసర వస్తువులతోపాటు మాస్కులను, శానిటైజర్లను, సబ్బులను పంపిణీ చేస్తోంది. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇంతవరకూ దేశవ్యాప్తంగా 200 ప్రాంతా్లో 4.27 కోట్ల రూపాయల విలువైన రేషన్, ఆహార వస్తువలను అందించడం జరిగింది.
ఈ మహమ్మారిపై పోరాటంలో భాగంగా పలు ఆసుపత్రులకు అవసరమయ్యే వెంటిలేటర్లను పవర్ గ్రిడ్ అందించింది. అంతే కాదు ఆయా ఆసుపపత్రుల్లో వైద్య సౌకర్యాలను బలోపేతం చేయడం జరిగింది. పిపి ఇ కిట్లు, ఇంకా ఆసుపత్రులకు సంబంధించిన వస్తువులను అందించడం జరిగింది.
ఈ సేవా కార్యక్రమాలతోపాటు కోవిడ్ -19 ఎంత ప్రమాదకారో చెబుతూ ప్రజల్లో సామాజిక దూరం వుండడంవల్ల జరిగే మేలు గురించి కూడా పవర్ గ్రిడ్ వివరిస్తోంది. దేశవ్యాప్తంగా పవర్ గ్రిడ్ కార్యాలయాల్లో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు సేవలందిస్తున్నారు.
(Release ID: 1614522)
Visitor Counter : 177