ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి మరియు పాలస్తీనా అధ్యక్షుని మధ్య టెలిఫోన్ సంభాషణ

प्रविष्टि तिथि: 14 APR 2020 7:05PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు గౌరవనీయులు పాలస్తీనా అధ్యక్షుడు శ్రీ మహమౌద్ అబ్బాస్ తో ఫోనులో మాట్లాడారు.  

రానున్న పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా పాలస్తీనా అధ్యక్షునికీ, ఆ దేశ ప్రజలకీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ప్రస్తుతం నెలకొన్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా నెలకొన్న సవాళ్లపై ఇరువురు నాయకులు చర్చించారు.  ఈ పరిస్థితిని నియంత్రించడానికి తమ తమ దేశాల్లో చేపట్టిన చర్యల గురించి ఒకరికొకరు తెలియజేసుకున్నారు. 

పాలస్తీనాలో ప్రజలకు వైరస్ సోకకుండా అక్కడి అధికారులు చేపట్టిన చర్యలను ప్రధానమంత్రి ప్రశంసించారు. వారు చేస్తున్న కృషికి భారతదేశం తగిన సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు

ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో పరస్పరం తగిన స్థాయిల్లో సహకారం అందించుకోడానికి తరచూ సంప్రదించుకోవాలని ఇరువురు నాయకులు అంగీకరించారు.  

 *****


(रिलीज़ आईडी: 1614495) आगंतुक पटल : 207
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam