గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు పింప్రి చించ్ వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేసిన వ్యూహాలు మరియు పరిష్కార మార్గాలు

Posted On: 14 APR 2020 3:15PM by PIB Hyderabad

పూణె మెట్రో పాలిటన్ ప్రాంతంలో పూణే సరిహద్దులో ఉండే పింప్రి చిన్స్ వాడ్ ప్రాంతం ఒక భాగం. పారిశ్రామిక కేంద్రంగా, పూణేకు సహాయ టౌన్ షిప్ గా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం ప్రస్తుతం ప్రధాన నగరంగా అవతరించింది. గత కొన్నేళ్ళఉగా జనాభాలో పెరుగుదల మరియు పింప్రి నివాస సామర్థ్యం బాగా పెరిగింది. జనాభా పెరుగుదలతో పాటు వ్యర్థాల పెరుగుదల అదే స్థాయిలో ఉంది. వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు పారిశుద్ధ్య సేవల్లో పింప్రి చిన్చ్ వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ మంచి పని తీరు కనబరుస్తోంది. అంతే కాదు ఇటీవల కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అప్రమత్తంగా ఉన్న విధానం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది.

 వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు పింప్రి చించ్ వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ అనేక వినూత్న మరియు కీలక కార్యక్రమాలు ప్రారంభించింది. చేయవలసిన పనులు, వాటిలో పురోగతి మార్పులను పర్యవేక్షించడానికి నియంత్రణ లేకుండా ముందుకు సాగడం కష్టం అనే ఉద్దేశంతో, పి.సి.ఎం.సి. వార్ రూమ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పింప్రి చిన్చ్ వాడ్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ కింద ఇది జరిగింది. పి.సి.ఎం.సి.లో కోవిడ్ పరిస్థితిని సరిగా నిర్వహించేందుకు ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేశారు. ఇందులో జి.ఐ.ఎస్. మ్యాపింగ్, డేటా విశ్లేషణ, నిర్బంధ గృహాల పర్యవేక్షణ వంటి సాధనాలను ఉపయోగిస్తుంది. సంబంధిత పౌరులను నేరుగా చేరుకునేందుకు హెల్ప్ లైన్ నంబర్ ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. పౌరుల ప్రశ్నలకు నిపుణులచే సమాధానం లభించేలా వార్ రూమ్ ను వినియోగిస్తున్నారు. ఆన్ లైన్ లో నకిలీ వార్తల గందరగోళం మధ్య, సరైన సమాచారం తెలుసుకునే దిశగా ఇది కీలక పాత్ర పోషించింది.

 

 కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాంకేతికతను సమర్థవంతమైన సాధనంగా పి.సి.ఎం.సి. వినియోగించుకుంది. యాప్ లను ఉపయోగించడం మొదలుకుని, జి.ఐ.ఎస్. సాధనాలను ఉపయోగించడం, డాష్ బోర్డ్ పర్యవేక్షణ నగరంలోని కోవిడ్ పరిస్థితిని సరైన పర్యవేక్షణ మరియు ట్రాకింగ్ కోసం పి.సి.ఎం.సి. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంది. మంచి నిర్ణయాలతో మున్సిపాలిటీ సమర్థవంతమైన పనితీరు కనబరిచింది.

 పి.సి.ఎం.సి. ఆర్సెనల్ లో లభించే అన్ని డిజిటల్ పరిష్కారాలతో, పి.సి.ఎం.సి, స్మార్ట్ సారథి మొబైల్ అప్లికేషన్ ఉన్నతంగా నిలిచింది. ఇందులో మొదటి యాప్ కోవిడ్ -19 స్వీయ అంచనాల పరీక్ష రిస్క్ అసెస్ మెంట్ క్రైటీరియన్ చుట్టూ రూపొందించబడింది.  

దీని ద్వారా ప్రశ్నలకు సమాధానాలను బట్టి, పౌరుడి ఆరోగ్య ప్రమాదాన్ని గుర్తించవ్చచు. ఈ పరీక్ష పౌరులకే గాక, కార్పొరషన్ కు కూడా ప్రయోజన కరంగా ఉంటుంది. ఎందుకంటే ఆన్ లైన్ లో డేటాను సమర్థవంతంగా సేకరిస్తుంది. తర్వాత కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి దీన్ని సరిగ్గా విశ్లేషించవచ్చు. అంతే గాకుండా నష్టాలను తగ్గించేందుకు సమర్థవంతమైన ప్రతిస్పందన ఉంటుంది. ఇక ఇందులో రెండోది ఏమిటంటే, ఈ యాప్ నిర్బంధ కదలిక తనిఖఈని కలిగి ఉంది. నిర్భంద రోగులను వారి భౌగోళిక స్థానాన్ని గుర్తించాలనే ఉద్దేశంతో నిమగ్నం మరియు సర్వే చేయడానికి ఇది ఒక మార్గం. రోగి యొక్క స్థానం గుర్తించిన ప్రదేశం ( ప్రస్తుత స్థానం) నుంచి 100 మీటర్ల కంటే ఎక్కువ ఉంటే, ఆ ప్రాంతంలో సంబంధిత ఆరోగ్య కార్యకర్తకు ఆటోమేటిక్ అప్ డేట్ పంపబడుతుంది. మూడవది పి.సి.ఎం.సి. యాప్ ద్వారా ప్రచారం కూడా సాగుతుంది. దీని ద్వారా ప్రజలను సహాయక చర్యల కోసం ఆహ్వానిస్తున్నారు. ఈ ప్రచారం ద్వారా వాలంటీర్ల డాటాను సేకరించడం జరుగుతుంది. ఇది తదుపరి కార్యాచరణ ప్రణాళికకు సహాయపడుతుంది.

చివరగా మరియు ముఖ్యంగా ఈ యాప్ లో నియర్ మీ, అనే ఆప్షన్ ఉంటుంది. ఇధి దగ్గరలో ఉండే ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు మొదలైన ప్రదేశాలను చూపిస్తుంది. అవి క్రియాత్మకంగా పౌరులకు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా సమీపంలోని ఉచిత ఆహార పంపిణీ కేంద్రాలు, నిరుపేదలకు ఆశ్రయం కల్పించే ప్రదేశాలను కూడా చూపిస్తుంది. ఇక్కడ 40కి పైగా ఆహార పంపిణీ కేంద్రాలు, 9 హోమ్ షెల్టర్లు, 35కు పైగా అత్యవసర డిస్పెన్సరీలు, హోం డెలివరీ అందించే 50కి పైగా కిరాణా దుకాణాలు ఇందులో కనిపిస్తాయి. కోవిడ్ – 19 పరీక్ష  మరియు చికిత్స చేసే ఆస్పత్రుల వివరాలు, చిరునామాలను కూడా  ఇందులో చేర్చే యోచనలో పి.సి.ఎం.సి. ఉంది.

పౌరులు సామాజిక దూరాన్ని ఆచరించేలా మరియు ఇంటి లోపల ఉండేలా చూసుకోవడం చాలా కీలకం. అదే సమయంలో కోవిడ్ ను సమగ్రంగా ఎదుర్కొనేందుకు తొలి వరుసలో పని చేస్తున్న వారిని చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ విధంగా స్వచ్ఛత కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక వ్యక్తిగత రక్షణ సామగ్రిని సిద్ధం చేసింది. దీనితో పాటు సాధారణ బహిరంగా ప్రదేశాల్లో క్రిమిసంహారక మందులు చల్లడం, ఇంటింటికీ వ్యర్థాల సేకరణ, మార్గదర్శకాలు అందించే విషయంలో పారిశుద్ధ్య సిబ్బందికి సూచనలు ఇవ్వబడ్డాయి.

పి.సి.ఎం.సి. క్రమం తప్పకుండా వివిధ మీడియా ఛానల్స్, సోషల్ మీడియా, లోకల్ మీడియా, ప్రింట్ మరియు టీవీ ద్వారా అవగాహన మరియు వారి కార్యకలాపాల తాజా పరిణామాలను అందరికీ తెలియజేస్తుంది. వీటితో పాటు అన్నీ చెత్త సేకరణ వాహణాలకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ జతచేయబడ్డాయి. కోవిడ్ అవగాహన, ముందు జాగ్రత్త, పరిశుభ్రత నిర్వహణ, ప్రభుత్వ సలహాలు మొదలైన అంశాలపై ఆడియో క్లిప్ లను ప్లే చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. పౌరులకు విద్య మరియు రక్షణ అందించేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు.

పింప్రి ఎప్పుడూ విభిన్నమైన, విలక్షణమైన అంశాలను పరిచయం చేసే ఆలోచనలో ఉంటుంది. కోవిడ్ మహమ్మారి బాగా విస్తరించిన మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఉన్నప్పటికీ వీరు చూపిస్తున్న చొరవ, పాటిస్తున్న విధానాలు ఆచరణీయం. 

 


(Release ID: 1614375) Visitor Counter : 329