మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

’భారత్ పడే ఆన్లైన్’ ప్రచార కార్యక్రమానికి ప్రారంభించిన 3 రోజుల్లోనే 3700పైగా సూచనలు

భారతదేశంలో ఆన్లైన్ విద్యావిదానాన్ని మెరుగుపరచడానికి ప్రజల నుండి సూచనలు, అభిప్రాయాల కోసం 10 ఏప్రిల్ 2020న వారం మొత్తం పనిచేసే ’భారత్ పడే ఆన్లైన్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మానవాభివృద్ధి మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ’నిషాంక్’

ప్రజలు తమ యొక్క అభిప్రాయాలు, సూచనలను #BharatPadheOnline మరియు notifying @HRDMinistry& @DrRPNishank మరియు bharatpadheonline.mhrd@gmail.com లలో 16 ఏప్రిల్ 2020 వరకు పంచుకోవచ్చు

Posted On: 13 APR 2020 5:10PM by PIB Hyderabad

కేంద్ర భారతదేశంలో ఆన్లైన్ విద్యావిదానాన్ని మెరుగుపరచడానికి ప్రజల నుండి సూచనలు, అభిప్రాయాల కోసం  10 ఏప్రిల్ 2020న వారం మొత్తం పనిచేసే ’భారత్ పడే ఆన్లైన్’ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మానవాభివృద్ధి మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ’నిషాంక్’  న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం సామాజిక మాధ్యమాల్లో మంచి ప్రజాదరణను చూరగొన్నది, ప్రారంభించిన 3 రోజుల్లోనే 3700పైగా సలహాలు, సూచనలు ఈ కార్యక్రమానికి అందాయి. ఇ-మెయిల్ మరియు ట్విట్టర్ల ద్వారా ప్రజలు ఈ   ఆన్లైన్ విద్యా విధాన ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నారు.  సామాజిక మాధ్యమాల్లో ప్రాముఖ్యతను సంతరించుకుని ట్విట్టర్లో మొదటి 10 స్థానాల్లో నిలుస్తున్నది.

ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని నిపుణుల సలహాలు, సూచనలను నేరుగా ఆహ్వానించి, వారి సలహాలను,సూచనలను   కేంద్ర మానవాభివృద్ధి శాఖ అందుబాటులో ఉన్న ఉత్తమమైన డిజిటల్ వేదికల ద్వారా  ఆన్లైన్ విద్యావిధానాన్ని ప్రోత్సహిస్తుంది.  ఇందులో భాగంగా వచ్చే ఆటంకాలను ఎదుర్కోవడానికి ఈ సలహాలు, సూచనలను bharatpadheonline.mhrd[at]gmail[dot]com మెయిల్ ద్వారా,  # BharatPadheOnline ట్విట్టర్ ద్వారా 16 ఏప్రిల్ 2020 వరకు పంచుకోవచ్చు. ట్విట్టర్ ఉపయోగించే సమయంలో  @HRDMinistry  మరియు @DrRPNishank అనే టాగ్ను తప్పనిసరిగా ఉపయోగించాలి, అందువలన మీ సలహాలు, సూచనలు మంత్రిత్వ శాఖకు చేరుతాయి.



(Release ID: 1614087) Visitor Counter : 147