ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

వైశాఖి, విషు, పుత్తాండు, మసాది, వైశాఖాది మరియు బహాగ్ బిహూ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి

Posted On: 13 APR 2020 10:16AM by PIB Hyderabad

2020 ఏప్రిల్ 13, 14 తేదీల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకుంటున్న వైశాఖి, విషు, పుత్తాండు, మసాది, వైశాఖాది మరియు బహాగ్ బిహూ నేపథ్యంలో బారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన సందేశంలో దేశం ప్రస్తుతం పరీక్షా సమయంలో ఉందని, ఇలాంటి సమయంలో పండుగలు మనలో చైతన్యం నింపి, మార్గనిర్దేశకత్వం చేస్తాయని తెలిపారు.

ఉపరాష్ట్రపతి సందేశం పూర్తి పాఠం

దేశ ప్రజలందరికీ వైశాఖి, విషు, పుత్తాండు, మాసాది, వైశాఖాది మరియు బహాగ్ బిహూ శుభాకాంక్షలు. కొత్త ఏడాది సందర్భంలో జరుపుకునే ఈ పండుగలు కొత్త ఆరంభాలకు, మరియు కొత్త ఆశలకు మేలుకొలుపు వంటింది. పంటలతో ముడిపడి ఉన్న ఈ పండుగలు ప్రకృతి అందాలతో పాటు అది ధాన్యరాశులకు నిదర్శనం.

కరోనా వైరస్ తో దేశ ప్రజలందరూ పోరాటం చేస్తున్న ఈ పరీక్షా సమయంలో, ఇలాంటి ఉత్సవాలు మనలో చైతన్యం నింపి, మార్గనిర్దేశం చేస్తాయి. రాబోయే సంవత్సరం సంవృద్ధిగా ఉండాలని, ఈ సంవృద్ధిని పంచుకోవడానికి కృషి చేయడమే గాక, తోటి జీవులను మాతృభావంతో చూసుకోవడానికి ప్రయత్నం చేయాలని ఆకాంక్షిస్తున్నాను. కొత్త సంవత్సరం మనలో నిస్వార్థత, దయ, కరుణ మరియు తాదాత్మ్యం యొక్క  ధర్మాలను ప్రేరేపించడంతో పాటు శాంతి, సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.

ఈ కొత్త సంవత్సరాన్ని మన ప్రియమైన వారితో ఇంట్లోనే జరుపుకుంటూ, సామూహిక సమావేశాలు, ప్రార్థనలు, వేడుకలకు దూరంగా ఉందాం.

ఇంటి వద్దే ఉండండి, సురక్షితంగా ఉండండి. ”


(Release ID: 1613913) Visitor Counter : 96