రాష్ట్రపతి సచివాలయం
వైశాఖి, విషు, రొంగాలి బిహు నవ వర్ష,వైశాఖడి,పుతాండు, పిరప్పు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
Posted On:
13 APR 2020 11:50AM by PIB Hyderabad
దేశంలోని వివిధ ప్రాంతాలలో 2020 ఏప్రిల్ 13,14 తేదీలలో జరుపుకుంటున్న విషు, రొంగాలి బిహు,నవ వర్ష,వైశాఖడి,పుతాండు, పిరప్పు పర్వదినాల సందర్భంగా రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు
“ విషు, రొంగాలి బిహు, నవ వర్ష, వైశాఖడి, పుతాండు, పిరప్పు పర్వదినాల సందర్భంగా దేశంలోనూ, విదేశాలలోనూ ఉంటున్న నా సహచర పౌరులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు
ఈ పండుగలు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యంలో అంతర్లీనంగా ఉన్న ఐక్యతకు చిహ్నం. మన రైతుల ఉత్సవ సందర్భం కూడా. మన రైతుల పట్ల మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి, వారు మనకోసం ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడమే కాకుండా, వారి అవిశ్రాంత కృషితతో మనకు ఆహార భద్రత సుసంపన్నతను తీసుకువస్తున్నారు
మనం ప్రస్తుతం కోవిడ్ -19 కారణంగా మున్నెన్నడూ చూడని సవాలును ఎదుర్కొంటున్నాం. ఈ సంవత్సరం ఈ పండుగల సందర్భంగా మనం సామాజిక దూరం నియమాలు పాటిస్తూ, అప్రమత్తతతో ఉంటూ కరోనా మహ్మమ్మారిని ఓడించేందుకు మన సమష్టి , ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటించాలి ”.
హిందీలో రాష్ట్రపతి సందేశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(Release ID: 1613877)