ఆయుష్

హోమియోపతి ప్రాక్టీషనర్ల టెలిమెడిసిన్ మార్గదర్శకాలకు స‌ర్కారు ఆమోదం

ప్రపంచ హోమియోపతి దినోత్సవం పుర‌స్క‌రించుకొని అంతర్జాతీయ వెబ్‌నార్‌ను ప్రారంభించిన ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్

Posted On: 11 APR 2020 11:52AM by PIB Hyderabad

ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకొని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి' (సీసీఆర్‌హెచ్) అంతర్జాతీయ వెబ్‌నార్‌ నిర్వహించింది. హోమియోపతి విధాన వ్య‌వ‌స్థాప‌కుడిగా పేరుగాంచిన‌ డాక్టర్ శామ్యూల్ హనీమాన్ 265వ జయంతి పురస్కరించుకుని ఈ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. డిజిట‌ల్ వేదిక‌పై లైవ్ స్ర్టీమింగ్‌గా నిర్వ‌హించిన ఈ వెబ్‌నార్‌లో వేలాది మంది పాల్గొన్నారు. ఆయుష్ శాఖ మంత్రి (స్వ‌తంత్ర హోదా) శ్రీపాద్ యెస్సో నాయక్ ఈ కార్య‌క్ర‌మంలో ప్రారంభ ప్ర‌సంగం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ హోమియోపతిక్ ప్రాక్టీషనర్లకూ టెలిమెడిసిన్ మార్గదర్శకాలకు స‌ర్కారు ఆమోదం తెలిపిన‌ట్టుగా ప్రకటించారు. క‌రోనాపై పోరుకు అవసరమైతే కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌తో ఆయుష్ శ్రామిక శక్తిని జ‌త‌కూర్చాల్సిన అవ‌స‌రం ఎంతైఆ ఉంద‌ని ఆయ‌న నొక్కి చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారికి ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కోటేచా హోమియోపతి దినోత్సవం సంద‌ర్భంగా త‌న శుభాకాంక్షలు తెలిపారు. గ్రీస్‌లోని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ క్లాసికల్ హోమియోపతి డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) జార్జ్ విథౌల్కాస్, సీసీఆర్‌హెచ్ డీజీ(ఐ/సి) డాక్టర్ అనిల్ ఖురానా, ఢిల్లీ ప్ర‌భుత్వంలోని ఆయుష్ విభాగం హోమియోప‌తి విభాగం డైరెక్ట‌ర్ డాక్టర్ ఆర్కె మంచంద, కోల్‌కతాలోని ఎన్‌ఐహెచ్ డైరెక్టర్ డాక్టర్ సుబాష్ సింగ్, ఆయుష్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎస్‌ఆర్‌కే విద్యార్థి, భార‌త్ నుంచి డాక్టర్ వి కె.గుప్తా, బ్రిట‌న్‌కు చెందిన డాక్టర్ రాబర్ట్ వాన్ హసేలెన్, హాంకాంగ్కు చెందిన ప్రొఫెసర్ ఆరోన్తో త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో ప్రధాన వక్తలుగా పాల్గొన్నారు. కోవిడ్‌-19ను క‌ట్ట‌డి చేసేలా హోమియోపతిలో గ‌ల సంభావ్యత గురించి వక్తలు ఈ కార్యక్ర‌మంలో మాట్లాడారు. కోవిడ్‌ రోగులకు ప్రామాణిక సంరక్షణతో పాటు సహాయకంగా హోమియోపతి వాడకం గురించి కూడా ఈ కార్యక్ర‌మంలో డాక్ట‌ర్లు త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు. 



(Release ID: 1613250) Visitor Counter : 269