వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఎఫ్.సి.ఐ. ఉద్యోగులు కోవిడ్ -19 కారణంగా మరణిస్తే లక్షకు పైగా జీవితబీమాకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం

Posted On: 10 APR 2020 7:39PM by PIB Hyderabad

కరోనా మహమ్మారికి వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 24 ఆహార ధాన్యాలు సరఫరా చేసేందుకు 24x7 అవిశ్రాంతంగా పని చేస్తున్న 80,000 మంది కార్మికులతో పాటు మొత్తం 1,08,714 మంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.సి.ఐ) అధికారులకు జీవిత బీమా రక్షణ కల్పించే ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది.

ప్రస్తుతం ఎఫ్.సి.. ఉద్యోగుల కుటుంబాలు ఉగ్రవాద దాడి, బాంబు పేలుళ్ళు, అల్లరి మూకల దాడులు, ప్రకృతి విపత్తుల కారణంగా మరణిస్తే పరిహారం పొందడానికి అర్హులు, అయితే ఎఫ్.సి.ఐ, రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ లేబర్ దీని పరిధిలో లేరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, కోవిడ్ -19 కారణంగా సంక్రమణ ముప్పు ఉందని తెలిసీ అవిశ్రాంతంగా పని చేస్తున్న కార్మికులందరికీ జీవిత బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ బీమా నిబంధనల ప్రకారం 2020 మార్చి 24 నుంచి 2020 సెప్టెంబర్ 23 వరకూ ఆరు నెలల కాలంలో ఎఫ్.సి.ఐ. విధుల్లో ఉన్నప్పుడు కోవిడ్ -19 సంక్రమణ కారణంగా ఎవరైనా మరణిస్తే రెగ్యులర్ ఎఫ్.సి.ఐ. లేబర్ కు రూ. 15 లక్షలు, కాంట్రాక్ట్ లేబర్ కు రూ. 10 లక్షలు, కేటగిరి -1 అధికారులకు రూ. 35 లక్షలు, కేటగిరీ-2 అధికారులకు రూ. 30 లక్షలు, కేటగిరీ-3 మరియు 4 కార్మికులకు రూ.25 లక్షలు జీవిత బీమా లభిస్తుంది.

ఈ విషయాన్ని ప్రకటించిన కేంద్ర వినియోగ దారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ, ఈ సంక్షోభ సమయంలో సామాన్యులకు అవసరమైన వస్తువులు మరియు సేవలను అందించడంలో నిమగ్నమైన కరోనా యోధులకు సాధ్యమైనంత భద్రత కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.



(Release ID: 1613124) Visitor Counter : 195