వ్యవసాయ మంత్రిత్వ శాఖ

దిగ్బంధం వేళ వ్యవసాయ-సహకార-రైతు సంక్షేమశాఖ చర్యలు

మొత్తం విస్తీర్ణంలో గోధుమ సాగు 26 నుంచి 33 శాతం;
రబీ-2020 సీజన్‌లో రూ.526.84 కోట్ల విలువైన లక్ష టన్నులకుపైగా
పప్పులు, నూనెగింజల సేకరణ; 75,894 మంది రైతులకు లబ్ధి;
రైతుల నుంచి టోకు వ్యాపారుల ప్రత్యక్ష కొనుగోలుకు అనుమతి...
ఈ-నామ్‌ వేదికపై సాముదాయక రవాణా సదుపాయం కల్పన;
నశ్వర వస్తువులు, విత్తనాలు, పాలు, పాడి ఉత్పత్తులుసహా
నిత్యావసరాల సత్వర రవాణాకు 109 పార్శిల్‌ రైళ్లను నడుపుతున్న రైల్వేశాఖ

Posted On: 10 APR 2020 6:34PM by PIB Hyderabad


   జాతీయ దిగ్బంధం నేపథ్యంలో రైతులకు, వ్యవసాయ కార్యకలాపాలకు వెసులుబాటు కల్పించే దిశగా కేంద్ర వ్యవసాయ-సహకార-రైతు సంక్షేమ శాఖ పలు చర్యలు తీసుకుంటోంది. వివరాలిలా ఉన్నాయి:

  • దేశంలోని రైతులు, రైతుకూలీలకు కరోనా వైరస్‌ ముప్పు తప్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం 2020 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పంట కోతలు-నూర్పిళ్లపై ప్రామాణిక విధాన ప్రక్రియను నిర్దేశిస్తూ రాష్ట్రాలకు సర్క్యులర్‌ పంపింది.

  • కాగా, గోధుమ పండించే రాష్ట్రాల్లో మొత్తం సాగు విస్తీర్ణానికిగాను 26 నుంచి 33 శాతం విత్తనాలు వేసినట్లు సమాచారం అందింది.

  • రబీ 2020 సీజన్‌లో కనీస మద్దతు ధరతో రూ.526.84 కోట్ల విలువైన 1,07,814 టన్నుల పప్పులు, నూనెగింజలను నాఫెడ్‌ కొనుగోలు చేసింది. దీనివల్ల 75,894 మంది రైతులకు లబ్ధి చేకూరింది.

  • రైతుల నుంచి టోకు వ్యాపారుల ప్రత్యక్ష కొనుగోళ్లకు అనుమతించాలని సూచిస్తూ రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాలకు సలహాపత్రం జారీ

  • ఈ-నామ్‌ వేదికగా రైతుల కోసం 7.76 లక్షల ట్రక్కులు, 1.92 లక్షల రవాణాదారులతో ఇప్పటికే సాముదాయక రవాణా సదుపాయం ప్రారంభించబడింది.

  • నశ్వర వస్తువులు, విత్తనాలు, పాలు, పాడి ఉత్పత్తులుసహా నిత్యావసరాల సత్వర రవాణాకు 62 మార్గాల్లో నిర్దేశిత వేళల్లో 109 పార్శిల్‌ రైళ్లను నడుపుతున్న రైల్వేశాఖ

  • ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద 24.03.2020 నుంచి సుమారు 7.77 కోట్ల రైతు కుటుంబాలకు రూ.15,531కోట్ల మేర లబ్ధి.

  • ప్రాధాన్య గుర్తింపుగల నర్సరీలకు ధ్రువీకరణ ఈ ఏడాది జూన్‌ 30తో ముగియనున్న నేపథ్యంలో 2020 సెప్టెంబరు 30దాకా చెల్లుబాటు పొడిగింపు.

  • ఈ ఏడాది దేశ అవసరాలకు మించి గోధుమ దిగుబడి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఒప్పందాల మేరకు నాఫెడ్‌ ద్వారా ఆఫ్ఘనిస్థాన్‌, లెబనాన్‌లకు 90వేల టన్నుల ఎగుమతికి అనుమతి.

*****



(Release ID: 1613083) Visitor Counter : 178