శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19పై పోరు దిశగా రోగకారక నిర్మూలన దారి, రోడ్డు పరిశుభ్రత పరికరాలకు CSIR-CMERI దుర్గాపూర్‌ ప్రయోగశాల రూపకల్పన

Posted On: 10 APR 2020 11:52AM by PIB Hyderabad

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మహమ్మారిపై పోరులో తనవంతుగా శాస్త్ర-సాంకేతిక పరిష్కారాల అన్వేషణ కృషిని ‘భారత శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలి’ (CSIR) ముమ్మరం చేసింది. ఈ మేరకు సంస్థకు చెందిన దుర్గాపూర్‌లోని కేంద్రీయ మెకానికల్‌ పరిశోధన సంస్థ (CMERI) ప్రయోగశాలలో కొత్త ఆవిష్కరణలకు రూపమిచ్చింది:-

రోగకారక నిర్మూలన నడకదారి: ప్రస్తుతం అందుబాటులోగల అత్యంత సమగ్ర రోగకారక నిర్మూలన వ్యవస్థలుగా వీటిని పరిగణించవచ్చు. వీటిని ఏకాంత/క్వారంటైన్‌ చికిత్స ప్రాంతాలుసహా జన ప్రవేశం అధికంగా ఉండే ప్రతి ప్రదేశంలోనూ ఏర్పాటు చేయవచ్చు. ఇందుకోసం రెండురకాల ‘నడకదారుల’ను సీఎస్‌ఐఆర్‌ రూపొందించింది:

 

Description: F:\New folder (5)\Disinfection Walkway 1.jpg               Description: C:\Users\USER\Downloads\Press\DMC\untitled-4-2.jpg

  1. వాయుపీడన వ్యవస్థ: ఇది గరిష్ఠ జల్లు తెర ఏర్పడేలా చదరపు అంగుళంపై సుమారు 40 కిలోల బరువుతో గాలి ఒత్తిడిని సృష్టించగల కంప్రెసర్‌తో పనిచేస్తుంది. ఈ దారిలో మనం నడిచేటప్పుడు అందులో అమర్చిన సెన్సర్లు 20 నుంచి 40 సెకన్లపాటు కంప్రెసర్‌ను పనిచేయిస్తాయి. దీన్ని తొలుత సీఎంఈఆర్‌ఐ ప్రాంగణ ప్రధాన ద్వారంవద్ద 2 మీటర్ల ఎత్తు, 2.1 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పుతో అమర్చారు.

  2. జలశక్తి వ్యవస్థ: ఇందులోనూ గరిష్ఠ జల్లు తెర ఏర్పడే విధంగా 1 హార్స్‌పవర్‌ మోటారుతో పనిచేస్తుంది. ఇందులోని సెన్సర్లు కూడా 20 నుంచి 40 సెకన్లపాటు మోటారును పనిచేయించి పరిశుభ్రత ద్రవాన్ని వెదజల్లుతాయి. ఈ తరహా నడకదారిని సీఎంఈఆర్‌ఐ వైద్యకేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. వీటిని తమ ప్రాంగణాల ప్రవేశద్వారాల వద్ద ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.

రోడ్డు పరిశుభ్రత పరికరం:

   ఇది 2 నుంచి 5వేల లీటర్ల సామర్థ్యంగల ట్యాంకర్‌ ట్రాక్టరుకు అమర్చిన రోడ్డు పరిశుభ్రత వ్యవస్థ. ఇది అత్యంత భారీ గాలి ఒత్తిడితో రోడ్డుకు రెండువైపులా 16 అడుగుల మేర 75 కిలోమీటర్ల దూరందాకా పరిశుభ్రత ద్రవాన్ని వెదజల్లగలదు. వాహన రాకపోకలు అధికంగా ఉండే-రోగకారకాల ముప్పుగల పొడవైన రహదారులలో, టోల్‌ప్లాజాల సమీపాన ఈ ఉపకరణాన్ని వినియోగించవచ్చు. అలాగే గృహ-కార్యాలయ-క్రీడా సముదాయాలు, అపార్ట్‌మెంట్ల ప్రాంగణాల్లో వాడుకోవచ్చు.

 

Description: untitled-7-5.jpg       Description: Tractor operated road disinfection Spray System.jpg

*****



(Release ID: 1612893) Visitor Counter : 164