వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఎన్‌.ఎఫ్.సి.ఎ కిందికి రాని ల‌బ్ధిదారుల‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు జారీ చేసిన రేష‌న్ కార్డుల‌తో ఆహార‌ధాన్యాల పంపిణీ

దేశ వ్యాప్తంగా 72 రేక్ ల ద్వారా 2.16 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ఆహార ధాన్యాలు స‌ర‌ఫ‌రా చేసి రికార్డు సృష్టించిన ఎప్‌.సి.ఐ

Posted On: 09 APR 2020 8:46PM by PIB Hyderabad

 దేశంలో ఎన్.ఎఫ్‌.ఎస్‌.ఎ ప‌థ‌కం కిందికి రాని  , ఆయా రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు త‌మ త‌మ ప‌థ‌కాల కింద జారీచేసిన రేష‌న్ కార్డులు గ‌ల ల‌బ్ధిదారులంద‌రికీ , ఒకే  రీతిన‌ ప్ర‌తి వ్య‌క్తికి ప్ర‌తి నెల‌కు 5 కేజీల వంతున మూడు నెల‌ల పాటు ఆహార ధాన్యాలు పంపిణీ చేయాల్సిందిగా ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌.సి.ఐ)ని  కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. దీని ప్ర‌కారం గోధుమ‌లు రూ 21 రూపాయ‌లు , బియ్యం కేజీ 22 రూపాయ‌లుగా నిర్ణ‌యించారు. ఈ నిల్వ‌ల‌ను ఒకేసారి కానీ లేదా నెల‌వారీ గా గానీ మూడు నెల‌ల కాలానికి 2020 జూన్ వ‌ర‌కు తీసుకోవ‌చ్చు.
సహాయక చర్యలలో పాల్గొంటున్న‌ ఎన్జీఓలు , స్వచ్ఛంద సంస్థలకు మద్దతు ఇవ్వడానికి, గోధుమఅను కేజీ రూ21లకు  ,బియ్యం కేజీ రూ 22 ల‌కుఅందించాలని ప్రభుత్వం ఎఫ్‌.సి.ఐ కి ఆదేశాలు జారీచేసింది.  దేశవ్యాప్తంగా గ‌ల ఇలాంటి సంస్థ‌ల‌న్నింటికీ  ఎలాంటి  పరిమితి లేకుండా వీటిని అందించాల‌ని కోరింది. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో సమాజంలోని అన్ని వ‌ర్గాల‌కూ  తగిన ఆహార ధాన్యాలు సరసమైన ధరలకు లభించేలా చేయ‌డం ద్వారా దేశంలోని ఆహార ధాన్యాల‌ సరఫరా పై ఈ చ‌ర్య‌లు మంచి ప్రభావాన్ని చూపుతాయని భావిస్తున్నారు.
దేశంలోని 5.3 ల‌క్ష‌ల రేష‌న్ దుకాణాల ద్వారా 81 కోట్ల మంది ప్ర‌జానీకానికి ఆహార ధాన్యాల‌ను పంపిణీచేసే
 ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఆహార భ‌ద్ర‌తా కార్య‌క్ర‌మానికి, దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల‌ను తరలించడానికి ఎఫ్‌సిఐ బృహ‌త్ కార్య‌క్ర‌మం చేప‌ట్టింది.  ఈ సంస్జ 09-04-2020 న 71 రేక్ ల‌ద్వారా 2.16 ల‌క్ష‌ల ట‌న్నుల ఆహార ధాన్యాల‌ను స‌ర‌ఫ‌రా చేసి స‌రి కొత్త రికార్డును నెల‌కొల్పింది. . దీనితో, లాక్ డౌన్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుండి ఎఫ్‌సిఐ రవాణా చేసిన మొత్తం ఆహార ధాన్యాల‌ నిల్వలు 2.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి.
పిఎం గ‌రీబ్‌ కల్యాణ్ ఆన్ యోజన (పిఎమ్‌జికెఎ) కింద, మొత్తం 12.1  మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల‌ ఆహార ధాన్యాలు 81 కోట్ల మందికి 3 నెలల కాలంలో ప్ర‌తి వ్య‌క్తికి 5 కిలోల చొప్పున పంపిణీ చేస్తారు. దీని ప్రకారం ప్రతి రాష్ట్రంలో  పెద్ద మొత్తంలో ధాన్యాన్ని నిల్వ చేయాల్సిన స‌వాలును ఎదుర్కోవడానికి ఎఫ్‌సిఐ పూర్తిగా సన్నద్ధమైంది. పి.ఎం.జి.కె.ఎ.వై కింద రాష్ట్రాల‌ అవసరాలను తీర్చడానికి ఏప్రిల్ చివరి నాటికి రికార్డు స్థాయిలో 6 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బాయిల్డ్ రైస్ ను పశ్చిమ బెంగాల్‌కు తరలించడానికి ప్రత్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.
ఛత్తీస్‌గ డ్‌,, తెలంగాణ  ఒడిశా నుండి బాయిల్డ్‌రైస్ ను  తరలించడానికి ప్రణాళికలు రూపొందించారు,  ఈ రాష్ట్రాలు జాతీయ పూల్‌కు గరిష్టంగా బాయిల్డ్ రైస్‌ను అందిస్తాయి క‌నుక  ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.. బాయిల్డ్ రైస్‌ను ఆ రాష్ట్రానిక త‌ర‌లించ‌డానికి తగిన నిల్వ స్థలం కోసం,  గిడ్డంగుల నుండి  గోధుమ నిల్వలను త‌ర‌లించాల‌ని ఎఫ్‌.సి.ఐ ఆ రాష్ట్రానికి సూచించింది.

లాక్‌డౌన్ అనంతర ప‌రిస్థితుల‌లో పెద్ద ఎత్తున స‌ర‌కు ర‌వాణాను  చేపట్టడంతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గ డ్‌ వంటి రాష్ట్రాల్లో  ఎఫ్‌సిఐ బియ్యం సేకరణను నిర్వహిస్తోంది.  సామాజిక దూరం పాటించాల‌న్న భ‌ద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే ధాన్యం సేకరణ ప్రణాళికల ప్రకారం పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, యుపి, రాజస్థాన్ మొదలైన ప్ర‌ధాన రాష్ట్రాల నుంచి గోధుమ‌లను అందుకునేందుకు కూడా ఎఫ్‌.సి.ఐ సిద్ధ‌మౌతోంది. రబీ సీజన్లో సుమారు 40 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల  గోధుమలు , 9 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల  బియ్యం సేకరణతో, జాతీయ పూల్ లో  ఆహార ధాన్యం నిల్వలు పూర్తిగా నింపుతారు.దీనితో దేశ ఆహార భద్రతకు ఎటువంటి ముప్పు ఉండ‌దు.
.మ‌రిన్ని వివ‌రాల‌కు ఈ కింది లింకులు చూడండి.

పిఎంజికెఎవై కింద లబ్ధిదారులందరికీ ఆహార ధాన్యాల అదనపు కేటాయింపు కింద రాష్ట్రాల వారీగా త‌ర‌లించిన వివ‌రాలు..

లాక్‌డౌన్ స‌మ‌యంలో  రాష్ట్రాల వారీగా లోడ్ చేసిన రేక్‌ల వివ‌రాలు

లాక్‌డౌన్ స‌మ‌యంలో  రాష్ట్రాల వారీగా అన్ లోడ్ చేసిన రేక్ ల వివ‌రాలు


(Release ID: 1612762) Visitor Counter : 298