శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

వ్యక్తిగత రక్షణ సామగ్రిని మరింత పెంచే ఉద్దేశంతో ఆ పరిశ్రమతో కలిసి పని చేస్తున్న సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిఎస్ఐఆర్ –సిఈసిఆర్ఐ) ఆసక్తిగల గ్రామీణ మహిళలకు ఫేస్ మాస్క్ ల తయారీలో డిజటల్ శిక్షణ

Posted On: 08 APR 2020 11:27AM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా సి.ఎస్.ఐ.ఆర్. ప్రత్యేక ప్రయత్నాలు మొదలు పెట్టింది. తమిళనాడులోని కరైకుడిలోని సెంటర్ల్ ఎలక్ర్టోకెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సి.ఎస్.ఐ.ఆర్ – సి.ఈ.సి.ఆర్.ఐ) కాంపోనెంట్ ల్యాబ్ ద్వారా శాస్త్రీయ మార్గంలో సామాజిక సేవ చేసేందుకు సిద్దమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ -19 ను ఎదుర్కోవడానికి శానిటైజర్స్, హాస్పిటల్ అసిస్టెంట్ డివైజెస్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ (పి.పి.ఈ) అవసరం. ఆ దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల మేరకు (ఐసో-ప్రొపనాల్ 75%, గ్లిసరాల్ 1.45%, హైడ్రోజన్ పెరాక్సైడ్ 0.125% ప్లస్ సువాసన కోసం నిమ్మకాయ నూనె) కొబ్బరి నూనెను ఉపయోగించి సి.ఎస్.ఐ.ఆర్ – సిఈసిఆర్ఐ హ్యాండ్ వాష్ సొల్యూషన్స్, చమురు మరియు సోడియం హాపో క్లోరైట్ ఆధారిత క్రిమి సంహారక ద్వావణాలను తయారు చేశారు. వీటిని కంటైనర్లలో ప్యాక్ చేసి, ఉపయోగించడానికి సూచనలను ముద్రించి, అవసరమైన సంస్థలకు ఉచితంగా పంపిణీ చేశారు.

ఇప్పటి వరకూ సుమారు 350 లీటర్ల హ్యాండ్ శానిటైజర్లు, 250 లీటర్ల హ్యాండ్ వాష్ సొల్యూషన్లు మరియు 1000 లీటర్ల హైపో క్రిమి సంహారక మందుకు పంపిణీ అయ్యాయి. లబ్ధిదారుల్లో కారైకుడి మునిసిపల్ కార్పొరేషన్, దేవ కోట్టై మున్సిపల్ కార్పోరేషన్, శివగంగ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, కారైకుడి ప్రభుత్వ ఆసుపత్రి, శివగంగ ఎస్పీ ఆఫీసు, కారైక్కుడి చుట్టుపక్కల ఇతర పోలీస్ స్టేషన్లు, తాలూకా ఆఫీసు మరియు దగ్గరలో పంచాయతీ కార్యాలయాలు, సక్కొట్టై, కొట్టైయూర్, ఆర్.ఎస్.పట్టినం, నేర్కుప్పై  ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, కొన్ని జాతీయ బ్యాంకులు మొదలైనవి ఉన్నాయి. కోవిడ్ -19 సాధారణ స్థితికి వచ్చే వరకూ ఈ పంపిణీ కొనసాగించాలని సి.ఈ.సి.ఆర్.ఐ. యోచిస్తోంది.

 

దీనితో పాటు సి.ఎస్.ఐ.ఆర్. – సి.ఈ.సి.ఆర్.ఐ. ఆసక్తిగల గ్రామీణ మహిళలకు ఫేస్ మాస్క్ ల తయారీలో డిజిటల్ శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. వారికి సాయం చేయడానికి మరియు వారి పొరుగు వారి అవసరాలు తీర్చడానికి మరో వైపు రోగుల తుమ్ము, దగ్గు మరియు ఏరోసోల్ కమ్యూనికేషన్ నుంచి సమర్థవంతంగా రఙించడానికి పునర్వినియోగించగల త్రీడీ ప్రింటెడ్ ఫేస్ షీల్డ్ ను సిఎస్ఐఆర్-సిఈసిఆర్ఐ ముద్రించి డిస్పెన్సరీ సిబ్బందికి ఉచితంగా అందజేయడం జరిగింది.

వివిధ పరిశ్రమలతో కలిసి సిఎస్ఐఆర్-సిఈసిఆర్ఐ కోవిడ్ -19 కు అవసరమైన వస్తువుల ఉత్పత్తిని భారీగా పెంచేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఫేస్ షీల్డ్ కోసం బెంగళూరులోని త్రీడీ లైకాన్ అనే సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. సిఎస్ఐఆర్-సిఈసిఆర్ఐ ఫేస్ షీల్డ్ యొక్క సినర్జిస్టిక్ గా మరింత మెరుగ్గా యాంటీ మైక్రోబ్యాక్టిరియల్ సామర్థ్యంతో అతితక్కువ వ్యవధిలో సిద్ధం కానుంది. సిఎస్ఐఆర్-సిఈసిఆర్ఐ హైపో క్లోరైట్ (క్రిమిసంహారకం) యొక్క ఎలక్ట్రోకెమికల్ సంశ్లేషణపై సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తోంది. ఇది భారీ ఉత్పత్తి మరియు సరఫరా కోసం ప్రయత్నించే ఎం.ఎస్.ఎం.ఈ.కి బదిలీ చేయబడుతుంది. దీన్ని మరింత విస్తరించి క్రిమి సంహారక స్ప్రేలను ఆస్పత్రులు, బహిరంగా ప్రదేశాల్లో చల్లనుంది. ఈ విధంగా సమాజం కోంస శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ డా. ఆర్.ఎం. అలగప్ప చెట్టియార్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తోంది. ఈ సంస్థ  కోసం భూమి మరియు నగదును విరాళంగా ఇచ్చిన అలగప్ప చెట్టియార్ వారసత్వ పట్టణం కరైకుడిలో సిఎస్ఐఆర్-సిఈసిఆర్ఐ స్థాపనలో కీలక పాత్ర పోషించారు.

 

 

                               

 

న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ )సిఎస్ఐఆర్) ఆధ్వర్యంలో నడుస్తున్న సెంట్రల్ ఎలెక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సి.ఈ.సి.ఆర్.ఐ), ఎలక్ట్రో కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అనేక మెరుగైన ఉత్పత్తులు, మరియు ప్రక్రియల అభివృద్ధి మీద దృష్టి పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా  ప్రయోగశాలలు మరియు ప్రైవేట్ సంస్థల సహకారంతో అనేక ప్రాజెక్టులను నడుపుతోంది.

సిఎస్ఐఆర్-సిఈసిఆర్ఐ సర్వేలు నిర్వహించడం, కన్సల్టెన్సీ ప్రాజెక్టులు చేపడ్డం ద్వారా భారతదేశ పరిశ్రమలకు సాయం అందిస్తోంది. మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమంలో భాగాంగా నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు, పరిశోధనలు నడుపుతోంది. అంతే కాకుండా భారతీయు యువత కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణలను నిర్వహిస్తోంది. తమ ప్రయోగాలతో పాటు సామాజిక బాధ్యతగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది.


(Release ID: 1612181)