పర్యటక మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 769 విదేశీ పర్యాటకులు తాము భారతదేశంలో నిలిచిపోయినట్టు, స్ట్రాండెడ్ ఇండియా పోర్టల్‌లో తొలి ఐదు రోజుల్లోనే నమోదు
ఈ పోర్టల్ ద్వారా సహాయం కోరిన వారికి వివిధ రూపాలలో సహాయం అందనుంది.
Posted On:
06 APR 2020 11:59AM by PIB Hyderabad
కోవిడ్ -`19 మహమ్మారి ఫలితంగా దేశంలో విధించిన లాక్‌డౌన్‌తో భారతదేశంలో ఉండిపోయిన విదేశీ పర్యాటకులకు సహాయం చేసేందుకు భారత ప్రభుత్వానికి చెందిన పర్యాటక మంత్రిత్వశాఖ 2020 మార్చి 31న www.strandedinindia.com పోర్టల్ ను ప్రారంభించింది. ఇలా దేశంలో నిలిచిపోయిన పర్యాటకులు ఈ పోర్టల్ లో లాగ్ ఆన్ అయి, వారికి సంబంధించిన మౌలిక కాంటాక్ట్ సమాచారాన్ని , వారు ఎదుర్కొంటున్న సమస్యను తెలియజేయవలసి ఉంటుంది. ఈ పోర్టల్ ప్రారంభించిన తొలి 5 రోజులలోనే దేశవ్యాప్తంగా 769 మంది విదేశీ పర్యాటకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ఇలాంటి విదేశీ పర్యాటకులకు సహాయం చేయడానికి ప్రతి రాష్ట్రప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంత పాలనాయంత్రాంగం ఒక నోడల్ అధికారిని గుర్తించి ఏర్పాటు చేసిందది. పర్యాటక మంత్రిత్వశాకకు చెందిన 5 ప్రాంతీయ కార్యాలయాలు, విదేశీ పర్యాటకులు సహాయం కోరుతూ ఈ పోర్టల్ ద్వారా పంపిన విజ్ఞాపనలకు సంబంధించి నిరంతరం నోడల్ అధికారులతో సమన్వయం చేసకుంటున్నాయి. ఆ రకంగా వారికి అవసరమైన సహాయాన్ని క్షేత్ర స్థాయిలో అందే ఏర్పాటు చేస్తారు. పర్యాటక మంత్రిత్వశాఖకు చెందిన ప్రాంతీయ కార్యాలయాలు, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, ఎఫ్.ఆర్.ఆర్ ఒలతో ఎప్పటికప్పుడు సమన్వయం కలిగి ఉంటాయి. ఇవి విదేశీ పర్యాటకులు ఎదుర్కొనే వీసా సమస్యల వంటి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి, అలాంటి పర్యాటకులను స్వదేశానికి పంపడానికి విదేశీ వ్యవహారాలు,హోం మంత్రిత్వశాఖలతో , సంబంధిత ఎంబసీలు, హై కమిషన్, కాన్సులేట్ లతోసంప్రదింపులను సమన్వయం చేసేందుకు చర్యలు తీసుకుంటారు.
ఈ మెయిళ్లు, టెలిఫోన్ సమాచారం, వ్యక్తిగతంగా విదేశీ పర్యాటకులు కోరుతున్న సహాయం వంటి వాటి ఆధారంగా ఈ పోర్టల్ ఉపయోగం, సమర్థతను అంచనావేయవచ్చు. వీరిని మనదేశంలో గల సంబంధిత దేశాల విదేశీ కార్యాలయాలతో అనుసంధానం చేసి వారికి అవసరమైన తాజా సమాచారం అందించడం జరుగుతోంది. ఇండియానుంచి ఆయా దేశాలకు వెళ్లే విమానాలకు సంబంధించిన సమాచారం అందిస్తున్నారు. అవసరమైన సందర్భాలలో వారికి వైద్య సహాయం, ఆహారం, వసతి కల్పిస్తున్నారు.
కోవిడ్ -19 లాక్ డౌన్‌కారణంగా అమెరికాకు చెందిన ఒక మహిళ బీహార్ల లోని సుపౌల్ లో ఉండిపోయారు. ఢిల్లీలో ఆమె కుమారుడికి ఆపరేషన్ చేయించుకుంటుండడంతో ఆమె ఇక్కడ ఉండిపోయారు. ఈ పోర్టల్ ద్వారా ఆమెకు అంతర్ మంత్రిత్వశాఖ, అంతర్ విభాగాల, కేంద్ర రాష్ర ప్రభుత్వాల సమన్యవంతో ఆమెకు ఢిల్లీ వెళ్లడానికి ప్రత్యేక ప్రయాణ పర్మిట్ జారీచేయడం జరిగింది. ఆమె సురక్షితంగా గమ్య స్థానానికి చేరుకున్నారు. సంబంధిత ఏజెన్సీలు ఈ విషయంలో చేసిన కృషికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
కోస్టీరీకా కుచెందిన ఇద్దరు పౌరులు వైద్య పర్యాటకం కింద శస్త్రచికిత్సకోసం చెన్నై వచ్చారు. వీరు ఆపరేషన్ అనంతరం చెన్నైలో చిక్కుకుపోయారు. రాష్ట్రప్రభుత్వం, కోస్టారీకా ఎంబసీ, వీరు ఉంటున్న హోటల్ వారు పర్యాటకుల భయాలను పోగొట్టి వారికి ధైర్యం చెప్పడంలో తోడ్పాటు నందించాయి. వారు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన ఒక పర్యాటకుడు అహ్మదాబాద్‌లో చిక్కుకుపోయారు. ఈ పర్యాటకుడికి మూర్ఛ వ్యాధి ఉంది. లాక్ డౌన్ కారణంగా ఈ పర్యాటకుడు ఆస్ట్రేలియన్ డాక్టర్లు సూచించిన వైద్యం చేయించుకోకుండానే వెళ్లిపోయాడు. ఈ పోర్టల్ జిల్లా కలెక్టర్ ద్వారా అతడిని గుర్తించి, అతనికి తగిన వైద్య సేవలు అందించడం జరిగింది. అతనికి ఆహారం , స్థానిక రవాణా వంటి వాటిని కల్పించడం జరిగింది. ప్రస్తుతం వారు సురక్షితంగా ఉన్నారు.
పైన పేర్కొన్న ఉదాహరణలు ఈ పోర్టల్ సహాయం చేసిన వాటిలో కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ పోర్టల్ ద్వారా కీలక సమయంలో ఎందరో సహాయం పొందారు. రాగల రోజులలో ఈ పోర్టల్ విదేశీ పర్యాటకులకు సేవలు అందించనుంది. విదేశీ అతిథులైన పర్యాటకులు మన దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది అతిథి దేవో భవ అన్న స్ఫూర్తికి ఇది అద్దం పడుతోంది.
(Release ID: 1611589)
Visitor Counter : 219
Read this release in:
Assamese
,
Kannada
,
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam