రాష్ట్రప‌తి స‌చివాల‌యం

మహావీర్ జయంతి సందర్భంగా ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 05 APR 2020 6:55PM by PIB Hyderabad

పవిత్రమైన మహావీర్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు, ప్రత్యేకించి జైనులకు నా శుభాకాంక్షలు అని భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

మహావీరుని  అహింస గురించిన గొప్ప బోధనలు, సత్యము మరియు పరిత్యాగము వంటివి ప్రతీ వ్యక్తికి  మరియు ఏ కాలంలో అయినా పాటించవలసిన బోధనలని, సమసమాజ స్థాపనకు అవసరమైన  ఒకరికొకరు సమన్వయంతో సహకరించుకోవడం ద్వారా ప్రతీ వ్యక్తికి సమాన అవకాశాలు పొందవచ్చని, మహావీరుని బొధనలను పాటించడం ద్వారా వీటిని సాధించవచ్చని శ్రీ రామనాథ్ కోవింద్ తెలిపారు.

శ్రీ మహావీరుని బోధనల స్ఫూర్తితో శాంతి, ప్రేమ, సద్గుణము మరియు సామరస్యం ప్రపంచంలో నెలకొల్పవచ్చని అన్నారు. కొవిడ్-19 వైరస్  వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించి సామాజిక దూరం పాటించాలని దేశ పౌరులను రాష్ట్రపతి కోరారు.

భారత రాష్ట్రపతి సందేశం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి

Click here to see President’s message


(రిలీజ్ ఐడి: 1611443) సందర్శకుల సూచీ సంఖ్య : : 113
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil