రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్ -19 మహమ్మారిపై భారత్ పోరాటం : నిరుపేదలకు సహాయం అందించిన గోవా నౌకా స్థావరం

Posted On: 03 APR 2020 8:32PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా పాటిస్తున్న లాక్ డౌన్ సందర్భంగా సామాన్య ప్రజానీకం, దుస్థితిలో ఉన్న స్థానికులను ఆదుకునేందుకు  గోవా నౌకాస్థావరం అధికారులు ఆహారం, నిత్యావసర సరుకుల పంపిణీ జరిపారు.

2020 ఏప్రిల్ ఒకటవ తేదీన మంగోర్ హిల్ ప్రాంత కౌన్సిలర్ తో కలసి గోవా నౌకా స్థావరం అధికారులు గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న రోజు కూలీలు, వలస కార్మికులు మరియు అల్పాదాయ వర్గాలకు చెందిన కుటుంబాలకు అత్యవసరమైన వస్తువుల పంపిణీ చేశారు.  దాదాపు 200 కుటుంబాలకు 1000 కిలోల అత్యవసర కిరాణా సరుకులు పంపిణీ చేశారు. అవికాకుండా పేదలకు పంపిణీ చేసేందుకు పట్టణాభివృద్ధి మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మిలింద్ నాయక్ కు 600 కిలోల అత్యవసర కిరాణా సరుకులు అందజేశారు.

ఈ వారం మొదట్లో రక్షణ భద్రతా దళానికి చెందిన జవాన్లు మరియు ఐ ఎన్ ఎస్ హంసకు చెందిన నావికా దళ సిబ్బంది వాస్కో, గోవాలోని వివిధ ప్రదేశాలలో ఆహారం పంపిణీ చేశారు. వాస్కో రైల్వే స్టేషన్, బోగ్డా మరియు గోవా లోని రామాలయ ప్రాంతంలో 320 మందికి వండిన ఆహారం సమకూర్చారు.

****



(Release ID: 1610875) Visitor Counter : 127