రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్ -19పై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది ర‌క్ష‌ణ‌కు బ‌యోసూట్ల‌త‌యారీలో కుట్టుఅతుకుకు జిగురు ను అభివృద్ధి చేసిన డిఆర్‌డిఒ

Posted On: 02 APR 2020 6:47PM by PIB Hyderabad

కోవిడ్ -19 ప్ర‌మాద‌క‌ర వైర‌స్‌పై పోరాటం చేస్తున్న వైద్యులు, పారామెడిక‌ల్ సిబ్బంది ర‌క్ష‌ణ‌కు డిఫెన్స్ రిసెర్చ్ డ‌వ‌ల‌ప్ మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డి ఆర్ డి ఒ) ఒక బ‌యో సూట్‌ను అభివృద్ధి చేసింది. డిఆర్‌డిఒ లోని శాస్త్ర‌వేత్త‌లు టెక్స్‌టైల్ కోటింగ్‌,  వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ ప‌రిక‌రాల అభివృద్ధి , నానోటెక్నాల‌జీ రంగాల‌లో
 నైపుణ్యాన్ని పూత పూసిన‌ నిర్దిష్ట రకమైన ఫాబ్రిక్ ను వ్యక్తిగత రక్షణ సామగ్రి (PPE) అభివృద్ధి చేయడానికి ఉపయోగించారు.
ఈ సూట్‌ను ప‌రిశ్ర‌మ వ‌ర్గాల స‌హాయంతో త‌యారుచేశారు. అలాగే దీనిని వ‌స్త్ర‌రంగానిక సంబంధించిన ప్ర‌మాణాలు, సింథ‌టిక్ ర‌క్తం నుంచి ర‌క్ష‌ణ‌కు సంబంధించి తీవ్ర ప‌రీక్ష‌ల‌కు గురిచేసిన అనంత‌రం దీనిని రూపొందించారు. సింథ‌టిక్ ర‌క్తంనుంచి ర‌క్ష‌న‌కు ఉద్దేశించిన ప్ర‌మాణాలు, కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ (ఎం.హె.ఎఫ్‌.డబ్ల్యు) బాడీ సూట్ల‌కు నిర్దేశించిన ప్ర‌మాణాల కంటే మెరుగైన‌వి.
ఈ సూట్ల‌ను పెద్ద సంఖ్య‌లో త‌యారు చేసి, క‌రోనా మ‌హ‌మ్మారిపై ముందువ‌రుస‌లో నిల‌బ‌డి పోరాటం చేస్తున్న వైద్య‌సిబ్బంది, పారామెడిక‌ల్ సిబ్బంది, ఇత‌రుల‌కు అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది.
ఈ సూట్ ల‌ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడానికి పరిశ్రమవ‌ర్గాలు సన్నద్ధమ‌య్యాయి. కుసుమ్‌ఘ‌ర్ ఇండస్ట్రీస్ ముడి పదార్థం, పూత పదార్థాన్ని ఉత్పత్తి చేస్తోంది, పూర్తి సూట్ మరొక విక్రేత సహాయంతో తయారు చేస్తున్నారు. ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 7,000 సూట్లు గా ఉంది.
వస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లో అనుభవం గ‌ల మరో విక్రేతను ఆహ్వానించి  రోజుకు 15,000 సూట్ల త‌యారీ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సూట్ల త‌యారీకి అవ‌స‌ర‌మైన‌ సీమ్ సీలింగ్ టేపులు అందుబాటులో లేకపోవడంతో దేశంలో డిఆర్‌డిఓ పరిశ్రమ భాగస్వాములు,  ఇతర పరిశ్రమలు బయో సూట్ ఉత్పత్తి చేయ‌డానికి ఇబ్బంది ప‌డుతున్నాయి.

జలాంతర్గామి అప్లికేష‌న్ల‌లో ఉపయోగించే సీలెంట్ ఆధారంగా సీమ్ సీలింగ్ టేప్‌కు ప్రత్యామ్నాయంగా DRDO ప్రత్యేక సీలెంట్‌ను సిద్ధం చేసింది. ప్రస్తుతం, పరిశ్రమ భాగస్వామి సీమ్ సీలింగ్ కోసం ఈ జిగురును ఉపయోగించి తయారుచేసిన బయో సూట్లను కోయంబత్తూర్‌లోని దక్షిణ భారత టెక్స్‌టైల్ రీసెర్చ్ అసోసియేషన్ (సిట్రా) నిర్వ‌హించిన  పరీక్షను క్లియర్ చేశాయి. వస్త్ర పరిశ్రమకు దిశ‌ను ఇది మార్చ‌గ‌ల‌ద‌ని భావిస్తున్నారు.. సూట్ తయారీదారులకు  సీమ్ సీలింగ్ కార్యకలాపాల కోసం DRDO, పరిశ్రమ వ‌ర్గాల ద్వారా ఈ జిగురును భారీగా ఉత్పత్తి చేయనుంది.

రసాయన, జీవ, రేడియోలాజికల్ , న్యూక్లియర్ (సిబిఆర్ఎన్) ఏజెంట్లకు వ్యతిరేకంగా రక్షణ కోసం డిఆర్‌డిఒ అనేక ఉత్పత్తులు , సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది.  డిఆర్‌డిఓ ప‌రిశోధ‌న శాల అయిన‌ గ్వాలియ‌ర్ లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డిఆర్‌డిఇ) , కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ , న్యూక్లియర్ (సిబిఆర్‌ఎన్) ప‌ర్మియ‌బుల్   సూట్ ఎమ్‌కె- 5  ను అభివృద్ధి చేసింది.  ఆర్మీ , నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) కు 53 వేల సూట్లు ఇప్ప‌టికే సరఫరా చేశారు.
రేడియ‌లాజిల్ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు  ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియ‌ర్ మెడిసిన్‌, అలీడ్ సైన్సెస్ (ఐఎన్ఎంఎఎస్‌) న్యూఢిల్లీ పున‌ర్ వినియోగ సూట్ ను ముందుగా అభివృద్ధిచేశారు.
 ఆగ్రాలోని ఏరియ‌ల్ డెలివ‌రీ రిసెర్చ్ డవ‌ల‌ప్‌మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (ఎడిఆర్ డిఇ) సంస్థ ప్రొట‌క్టివ్ టెక్నిక‌ల్ టెక్స్‌టైల్ ఫ్యాబ్రిక్‌ల‌తో వివిధ‌ర‌కాల పారాచూట్‌ల‌ను త‌యారు చేసింది.



(Release ID: 1610565) Visitor Counter : 264