సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

దూరదర్శన్ను వీక్షిస్తున్న భారత్, కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతోంది భారత్

Posted On: 02 APR 2020 7:20PM by PIB Hyderabad

దూరదర్శన్లో నిన్నటి తరంలో వీక్షకుల అభిమానం చూరగొన్న అత్యంత ప్రజాదరణ పొందిన నాటికలను ఈ లాక్డౌన్ సందర్భంగా డిడి నేషనల్ మరియు డిడి భారతి ఛానెళ్ళలో పున:ప్రసారం చేస్తూ మళ్ళీ ప్రజల మనస్సుల్లో తనదైన ముద్రను  వేసి మనస్సులను గెలుచుకుంటోంది జాతీయ ప్రసార మాధ్యమం దూరదర్శన్. దూరదర్శన్ తన అత్యంత ప్రజాదరణ పొందిన  పూర్వ ప్రసారాలను పున:ప్రసారం చేస్తూ ప్రజలను ఇంటి వద్దే ఉండేటట్లు చేయడంలో తన లక్ష్యాన్ని చేరుకొన్నదని బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా(బిఏఆర్కే) ఇటీవలి తన నివేదికలో తెలిపింది. టివి వీక్షకుల సంఖ్యను గణిస్తున్న 2015 నుండి హింది జిఇసిలో  పున:ప్రసారమవుతున్న రామాయణం అత్యంత ఎక్కువ రేటింగును పొందిందని బార్క్ నివేదిక  తెలిపింది

కొవిడ్-19 వ్యాపి నిరోధంలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ సందర్భంగా ప్రభుత్వ రంగ ప్రసార మాధ్యమం దూరదర్శన్ 80ల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పౌరాణిక సీరియళ్ళు ’రామాయణం’ మరియు ’మహాభారతం’లను పున:ప్రసారం చేస్తోంది. ఈ పౌరాణిక సీరియళ్ళను పున:ప్రసారం చేయాలనే ప్రజల కోరిక మేరకు, లాక్డౌన్  సందర్భంగా ఇళ్ళకు పరిమితమైన ప్రజల కొరకు ఈ నిర్ణయం తీసుకోబడింది. వీటితోపాటు ప్రజల కోరిక మేరకు ప్రజాదరణ పొందిన శక్తిమాన్, శ్రీమాన్ శ్రీమతి, చాణక్య, దేఖ్ భాయి దేఖ్, బునియాద్, సర్కస్ మరియు బ్యోమకేష్ బక్షి  వంటి సీరియళ్ళను డిడి నేషనల్ ఛానెల్లో ప్రసారం చేస్తున్నది, డిడి భారతిలో అలీఫ్ లైలా, ఉపనిషద్ గంగాలను ప్రసారం చేస్తున్నది.       

డిడి నేషనల్ ఛానల్లో 28 మార్చి 2020, శనివారం నుండి  రోజుకు రెండు సార్లు పున:ప్రసారమవుతున్న పౌరాణిక సీరియళ్ళకు ప్రజలు, ప్రముఖ వ్యక్తుల నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది,  ఈ సీరియళ్లలో నటించిన నటీనటులు సామాజిక  మాధ్యమాల్లో వారి వీడియోలను పోస్ట్ చేస్తూ దూరదర్శన్ యొక్క కృషిని ప్రశంసిస్తూ ఈ సీరియళ్ళను వీక్షించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.  డిడి నేషనల్ ఛానల్ల్ రామాయణం రోజుకు రెండు సార్లు ఉదయం 9 గంటలకు మరియు రాత్రి 9 గంటలకు ఎటువంటి పున:ప్రసారం లేకుండా  ప్రసారం చేయబడుతుండగా   అదే విధంగా డిడి భారతిలో మహాభారతం రోజుకు రెండు సార్లు మధ్యహ్నాం 12 గంటలకు మరియు రాత్రి 7 గంటలకు   ప్రతీరోజూ ప్రసారం చేయబడుతోంది. వినోద ప్రధానంగా సాగే సీరియళ్ళు డిడి నేషనల్ ఛానల్లో మధ్యహ్నాం 3 గంటలకు సర్కస్ సీరియల్తో ప్రారంభమై 4 గంటలకు శ్రీమాన్ శ్రీమతి, 5 గంటలకు బునియాద్ ప్రసారమవుతాయి. డిడి నేషనల్ సాయంత్రం ప్రసారాల్లో భాగంగా 6 గంటలకు దేఖ్ భాయి దేఖ్ , 8 గంటలకు శక్తిమాన్ మరియు 9 గంటలకు 9 రామాయణం, 10 గంటలకు చాణక్యతో ముగుస్తాయి.  డిడి భారతిలో ఉదయం 10.30 గంటలకు అలీఫ్ లైలా  మరియు సాయంత్రం 6 గంటలకు ఉపనిషద్ గంగా ప్రసారమవుతాయి.

కొవిడ్-19 విశ్వమహమ్మారిపై పోరాటంలొ భాగంగా విధించిన 21 రోజుల లాక్డౌన్ కారణంగా ప్రజలను ఇంటి వద్దే ఉంచే బాధ్యతను పంచుకోవడంలో భారత ప్రభుత్వ రంగ మాధ్యమమైన దూరదర్శన్కు ఈ సీరియళ్ల కారణంగా శ్రద్ధగా వీక్షించే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది



(Release ID: 1610515) Visitor Counter : 169