ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 దిగ్బంధం నేపథ్యంలో ఆరోగ్యబీమా - మోటారు వాహన

తృతీయపక్ష బీమా పాలసీదారులకు ఊరట కల్పించిన ప్రభుత్వం

Posted On: 02 APR 2020 1:13PM by PIB Hyderabad

  కోవిడ్‌-19 దిగ్బంధం నేపథ్యంలో ఆరోగ్యబీమా - మోటారు వాహన తృతీయపక్ష బీమా పాలసీదారులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2020 ఏప్రిల్‌ 1న అధికార ప్రకటన జారీచేసింది. తదనుగుణంగా 2020 మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 14వ తేదీ మధ్య నవీకరణ చేసుకోవాల్సిన పాలసీల గడువును ఏప్రిల్‌ 21వరకూ పొడిగిస్తున్నట్లు తెలిపింది.

మోటారు వాహన నిర్బంధ తృతీయపక్ష, సాధారణ ఆరోగ్య బీమా:

   మీ ప్రస్తుత మోటారు వాహన నిర్బంధ తృతీయపక్ష బీమా పాలసీ నవీకరణ గడువు మార్చి 25-ఏప్రిల్‌ 14 మధ్య ముగిసే పక్షంలో దేశవ్యాప్త దిగ్బంధం ఉన్నందున ఏప్రిల్‌ 21వ తేదీవరకూ గడువును పొడిగిస్తున్నట్లు అధికార ప్రకటన వివరించింది. అలాగే సాధారణ ఆరోగ్య బీమా విషయంలోనూ నవీకరణ గడువు మార్చి 25-ఏప్రిల్‌ 14వ తేదీల మధ్య ముగిసేట్లయితే ఏప్రిల్‌ 21వ తేదీవరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటన పేర్కొంది.

******



(Release ID: 1610262) Visitor Counter : 180