రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

తక్కువ ధరలో టెంపరేచర్ గన్ ను తయారు చేసిన నావల్ డక్ యార్డ్

Posted On: 02 APR 2020 11:25AM by PIB Hyderabad

ప్రవేశ ద్వారా వద్ద పెద్ద సంఖ్యలో సిబ్బంది పరీక్షించడం కోసం ముంబైలోని నావెల్ డక్ యార్డ్ స్వీయ ఐ.ఆర్. ఆధారిత ఉష్లోగ్రత సెన్సార్ కలిగిన చేతిలో పట్టుకోగలిగే హ్యాండ్ గన్ ను రూపొందించి అభివృద్ధి చేసింది. ఈ పరికరాన్ని కేవలం రూ.1000 లోపలే తయారు చేయగలిగింది. ఫలితంగా సెక్యూరిటీ సెంట్రీలపై భారాన్ని తగ్గించగలిగింది. ఈ హ్యాండ్ గన్ ధర్ మార్కెట్ లో లభించే ఇతర హ్యాండ్ గన్ లతో పోలిస్తే చాలా తక్కువ.

కోవిడ్ -19 మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు దారి తీసింది. ఈ వైరస్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో వైద్య మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అనేక సవాళ్ళు ఎదురౌతున్నాయి.

వెస్ట్రన్ నావల్ కమాండ్ కు చెందిన 285 సంవత్సరాల చరిత్ర గల నావెల్ డక్ యార్డ్ ప్రాంగణంలో ప్రతిరోజూ సగటున 20,000 మంది సిబ్బంది ప్రవేశిస్తూ ఉంటారు. కోవిడ్ -19 వ్యాప్తి దృష్ట్యా ఈ వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేసేందుకు సిబ్బందికి డక్ యార్డ్ లో ప్రవేశించడానికి ముందే ప్రారంభ పరీక్షలు చేయడం అవసరం. ఈ నేపథ్యంలో శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయడమే ఈ వైరస్ సోకిందా లేదా అని తెలుసుకునే ప్రాథమిక పద్ధతి.

కోవిడ్ -19 వ్యాప్తి తర్వాత నాన్ కాంటాక్ట్ ధర్మామీటర్లు లేదా ఉష్ణోగ్రత తుపాకులకు మార్కెట్ లో కొరత ఏర్పడింది. దానితో పాటు ధర కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. పెద్ద సఖ్యంలో ఉన్న ఈ కొరతను అధిగమించేందుకు ముంబై నావల్ డక్ యార్డ్ 0.02 డిగ్రీల సెల్సియస్ కచ్చితత్త్వంతో స్వీయ హ్యాండ్ హెల్డ్ ఆధారిత ఉష్ణోగ్రత సెన్సార్ ను అభివృద్ధి చేసింది. ఇన్ఫ్రారెడ్ సెన్సార్ మరియు 9 వోల్టుల బ్యాటరీతో పని చేసే ఈ నాన్ కాంటాక్ట్ ధర్మా మీటర్ లో ఎల్.ఈ.డి. డిస్ ప్లే ఉంది. దీని వల్ల ప్రవేశ ద్వారా వద్ద పెద్ద సంఖ్యలో సిబ్బందిని పరీక్షించే విషయంలో భద్రతా సిబ్బంది మీద ఉన్న పని భారాన్ని తగ్గించింది.

ఉత్పాదక వ్యయం కేవలం రూ.1000 కంటే తక్కువ ఉన్నందున, అవసరమైతే ఈ ఉత్పత్తిని పెంచి, అవసరమైన వారికి అందుబాటులోకి తీసుకొచ్చే సామర్థ్యం కూడా డక్ యార్డ్ కు ఉంది.


(Release ID: 1610217) Visitor Counter : 224