హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్-19పై పోరులో భాగంగా దిగ్బంధం చర్యలను అక్షరాలా అమలు చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు దేశీయాంగ శాఖ విజ్ఞప్తి

Posted On: 01 APR 2020 7:55PM by PIB Hyderabad

 దేశంలో కోవిడ్‌-19 గొలుసుక‌ట్టు సంక్ర‌మ‌ణ‌ను విచ్ఛిన్నం చేసే దిశ‌గా దిగ్బంధం ప‌టిష్ట‌ అమ‌లుకు కేంద్ర మంత్రిత్వ శాఖ‌లు/విభాగాలతోపాటు రాష్ట్ర‌, కేంద్రపాలిత ప్రాంతాల ప్ర‌భుత్వాలు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై కేంద్ర దేశీయాంగ శాఖ (MHA) స‌మీకృత మార్గ‌ద‌ర్శ‌కాలు జారీచేసింది. కొన్ని రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో దిగ్బంధ చర్యలను మినహాయింపులకు అతీతంగా సడలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ‘విపత్తుల నిర్వహణ చట్టం-2005’ కింద జారీచేసిన సమీకృత మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19పై సమర్థ పోరాటం కోసం ‘విపత్తుల నిర్వహణ చట్టం-2005’ కింద దఖలుపడిన అధికారాలను వినియోగించుకోవాలని కేంద్ర దేశీయాంగ శాఖ కార్యదర్శి శ్రీ అజయ్‌కుమార్ భల్లా సూచించారు. తదనుగుణంగా దిగ్బంధం నిబంధనలను అక్షరాలా అమలు చేయాలని కోరుతూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలకులకు సమాచారం పంపారు.

****



(Release ID: 1610121) Visitor Counter : 135