PIB Headquarters
పిఐబి డెయిలీ బులిటన్ 1.4.2020
కోవిడ్ -19 తాజా సమాచారం
Posted On:
01 APR 2020 6:26PM by PIB Hyderabad
ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కోవిడ్ -19పై తాజా సమాచారం, దేశంలో కోవిడ్ -19 నిరోధం, నియంత్రణ, నిర్వహణకు సంబంధించి తీసుకుంటున్న వివిధ చర్యలు .ఇప్పటివరకు 1637 నిర్ధారిత కేసులు ,38 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో 376 కొత్త నిర్ధారిత కేసులు, 3 కొత్త మరణాలు నమొదయ్యాయి. 132 మందికి వ్యాధి నయమై ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1609932.
రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు, డి.జిపిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కేబినెట్ సెక్రటరీ
తబ్లిఘి జమాత్ లో పాల్గొన్న వారలో ఎక్కువమంది వైరస్ బారిన పడిన వారున్నట్టు తేలడంతో ఈ పరిణామం, కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి కట్టడి చర్యలను ప్రమాదంలోకి నెట్టిన విషయమై రాష్ట్రాలను అప్రమత్తం చేయడం జరిగింది.
ఈ సమావేశానికి హాజరైన వారు ఎవరెవరని కలిశారన్న దానికి సంబంధించిన దానిని గుర్తించే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలను కోరింది.
తబ్లిఘ్ జమాత్‌లో పాల్గొన్న విదేశీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలింది. వీసా నిబంధనలను ఉల్లంఘించిన విదేశీయులపైన , నిర్వాహకులపైన చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్రాలను కోరారు.
వచ్చే వారం రోజులలో రాష్ట్రాలు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను అమలు చేయాలని కేంద్రం కోరింది. లబ్ధిదారులకు ఈ పథకం కింద పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేయాల్సి ఉంటుంది. సామాజిక దూరం పాటిస్తూ దీనిని చేపట్టవలసిఉంటుంది.
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పటిష్టంగా అమలు జరుగుతున్నట్టు గుర్తించడం జరిగింది. సామాజిక దూరం పాటిస్తూ, సరకును ఎలాంటి అడ్డంకులు లేకుండా రాష్ట్రాల మధ్య రవాణా జరిగేట్టు చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్రాలను కోరడం జరిగింది.
నిత్యవాసర సరకుల తయారీ జరిగేట్టు చూడాలని, అలాగే వీటి సరఫరా వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చూడాలని రాష్ట్రాలను కోరారు..
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1609874
వైద్య సరకులును రవాణా చేస్తున్న 74 విమానాలు
పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ లైఫ్ లైన్ ఉడాన్ కార్యక్రమం ఇప్పటివరకు కింద 74 విమానాలు దేశవ్యాప్తంగా వైద్య సరకులను రవాణా చేస్తున్నాయి. మొత్తం 37.63 టన్నుల కార్గోను ఇప్పటివరకూ రవాణా చేశారు. ఇందులో 22 టన్నులు 31 మార్చి 2020 వరకు రవాణా చేశారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1609901
మీడియాకు సుప్రీంకోర్టు ఆదేశాలు
ప్రింట్ , ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాలు, గట్టి సామాజిక బాధ్యతతో పనిచేయాలని , సరిచూడని వార్తలు, ప్రజలలో భయాందోళనలకు కారణం కాగల వార్తలను ఇవ్వకుండా చూడాలని సుప్రీంకోర్టు మీడియాను ఆదేశించింది.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1609887
ఐఐటి డైరక్టర్లను కలుసుకున్న హెచ్,ఆర్.డి మంత్రి
మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి దేశంలోని 23 ఐఐటిలను వాటి విద్యార్థులు, ఫాకల్టీ, సిబ్బంది రక్షణకు చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. అలాగే ఆన్‌లైన్ కోర్సుల ద్వారా వీలైనంత ఎక్కువమంది విద్యార్థులను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాల్పిందిగా ఆదేశించారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1609932
జమ్ము కాశ్మీర్‌లో ధరల పరిశీలన,వనరుల విభాగం
నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆధ్వర్యంలో (ఎన్‌పిపిఎ)జమ్ము కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ధరల పర్యవేక్షణ, రిసోర్ప్ సెంటర్ ఏర్పాటైంది. ఇలా ఏర్పడిన 12 వ ప్రాంతం ఇది. పిఎం.ఆర్.యు , ఎన్‌పిపిఎకు, రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్‌కు చౌక ధరలో మందులు అందుబాటులో ఉండడానికి దోహదపడుతుంది.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1609855
కోవిడ్-19 పై పోరులో సిఐపిఇటి
కోవిడ్ -19 మహమ్మారిని అదుపుచేసేందుకు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన, సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్, టెక్నాలజీ సంస్థ వివిధ రాష్ట్రాలలోని తమ కేంద్రాల ద్వారా ప్రజల సంక్షేమానికి పలు చర్యలు తీసుకుంటోంది.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1609831
27 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన ఫర్టిలైజర్ పి.ఎస్‌యు లు
డిపార్టమెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ పరిధిలోని పిఎస్‌యులు 27 కోట్లరూపాయలకు పైగా విరాళాన్ని పిఎం కేర్స్ నిధికి ప్రకటించాయి.కోవిడ్ -19 పై పోరాటానికి ఈ విరాళాలు ప్రకటించాయి.
. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1609827
సహాయ చర్యలను సమీక్షించిన రక్షణమంత్రి
కోవిడ్-19 పై పోరాటానికి రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని వివిధ సంస్జలు అందిస్తున్న సహాయంపై రక్షణమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వ శాఖలతో సన్నిహిత సమన్వయం కలిగి ఉంటూ తమ కృషిని రెట్టింపు చేయాల్పిందిగా ఆయన కోరారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1609882
అత్యవసర వైద్య సరఫరా సేవలు అందించిన ఐఎఎఫ్
నొవెల్ కోరానా వైరస్ వ్యాప్తిని అదుపుచేయడంలో భారత వైమానిక దళం తన పూర్తి మద్దతును కొనసాగిస్తోంది. ఐఎఎఫ్ సుమారు 25 టన్నుల అత్యవసర వైద్య సరఫరాలను గత 3 రోజులలో ఢిల్లీ, సూరత్,చండీఘడ్, మణిపూర్, జమ్మూకాశ్మీర్, లద్దాక్ లనుంచి గమ్యస్థానానికి చేరవేపింది,
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1609878
టర్మ్‌లోన్లపై ఆర్.బి.ఐ బ్యాంకులు మారటోరియం విధించేందుకు అనుమతిపై తరచూ అడిగే ప్రశ్నలు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1609820
కోవిడ్ -19 ఫిర్యాదులపై నేషనల్ మానిటరింగ్ డాష్ బోర్డు
డిఎఆర్‌పిజి ఆధ్వర్యంలో కోవిడ్ -19 ఫిర్యాదులపై నేషనల్ మానిటరింగ్ డాష్‌బోర్డును ఈరోజు ప్రారంభించడం జరిగింది. సిపిజిఆర్ ఎ ఎం ఎస్ లద్వారా కొవిడ్ -19 కు సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి అందిన ఫిర్యాదులను
ప్రాధాన్యతా ప్రాతిపదికన డిఎఆర్‌పిజికి చెందిన సాంకేతిక బృందం పర్యవేక్షిస్తుంది.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1609860
జాతీయ కృషికి అనుబంధంగా రైల్వే ఏర్పాట్లపై సమీక్ష
తమకుగల అత్యుత్తమ సామర్ధ్యాన్ని , వనరులను ఉపయోగించుకుని అవసరమైన వారికి ఆహారం, ఇతర రకాల సహాయాన్ని అందించాల్పిందిగా రైల్వే మంత్రిత్వశాఖ రైల్వే అధికారులను ఆదేశించింది. ఐఆస్ఆర్‌టిసి, ఆర్.పి.ఎఫ్ లు సమీపంలోని వారికి ఉచితంగా ఇప్పటటికే ఆహారం అందజేస్తున్నది. రైల్వేలు తమకు దగ్గరలోని రైల్వే స్టేషన్లనుంచి మరికాస్త ముందుకు వెళ్లి జిల్లా పాలనాయంత్రంగాలు, ఎన్.జి.ఒ లతో సమన్వయం చేసుకుంటూ ఉండాలని రైల్వే మంత్రిత్వ శాఖ సూచించింది.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1609850
కరోనా వైరస్ పై సీనియర్ సైంటిస్టు మాటలు
కరోనా వైరస్‌కు సంబంధించి ఎన్నో విషయాలు సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ ద్వారా ప్రచారమౌతున్నాయి. విజ్ఞాన్ ప్రసార్‌కు చెందిన సీనియర్ సైంటిస్ట్ ఒకరు కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించిన కొన్ని వాస్తవాలు తెలిపారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1609842
కోవిడ్-19పై టిఐఎఫ్ఆర్ నేతృత్వంలో బహుభాషా వీడియోలు
టాటా ఇన్ స్టిట్యూట్ ఆప్ ఫండమెంటల్ రిసెర్చ్, కోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు సామాజిక దూరం పాటించాల్సిన ప్రాధాన్యతను వివరించడానికి ఉపకరించే మెటీరియల్‌ను రూపొందించింది. ఇందుకు సంబంఢించి 9 భాషలలో యూట్యూబ్ వీడియోలు రూపొందించింది.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1609797
****
(Release ID: 1610113)