మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కొవిడ్-19పై పోరాటంలో సన్నద్ధతలో భాగంగా కేంద్ర మానవాభివృద్ధి శాఖా మాత్యులు శ్రీ రమేష్ పోఖ్రియాల్ ’నిషాంక్’ అధ్యక్షతన దేశంలోని అన్ని ఐఐటి సంచాలకులతో వీడియో సమావేశం

కొవిడ్-19పై ఐఐటిలు మరింత పరిశోధన చేయాలని శ్రీ నిషాంక్ ఆదేశించారు

Posted On: 01 APR 2020 5:26PM by PIB Hyderabad

దేశంలోని అన్ని ఐఐటిల సంచాలకులతో కేంద్ర మానవాభివృద్ధి శాఖా మాత్యులు శ్రీ రమేష్ పోఖ్రియాల్ ’నిషాంక్’ అధ్యక్షతన న్యూఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని ఐఐటిల విద్యార్థులు, అధ్యాపకులు, కాంట్రాక్టు సిబ్బంది, ఇతర  సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు ఎటువంటి సమస్యలను ఎదర్కొంటున్నారా అని ఆయన ఆరా తీసారు, వారికి ఏ సమస్యా లేకుండా చూడాలని పేర్కొన్నారు.

 

సాధ్యమైనంత మేర ఎక్కువ మంది విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కోర్సులను ఐఐటిలు అందించాలని , వీటిని స్వయం/స్వయం ప్రభలో ఉంచాలని మరియు వంతుల వారీగా పనిచేయాలని సూచించారు. ఈ లాక్డౌన్ సమయంలో ఐఐటి విద్యార్థులు ధైర్యం సడలకుండా మానసికంగా మెరుగ్గా ఉండడం కోసం ఒక హెల్పైన్ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణకు సైకాలజిస్టులతో కూడిన ఇక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల ఉపకార వేతనాలు, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది, అడ్హాక్, సిబ్బంది జీతాలు సరియైన సమయంలోనే, 30 ఏప్రిల్ వరకు అందుతాయని ఎటువంటి ఆందోళన అవసరంలేదని అన్నారు.

 

కొవిడ్-19పై పోరాటం కోసం ఐఐటిలు మరింత పరిశోధన సాగించాలని , ఇప్పటి వరకు చేసిన పరిశోధనలకు సామాజిక మాధ్యమాలు మరియు ఇతర ప్రచార సాధనాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని, అన్ని ఐఐటిలు ప్రధాన మంత్రి కేర్స్ నిధికి విరాళాలు అందజేయాలని కోరారు.

ప్రస్తుతం  వసతిగృహాల్లో నివసిస్తున్న విద్యార్థులకు ఆహార సమ్యలు తలెత్తకుండా చూడాలని, అలాగే వారికి సామాజిక దూరం పాటించడం గురించి సరియైన అవగాహన కల్పించాలని, వాటిని పాటించేటట్లుగా చూడాలని కోరారు. అట్లే వేసవి మరియు శీతాకాలపు ఇంటర్నుషిప్ నష్టపోకుండా విద్యాసంవత్సరపు ప్రణాళికను రూపొందించాలని, గత సంవత్సరం కంటే తగ్గకుండా వివిధ కంపెనీల  క్యాంపస్ నియామక ప్రక్రియలను నిర్వహించే విధంగా సంస్థ తగిన చర్యలు చేపట్టాలని శ్రీ పోఖ్రియాల్ సంచాలకులను ఆదేశించారు.

ఐఐటి బాంబే వారు కల్పిస్తున్న రోగ నిర్థారణ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని అన్ని ఐఐటిలను శ్రీ నిషాంక్ ఆదేశించారు.

క్యాంపసులో ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది మరియు కాంట్రక్టు సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాల గురించి వీడియో సమావేశంలో అన్ని ఐఐటిల సంచాలకులు మంత్రి గారికి తెలిజేసారు. సంస్థలోని అందరితో ఎల్లప్పుడూ తగి సమాచారంతో సంబంధాలను కలిగి ఉన్నామని వారికి ఏ విధమైన అవసరం వచ్చినా తగిన సహాయం అందిచడానికి తయారుగా ఉన్నామని సంచాలకులు తెలియజేసారు.  మాస్కులు, తక్కువ ధరకు వెంటీలేటర్లు, సానిటైజర్లు, పరీక్ష కిట్లు వంటి కొవిడ్-19 వ్యాపించకుండా తీసుకునేందుకు అవసరమైన వస్తువుల తయారీలో చేసిన పరిశోధనల గురించి వారు ప్రత్యేకించి మంత్రివర్యులకు తెలియజేసారు. వారి పరిశోధనలను మానవాభివృద్ధి శాఖా మాత్యులు మెచ్చుకుని  ప్రభుత్వం వారి తదుపరి పరిశోధనలకు మరింత సహాకారాన్ని అందజేస్తుందని తెలిపారు.

. ఐఐటి సంచాలకులు ఈ క్రింది విషయాలను తెలియపరిచారు:

-  ఇప్పటికే చాలా మంది విద్యార్థుల ఐఐటి క్యాంపసులు ఖాళీ చేసి వెళ్ళారు. క్యాంపస్లో ఉన్న వారికి అన్ని రకాలుగా రక్షణ మరియు తగిన ఆహార వసతిని కల్పించడంతోపాటు వారు తగిన సామాజికి దూరాన్ని పాటించేట్లుగా చూస్తున్నాము.

- అన్ని ఐఐటిలూ ప్రస్తుతం క్యాంపస్లో ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు మరియు వారి కుటుంబ సభ్యులు, కాంట్రాక్టు సిబ్బంది సామాజికి దూరాన్ని పాటించేట్లు తగిన చర్యలు తీసుకుంటున్నాము.    

-    నిత్యం తరగతులకు హాజరు కాలేని విద్యార్థుల కోసం ఆన్లైన్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు, అందుకు అవసరమైన విద్యావిషయాలను తయారు చేసి అందిస్తున్నామని, ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్థులు వీటిని ప్రస్తుతం మరియు అనంతరం కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

-     ప్రస్తుత లాక్డౌన్ కారణంగా విద్యావిషయక కార్యక్రమాలకు కలిగిన అంతరాయానికి విద్యార్ధులు నష్టపోకుండా ఉండేందుకు ఐఐటిలు విద్యాసంవత్సర ప్రణాళికను సరించే కార్యక్రమంలో ఉన్నాయి.

-  క్యాంపస్ నియామకాల ప్రక్రియకు విఘాతం కలిగినందున విద్యార్థులకు జులై/అగస్టు నెలల్లో ప్రత్యేక క్యాంపస్ నియామకాల ప్రక్రియను చేపడతాం.   

- ఐఐటిలు నిరంతరాయంగా పనిచేస్తునందు వలన విద్యార్థుల అభ్యసన ప్రక్రియకు అంతరాయం కలుగుటలేదు. కొన్ని ఐఐటిలు కొవిడ్-19పై విద్యార్థులు చేస్తున్న పరిశోధనలకు  వివిధ నగదు బహుమతులను అందజేస్తూ ప్రోత్సహిస్తున్నాయి.    

-     


(Release ID: 1610110) Visitor Counter : 230