శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సూక్ష్మ క్రిముల సంక్రమణ వ్యాప్తి నిరోధం కోసం ప్రత్యేక పూతను అభివృద్ధి చేసిన జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ (జె.ఎన్.సి.ఎ.ఎస్.ఆర్)
Posted On:
01 APR 2020 6:10PM by PIB Hyderabad
శాస్త్ర సాంకేతిక విభాగంలో స్వయంప్రతిపత్తిగల సంస్థ అయిన జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ (జె.ఎన్.సి.ఎ.ఎస్.ఆర్) వన్ –స్టెప్ క్యూరబుల్ యాంటీ మైక్రోబయల్ కోటింగ్ (ఒక-దశ నయంచేయగల సూక్ష్మి క్రిమిని హరించే పూత)ను అభివృద్ధి చేసింది. ఇది వస్త్ర, ప్లాస్టిక్ వంటి వివిధ ఉపరితలాలపై పూత పూసినప్పుడు కోవిడ్ -19 సహా వివిధ రకాల వైరస్ లను సంహరించగలదు.
ఈ సంయోజనీయ పూత, అప్లైడ్ మెటీరియల్ మీద ఇన్ఫ్లూయెంజా వైరస్ తో పాటు అనేక రకాల వైరస్ లకు రెసిస్టెంట్ గా పని చేస్తుందని పరిశోధనా పత్రం చెబుతోంది. ఇటీవల SARS-CoV-2 వ్యాప్తి ప్రపంచం ఎప్పుడూ చూడని ప్రకంపనలు సృష్టించింది. అనేక ఉపరితలాల మీద ఈ పూత ద్వారా వాటిని నివారించవచ్చని నిరూపించబడింది.
ఈ రోజు వరకు మనకు తెలిసినంత వరకూ అన్ని రకాల వైరస్, బ్యాక్టీరియా, శిలింద్రాలను సంహరించగల సంయోజనీయ పూత లేదని పరిశోధకులు చెబుతున్నారు. వివిధ రకాల ఉపరితలాలపై పూయగల ఈ పూత, దాని సౌలభ్యం మరియు దృఢత్వం కారణంగా దీన్ని పూసేందుకు నిపుణులైన పని వారి అవసరాన్ని తగ్గిస్తుంది.అభివృద్ది చెందిన అణువులకు అతినీల లోహిత వికిరణంపై వివిధ ఉపరితలాలతో రసాయనికంగా క్రాస్ లింక్ చేసే సామర్థ్యం ఉంటుంది. పూత ఏర్పడిన తర్వాత వ్యాధి కారక క్రిములను క్రియారహితం చేసే విధంగా ఇది పని చేస్తుంది.
సూక్మక్రిములు వివిధ ఉపరితలాల మీద నిలిచిపోవడం వల్ల వివిధ అంటువ్యాధులు ప్రబలి అరోగ్యసంరక్షణ ప్రమాదంలో పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సులభంగా అనేక ఉపరితలాల మీద వాడగల ఈ పూతను తయారు చేయడం జరిగింది.
విస్తృత శ్రేణి ద్రావకాల్లో (నీరు,ఇథనాల్, క్లోరోఫామ్ మొదలైనవి) వాటి వాంఛనీయ ద్రావణీయతను దృష్టిలో ఉంచుకుని అణువులు రూపొందించబడ్డాయి. మనం రోజు వారీ ఉపయోగించే వివిధ వస్తువుల మీద ప్రయోగించబడ్డాయి. ఈ పూతలో ముంచిన తర్వాత అతినీలలోహిత కిరణాలు తగిలి ఆయా వస్తువుల ఉపరితలాలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ గా మారేలా దీన్ని తయారు చేశారు.
ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇది పూర్తి స్థాయిలో విజయవంతం అయితే దీన్ని పెద్ద ఎత్తున వినియోగంలోకి తేవడానికి ప్రయత్నాలు చేయవచ్చు. ముసుగులు, చేతి తొడుగులు, గౌన్లు మొదలైన వివిధ వ్యక్తిగత రక్షణ సాధనాల మీద పూత పూయవచ్చు. వివిధ ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్లను నివారించడానికి వివిధ వైద్య పరికరాల మీద పూతగానూ వాడడానికి అవకాశం ఉంటుంది.
(Release ID: 1610109)
Visitor Counter : 265