ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19పై పోరు దిశగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు ఎస్పీఎంసీఐఎల్‌ రూ.1,98,67,680 విరాళం

Posted On: 01 APR 2020 5:54PM by PIB Hyderabad

ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్‌పై పోరాటానికి తనవంతు చేయూతగా “ది సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌” (SPMCIL) ‘కార్పొరేట్‌ సామాజిక బాధ్యత’ కింద భారీ విరాళం అందజేసింది. ఈ మేరకు వైరస్‌ పీడితులకు చికిత్సలో కీలకమైన 45 కృత్రిమశ్వాస పరికరాలు (వెంటిలేటర్లు) కొనుగోలు కోసం న్యూఢిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞానశాస్త్రాల సంస్థ (AIIMS)కు రూ. 1,98,67,680 (కోటీ 98లక్షల 67వేల 680) ఇచ్చింది.


(Release ID: 1610039) Visitor Counter : 107