సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 ఫిర్యాదులకు సంబంధించి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు,పెన్షన్ల శాఖ సహాయ మంత్రి
డాక్టర్ జితేంద్ర సింగ్ చే డిఎఆర్‌పిజి నేషనల్ మానిటరింగ్ డాష్‌బోర్డు ప్రారంభం
Posted On:
01 APR 2020 2:11PM by PIB Hyderabad
కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు,పెన్షన్ల శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కోవిడ్ -19 ఫిర్యాదులకు సంబంధించి ఈరోజు జాతీయ స్థాయి మానిటరింగ్ డాష్ బోర్డును ప్రారంభించారు. నేషనల్ మానిటరింగ్ డాష్ బోర్డును అభివృద్ధిచేసి, దానిని https://darpg.gov.in వెబ్ సైట్ లో అమలు చేస్తున్నారు. ఇందులో కోవిడ్ -19 సంబంధిత ఫిర్యాదులను సిపిజిఆర్ ఎ ఎం ఎస్ లను ంచి అన్ని మంత్రిత్వశాఖలు, డిపార్టమెంట్ లు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుంచి అందుకుని ప్రాధాన్యతా ప్రాతిపదికన డిపిఆర్‌పిజి కిచెందిన సాంకేతిక నిపుణుల బృందం వాటిని విశ్లేషిస్తుంది. విపత్తు నిర్వహణ చట్టం 2015 కింద ఏర్పాటైన సాధికార బృందం నేషనల్ మానిటరింగ్ డాష్ బోర్డు ఏర్పాటును సిఫార్సుచేసింది. కోవిడ్ -19 కి సంబంధించి సకాలంలో స్పందించడానికి వీలుగా దీనిన ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ జితేంద్ర సింగ్ , కోవిడ్ -19 సంబంధిత సమస్యలను సకాలంలో పరిష్కరించాలన్నది శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నమని ఇందుకు సంబంధించి అన్ని మంత్రిత్వశాఖలకు, విభాగాలకు ఆదేశాలు పంపారని, మూడు రోజులలోగా ఈ ఫిర్యాదులకు పరిష్కార చర్యలు తీసుకోవలసిందిగా కోరడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 262 ఫిర్యాదుల స్థితిగతులను తాను స్వయంగా సమీక్షించానని చెప్పారు. మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 83 ఫిర్యాదులు అందుకున్నట్టు ఆయన తెలిపారు. వీటి పరిష్కారానికి డిఎఆర్‌పిజి అధికారులు వివిధ మంత్రిత్వశాఖలు, రాష్ట్రప్రభుత్వాలతో మాట్లాడి చర్యలు తీసుకోవలసిందిగా కోరడం జరిగిందన్నారు.
తొలి రోజు నేషనల్ మానిటరింగ్ డాష్‌బోర్డు ఆరోగ్య,కుటుం సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన 43 ఫిర్యాదులు అందుకుందని,31 ఫిర్యాదులు విదేశీ వ్యవహారాల శాఖకు చెందినవని, 26 ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన వని ఆయన చెప్పారు. ఈఫిర్యాదులలో క్వారంటైన్ సౌకర్యాలు, లాక్‌డౌన్ సక్రమంగా అమలు జరగడం లేదన్న ఫిర్యాదులు, నిత్యావసర సరకులుకు సంబంధించిన ఫిర్యాదులు, రుణాలపై వడ్డీ రీ షెడ్యూలుకు సంబంధించినవి, విదేశాలనుంచి తమను తీసుకురావలసిందిగా కోరుతూ విజ్ఞప్తులు ఉన్నాయన్నారు. ఈపోర్టల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు దీనిని రోజు వారీ గా పర్యవేక్షిస్తారని మంత్రి చెప్పారు.
నేషనల్ కోవిడ్ -19 మానిటరింగ్ డాష్ బోర్డును ఏర్పాటు చేసినందుకు డాక్టర్ జితేంద్ర డిఎఆర్‌పిజి అధికారుల బృందాన్ని అభినందించారు. పట్టుమని రెండు రోజులలోనే ఇది ఆచరణలోకి రావడం అభినందించదగ్గ విషయమని ఇది ఈ శాఖ ఘనతను చాటుతుందన్నారు. 62 పౌర ఫిర్యాదులు పరిష్కరించినట్టు ఆయన చెప్పారు.
డిఎఆర్‌పిజి కార్యదర్శి డాక్టర్ ఛత్రపతి శివాజి, అడిషనల్ సెక్రటరి డిఎఆర్ పిజి వి. శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ శ్రీమతి జయా దూబే, ఎన్.బి.ఎస్ రాజ్‌పుత్, డిపార్టమెంట్ లోని ఇతర సీనియర్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
(Release ID: 1609953)
Visitor Counter : 171
Read this release in:
English
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam