నౌకారవాణా మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 కారణంగా పోర్టు యూజర్లకు ఎలాంటి జాప్యాలకు పెనాల్టీలు/ చార్జీలు/ ఫీజులు వంటివి ఏవీ విధించవద్దని అన్ని ప్రధాన పోర్టులకు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆదేశం

Posted On: 31 MAR 2020 9:16PM by PIB Hyderabad

కోవిడ్-19 విస్తరించడంతో పాటు దాన్ని మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో దేశంలో కోవిడ్ విస్తరణను నిలువరించేందుకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశంలో నిత్యావసర వస్తువులు నిరంతరాయంగా సరఫరా అయ్యేలా చూసే లక్ష్యంతో   పోర్టుల ద్వారా కార్గో రవాణా, ఎగుమతి కార్యకలాపాలు, అంతర్ రాష్ట్ర వస్తు/ కార్గో రవాణా కార్యకలాపాలకు మినహాయింపులిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 

హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు, పోర్టుల ద్వారా కార్యకలాపాలు నిర్వహించే పలువురి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకునిఅన్ని రకాల పోర్టు కార్యకలాపాలు, పోర్టు ఆపరేషన్లపై “ఫోర్స్ మెజర్”  (మనిషి అదుపులో లేని అసాధారణ పరిస్థితి లేదా భగవత్ సంకల్పిత చర్య (ప్రకృతి వైపరీత్యం వంటివి) ఏర్పడిన సమయంలో నెలకొన్న పరిస్థితి) వర్తింపచేయాలని 2020, మార్చి 24వ తేదీన దేశంలోని అన్ని ప్రధాన పోర్టులకు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అడ్వైజరీ జారీ చేసింది.

 

లాక్ డౌన్ అమలులో ఉండే 2020 మార్చి 22 నుంచి 2020 ఏప్రిల్ 14వ తేదీ మధ్య కాలంలో     పోర్టుల్లో బెర్తింగ్/ లోడింగ్/ అన్ లోడింగ్ వంటి కార్యకలాపాల్లో జరిగే జాప్యాలు, కార్గో తరలించడం/  రావడంలో జాప్యాలపై యూజర్లపై పెనాల్టీలు, డెమరేజి చార్జీలు, ఫీజులు, రెంటల్స్ వసూలు చేయడానికి మినహాయింపులు ఇస్తూ ప్రధాన పోర్టులన్నింటికీ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే పిపిపి విధానంలో లేదా ఇతరత్రా మార్గాల్లో అమలు జరుగుతున్న వివిధ ప్రాజెక్టులు పూర్తి చేసే కాలపరిమితిని పొడిగించేందుకు కూడా అనుమతించింది. అంతే కాదు ప్రస్తుతం అమలులో ఉన్న, నడుస్తున్న వివిధ పిపిపి ప్రాజెక్టులను కేసుల వారీగా పరిశీలించి ఆయా పనుల్లో జరుగుతున్న జాప్యాలపై కన్సెషన్ ఒప్పందానికి అనుగుణంగా విధించాల్సిన పెనాల్టీలు రద్దు చేయడానికి అనుమతి కూడా ఇచ్చింది.



(Release ID: 1609892) Visitor Counter : 146