ఆర్థిక మంత్రిత్వ శాఖ
పన్నులు మరియు ఇతర చట్టాల (కొన్ని నిబంధనలు సడలిస్తూ) విషయంలో ఆర్డినెన్స్ ను జారీ చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ
Posted On:
31 MAR 2020 10:04PM by PIB Hyderabad
కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో వివిధ రంగాల్లో చట్టబద్ధమైన నియంత్రణ మరియు సమ్మతికి సంబంధించిన అనేక సహాయ చర్యలకు సంబంధించి 2020 మార్చి 24న కేంద్ర ఆర్థిక మంత్రి పేరుతో వచ్చిన పత్రికా ప్రకటనకు సంబంధించిన అమలు కోసం 2020 మార్చి 31న ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. ఇది పన్ను మరియు బినామి చట్టాల కింద వివిధ సమయ పరిమితులను విస్తరణను సూచిస్తుంది. ఈ చట్టాల ప్రకారం సూచించిన లేదా జారీ చేసిన నిబంధ్రనలు లేదా నోటిఫికేషన్ లో ఉన్న సమయ పరిమితుల్ని పొడగించే విషయాలను కూడా ఇందులో పేర్కొన్నారు.
ప్రపంచంలోని అనేక దేశాల్లో నావెల్ కరోనా వైరస్ (కోవిడ్ -19) వ్యాప్తి ప్రజలకు అపారమైన నష్టాలను ఇబ్బందులను మిగిల్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు వివిధ దేశ ప్రభుత్వాలు దీన్ని మహమ్మారిగా ప్రకటించాయి. సామాజిక దూరం ద్వారానే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చనే ఉద్దేశంతో భారతప్రభుత్వం పూర్తి స్థాయి లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో వివిధ రంగాల్లోని చట్టబద్దమైన సమ్మతి మరియు నియంత్రణ విషయాలకు సంబంధించిన అనేక సహాయ చర్యలను 2020 మార్చి 24న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.
ఈ ఆర్డినెన్స్ ద్వారా పొడిగించబడే కొన్ని ముఖ్యమైన ముఖ్యమైన అంశాలు మరియు సమయ పరిమితులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ప్రత్యక్ష పన్నులు మరియు బినామి :
i. 2018-19 ఆర్థిక సంవత్సరానికి (AY 2019-20) ఆదాయ పన్ను రిటర్నుల తేదీని సవరించి 2020 జూన్ 30 వరకూ పొడగించడం జరిగింది.
ii. ఆధార్ – పాన్ అనుసంధానానికి తుది గడువును 2020 జూన్ 30 వరకూ పొడిగింపు.
iii. సెక్షన్ 80 సి (ఎల్.ఐ.సి, పి.పి.ఎఫ్. ఎన్.ఎస్.సి మొదలైనవి), 80 డి (మెడిక్లైమ్), 80జి (విరాళాలు) మొదలైనవి ఐటి చట్టం చాప్టర్ VIA-B కింద మినహాయింపు క్లెయిమ్ చేసేందుకు వివిధ పెట్టుబడి / చెల్లింపు చేసే తేదీని 2020 జూన్ 30 వరకూ పొడిగించారు. ఈ నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ విభాగాల తగ్గింపును క్లెయిమ్ చేసేందుకు 2020 జూన్ 30 వరకూ పెట్టుబడులు పెట్టడం లేదా చెల్లింపులు చేయడం లాంటివి నిర్వహించవచ్చు.
iv. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 54 నుంచి 54 జి.బి. కింద మూలధన లాభాలకు సంబంధించిన రోల్ ఓవర్ బెనిఫిట్ లేదా మినహాయింపుల కోసం పెట్టుబడి లేదా నిర్మాణం లేదా కొనుగోలు చేసే తేదీని కూడా 2020 జూన్ 30 వరకూ పొడిగించారు. కాబట్టి పెట్టుబడి లేదా నిర్మాణం లేదా కొనుగోలుకు సంబంధించి 2019-20 ఆర్థిక సంవత్సరంలో తలెత్తే మూలధన లాభాల నుంచి మినహాయింపు పొందేందుకు 2020 జూన్ 30 వరకూ అర్హత పొందేందుకు అవకాశం ఉంటుంది.
v. ఆదాయపు పన్ను చట్టం 10AA తగ్గింపు కింద మినహాయింపును క్లెయిమ్ చేయడానికి 2020 మార్చి 31 నాటికి అనుమతి పొందిన సెజ్ యూనిట్లకు ఆపరేషన్ ప్రారంభించే తేదీని 2020 జూన్ 30 వరకూ పొడగించడం జరిగింది.
vi. వివిధ ప్రత్య పన్నులు మరియు బినామి చట్టం ప్రకారం అధికారులు పాస్ చేసే లేదా నోటీసు జారీ చేసే తేదీని కూడా 2020 జూన్ 30 వరకూ పొడగించడం జరిగింది.
vii. ఆదాపు పన్ను (ముందస్తు పన్ను, టి.డి.ఎస్.టి.సి.ఎస్) ఈక్వలైజేషన్ లెవీ, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్.టి.టి0, కమోడిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (సి.టి.టి) చెల్లించనందుకు సాధారణంగా వసూలు చేసే 9 శాతం వడ్డీ రేటు తగ్గించబడుతుంది. 2020 జూన్ 30 వరకూ చెల్లించకపోయినా ఎటువటి జరిమానా లేదా ప్రాసిక్యూషన్ నిర్వహించబడదు.
viii. వివాద్ సే విశ్వాస్ పథకం కింద తేదీని కూడా 2020 జూన్ 30 వరకూ పొడిగించారు. అందువల్ల ఈ పథకం కింద డిక్లరేషన్ మరియు అదనపు చెల్లింపు లేకుండా 2020 జూన్ 30 వరకూ చెల్లింపులు చేయవచ్చు.
పరోక్ష పన్నులు:
i. 2020 మార్చి, ఏప్రిల్ మరియు మే లో సెంట్రల్ ఎక్సైజ్ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు తేదీ 2020 జూన్ 30 వరకూ పొగడించబడింది.
ii. సెంట్రల్ ఎక్సైజ్ చట్టం -1944 ప్రకారం అప్పీల్, వాపసు దరఖాస్తులు దాఖలు చేయడానికి చివరి తేదీ నిబంధనల ప్రకారం 2020 మార్చి 20 నుంచి 2020 జూన్ 29 వరకూ ఉంది. ఆ తేదీని కూడా 2020 జూన్ 30 వరకూ పొడిగించడం జరిగింది.
iii. కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం అప్పీల్, వాపసు దరఖాస్తులు దాఖలు చేయడానికి చివరి తేదీ నిబంధనల ప్రకారం 2020 మార్చి 20 నుంచి 2020 జూన్ 29 వరకూ ఉంది. ఆ తేదీని కూడా 2020 జూన్ 30 వరకూ పొడిగించడం జరిగింది.
iv. సేవా పన్నులకు సంబంధించిన అప్పీలు దాఖలు చేయడానికి చివరి తేదీ 2020 మార్చి 20 నుంచి 2020 జూన్ 29 వరకూ ఉండగా, ఆ తేదీని కూడా 2020 జూన్ 30 వరకూ పొడిగించడం జరిగింది.
v. సబ్రా విశ్వాస్ చట్టపరమైన వివాదాల పరిష్కార పథకం 2019 కింద ప్రయోజనాలు పొందడానికి చెల్లింపు చేసే తేదీని 2020 జూన్ 30 వరకూ పొడిగించారు. తద్వారా పన్ను చెల్లింపుదారులకు వారి వివాదాలను పరిష్కరించడానికి ఎక్కువ సమయం లభిస్తుంది.
పైన పేర్కొన్న విధంగా పన్ను మరియు బినామి చట్టాల ప్రకారం కాలపరిమితులను పొడిగించడంతో పాటు, సి.జి.ఎస్.టి. చట్టం – 2017లో ఒక తోడ్పాటు విభాగాన్ని చేర్చడం జరిగింది. బాహ్య సరఫరాల స్టేట్ మెంట్ వాపసు, దాఖలు చేయడానికి వివిధ సమ్మతుల మధ్య తేదీని పొడిగించేందుకు జి.ఎస్.టి. కౌన్సిల్ సిపారసులపై పేర్కొన్న, సూచించిన లేదా తెలియజేయబడిన వాదనలు, అప్పీలు, దాఖలు మొదలైన వాటికి సంబంధించి ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది.
పి.ఎం. కేర్స్ ఫండ్
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు సహాయం చేసేందుకు ప్రధానమంత్రి పౌర సహాయం మరియు అత్యవసర పరిస్థితుల నిధి (పి.ఎం.కేర్స్ ఫండ్) అనే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధికి అందుబాటులో ఉన్న పి.ఎం. కేర్స్ ఫండ్స్ కు పన్ను ఉపశమనాన్ని అందించేందుకు పన్ను చట్టంలోని నిబంధనలను ఆర్డినెన్స్ సవరించింది. అందువల్ల పి.ఎం. కేర్స్ ఫండ్ కు అందించిన విరాళం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80జి కింద 100 శాతం మినహాంపునకు అర్హమైనది. అంతే కాకుండా, స్థూల ఆదాయంలో 10 శాతం తగ్గింపు పరిమితి పి.ఎం. కేర్స్ ఫండ్ కు చేసిన విరాళానికి వర్తించదు.
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం 80 జి మినహాయింపును క్లెయిమ్ చేసే తేదీని 2020 జూన్ 30 వరకూ పొడిగించినందున, ఈ తేదీ వరకూ ఇచ్చిన విరాళాలు 2019-20 ఆర్థిక సంవత్సరం ఆదాయం నుంచి తగ్గింపు పొందేందుకు అర్హత లభిస్తుంది. నూతన ఆర్థిక సంవత్సరం 2020-21కి కార్పొరేట్ చెల్లింపు రాయితీతో సహా ఏ వ్యక్తి అయినా 30 జూన్ 2020 వరకూ పి.ఎం. కేర్స్ ఫండ్ కు విరాళం ఇచ్చి, 2019-20 ఆర్థిక సంవత్సరానికి 80జి తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. అదే విధంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలోనూ పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చు.
(Release ID: 1609889)
Visitor Counter : 836