పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

2020 మార్చి 26-30 తేదీల మ‌ధ్య 5 రోజుల్లో 62 ‘లైఫ్‌లైన్ ఉడాన్‌’ విమానాల‌ద్వారా 15.4 టన్నులకుపైగా స‌ర‌కుల రవాణా

Posted On: 31 MAR 2020 7:14PM by PIB Hyderabad

 కోవిడ్‌-19పై భారత పోరాటంలో భాగంగా భారత ప్రభుత్వ పౌర విమానయాన శాఖ “లైఫ్‌లైన్‌ ఉడాన్‌” విమానాలను ప్రవేశపెట్టింది. వీటిద్వారా దేశీయంగానే కాకుండా విదేశాలకూ ఔషధ-వైద్య సరఫరాలతోపాటు నిత్యావసరాలను రవాణా చేసింది. ఈ మేరకు 2020 మార్చి 26-30 తేదీల మధ్య ఐదు రోజుల వ్యవధిలోనే 62 లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలు 15.4 లక్షల టన్నుల అత్యవసర వైద్య సరఫరాలను మోసుకెళ్లాయి. వీటిలో 45 ఎయిరిండియాతోపాటు పలు ఇతర విమానయాన సంస్థలకు చెందినవి కావడం గమనార్హం. లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాల రాకపోకల కోసం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో కూడళ్లను ఏర్పాటు చేయగా, ఆయా నగరాల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు సంధాన విమానాలు నడిచాయి.

లైఫ్‌లైన్‌ ఉడాన్‌ కింద నడిచిన విమానాల వివరాలిలా ఉన్నాయి:

The breakup of the flights is as follows:

వ.సం.

తేదీ

ఎయిరిండియా

అలయెన్స్‌

ఐఏఎఫ్‌

ఇండిగో

స్పైస్‌జెట్‌

మొత్తం

1

26.3.2020

02

-

-

-

02

04

2

27.3.2020

04

09

-

-

-

13

3

28.3.2020

04

08

-

06

-

18

4

29.3.2020

 

04 *

10 *

06

--

-

20

5

30.3.2020

04

-

03

--

-

07

 

మొత్తం

18

27

09

06

02

62

* లద్దాఖ్‌కు ఎయిరిండియా, ఐఏఎఫ్‌ విమానాలు సంయుక్తంగా నడిచాయి

 

ఈశాన్య భారతం, ద్వీప ప్రాదేశికాలు, పర్వత రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టితో ఈ విమానాలు నడిచాయి. ప్రధాన రవాణా కూడళ్లనుంచి ఈశాన్య భారతానికి దిబ్రూగఢ్‌, షిల్లాంగ్‌, ఐజ్వాల్‌, అగర్తల, ఇంఫాల్‌, దిమాపూర్‌ నగరాల్లోని ప్రాంతీయ కూడళ్ల అనుసంధానంతో గగనతల రవాణా సాగింది.

లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాల రాకపోకల కోసం పౌర విమానయానశాఖ పరిధిలోని నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ స్వల్ప వ్యవధిలోనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రవాణా అవసరాల కోసం www.civilaviation.gov.inలోగల లింకుద్వారా ముందస్తుగా నమోదు చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో సేవారుసుము చెల్లించాల్సిన పనిలేదు.

అంతర్జాతీయంగా భారత-చైనాల మధ్య గగనతల రవాణా వారధిని ఎయిరిండియా ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెండు దేశాలమధ్య కీలక వైద్య పరికరాలు, సరఫరా కోసం ఏప్రిల్‌ 3 నుంచి ఎయిరిండియా విమానాలు నడిపే అవకాశం ఉంది.

****

 



(Release ID: 1609782) Visitor Counter : 186