రక్షణ మంత్రిత్వ శాఖ
ఢిల్లీలో ఆహారార్థులకు 3,700 ఆహార పొట్లాలను పంచిన ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్(ఏడబ్ల్యూడబ్ల్యూఏ)
Posted On:
31 MAR 2020 2:12PM by PIB Hyderabad
కొవిడ్-19 ప్రపంచవాప్త మహమ్మారిపై పోరాటంలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా ఆహారం లేని పేదలకు పంచడానికి సుమారు 2,500 ఆహార పొట్లాలను ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వానికి ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్(ఏడబ్ల్యూడబ్ల్యూఏ) అందజేసింది. కాగా ఇప్పటికే నిన్న సుమారు 1.200 ఆహార పొట్లాలను అందజేసారు. ఈ ఉచిత ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం మరో ఐదురోజుల పాటు జరపనున్నారు.
ఈ ఆహార పొట్లాలను ఢిల్లీలోని ఆర్మీ అధికారుల ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్(ఏడబ్ల్యూడబ్ల్యూఏ) మధ్యాహ్నా భోజన కార్యక్రమం క్రింద ఆర్మీ అధికారులు, జూనియర్ కమిషన్డ్ అధికారులు మరియు ఇతర ర్యాంకుల అధికారుల గృహాలలో తయారు చేయబడినవి.
ఆర్మీ అధికారుల భార్యలు, వారి పిల్లలు, యుద్ధంలో వీర మరణం పొందిన అధికారుల, సైనికుల భార్యలు మరియు దివ్యాంగులైన పిల్లల పునరావాసం లక్ష్యంగా ఏర్పాటు చేసిన దేశంలో అతి పెద్ద స్వచ్ఛంద సంస్థ ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్(ఏడబ్ల్యూడబ్ల్యూఏ). ఇటువంటి సేవా కార్యక్రమాలే కాక పేదల జీవనస్థితిగతులను మెరుగుపరచే విషయంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించే కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి.
(Release ID: 1609712)
Visitor Counter : 163