వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రత్యేక ఆర్థిక మండళ్లలో 280కిపైగా యూనిట్లు ఔషధాలు, ఆస్పత్రుల పరికరాలవంటి అత్యవసర వస్తువులను తయారుచేస్తున్నాయి
Posted On:
31 MAR 2020 10:40AM by PIB Hyderabad
భారతదేశం నుంచి మొత్తం ఎగుమతులలో సుమారు 18 శాతం మేర వాటాతో కొన్నేళ్లుగా ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఎగుమతి రంగంలో గణనీయ పాత్ర పోషిస్తున్నాయి. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019)లో ‘సెజ్’ల నుంచి ఎగుమతులు ఇప్పటికే 110 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించాయి. అయితే, ప్రస్తుతం కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా మూసివేత పాటిస్తున్న నేపథ్యంలో సెజ్‌లలోని కొన్ని పరిశ్రమలు పనిచేస్తూనే ఉన్నాయి. ఈ మేరకు 280కిపైగా యూనిట్లు ఔషధాలు, ఔషధ రంగ ఉత్పత్తులు, ఆస్పత్రులకు అవసరమైన పరికరాలవంటి అత్యవసర వస్తువుల తయారీలో నిమగ్నమయ్యాయి. ఇందుకోసం సదరు సంస్థల ఉద్యోగులు ఇంటినుంచే పనిచేయడానికి వీలుగా 1900కుపైగా సమాచార సాంకేతిక/సమాచార-ప్రసార సాంకేతిక సంస్థలు తోడ్పాటునిస్తున్నాయి. అలాగే సదరు సంస్థలు చట్ట ప్రకారం 2020 మార్చి 31 లోగా దాఖలు చేయాల్సిన వివిధ రకాల పత్రాలు సమర్పణ గడువును సెజ్‌ల అభివృద్ధి కమిషనర్లు సడలించారు. మరికొన్నిటిని ఎలక్ట్రానిక్ మార్గంలో సమర్పించే వీలు కల్పించారు. దీనికీ వీలులేని పక్షంలో 30.06.2020 వరకూ లేదా తదుపరి ఆదేశాలదాకా ఏది ముందైతే దానికి కట్టుబడేలా గడువు పొడిగించారు.
*****
(Release ID: 1609624)