జౌళి మంత్రిత్వ శాఖ
వైద్య ఆరోగ్య రంగంలో ఉపయోగించే బట్ట ఉత్పత్తి, సరఫరా పర్యవేక్షణ కోసం కేంద్ర వస్త్ర పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్
प्रविष्टि तिथि:
25 MAR 2020 8:18PM by PIB Hyderabad
వైద్య ఆరోగ్య రంగంలో ఉపయోగించే వస్త్ర ఉత్పత్తి, సరఫరా పర్యవేక్షణ కోసం కేంద్ర వస్త్ర పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. కోవిడ్ 19 పై పోరాటంలో భాగంగా ఎన్ 95 మాస్కుల తయారీ, శరీరాన్ని కప్పే వస్త్రాలు, మెల్ట్ బ్లోన్ ఫ్యాబ్రిక్ కోసం ఈ ప్రత్యేక వస్త్రాలు అవసరమవుతాయి.
ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ అనేది ప్రత్యేక కార్యదర్శి శ్రీ పికె కటారియా ( మొబైల్ నెంబర్ 9818149844 ) ఆధ్వర్యంలో పని చేస్తుంది. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా నీహార్ రంజన్- జాయింట్ సెక్రటరీ, హెచ్. కె. నందా- డైరెక్టర్, బలరామ్ కుమార్ - డైరెక్టర్, పంకజ్ కుమార్ సింగ్ - డిప్యూటీ సెక్రటరీ, పద్మపాణి బోరా - డిప్యూటీ సెక్రటరీలతోపాటు పలువురు ఉన్నతాధికారులు సేవలందిస్తున్నారు. వైద్య ఆరోగ్య రంగంలో ఉపయోగించే ప్రత్యేక వస్త్రాల సరఫరాకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నాసరే సంబంధిత వ్యక్తులు పై కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
(रिलीज़ आईडी: 1609498)
आगंतुक पटल : 196