ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 వల్ల ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు: హర్సిమ్రత్ కౌర్ బాదల్

Posted On: 30 MAR 2020 7:33PM by PIB Hyderabad

కోవిడ్-19 లాక్ డౌన్ వల్ల ఫుడ్ ప్రాసెసింగ్అనుబంధ పరిశ్రమలు ఎదురుకొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఆ పరిశ్రమల ప్రతినిధులకు తెలిపారు. దేశంలో ఉన్న ప్రధాన పరిశ్రమల ప్రతినిధి సంఘాలైనా  సీఐఐఫిక్కీఅసోచామ్పీహెచ్డీసిసిఐఎఐఎఫ్పిఐఐసీసీఎఫ్ఐఎన్ఈఆర్డిక్కీ లతో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే 222 సమస్యలు టాస్క్ ఫోర్స్ దృష్టి కి వచ్చాయని వాటిలో 98ని పరిష్కరించామనిమిగిలిన సమస్యలు పరిష్కార దిశగా పరిశీలనలో ఉన్నాయని ఆమె అన్నారు. అయితే నిత్యావసర వస్తువుల ఉత్పత్తిరవాణా అనుమతుల విషయంలో కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు తగు సూచనలు వెళ్లినప్పటికీకొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని వేరేలా అర్థం చేసుకున్నాయని ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  పరిశ్రమల ప్రతినిధులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.  ఆహార ఉత్పత్తుల రాకపోకలుతయారీ విషయంలో అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉండే నిర్దిష్ఠమైన ఆదేశాలు ఇవ్వాలని ప్రతినిధులు సూచించారు.  ఫ్యాక్టరీల మూసివేతగిడ్డంగుల నిర్వహణసిబ్బంది రాకపోకలకుసరకు రవాణా రాకపోకలకు అంతరాయం వంటి అంశాలను పరిశ్రమ ప్రతినిధులు ప్రస్తావించారు. తయారీ రంగంలో తగు పనివారు లభ్యతరవాణా విషయాల్లో  కొరత ఉందని వారు చెప్పారు. దేశ వ్యాప్తంగా కిరాణా స్టోర్లు తెరిచి ఉంచడానికి అనుమతిని ఇవ్వాలని దీని వల్ల పరిశ్రమలు ప్రజల అవసరాలతో మరింత అనుసంధానం అవుతాయని  పరిశ్రమ ప్రతినిధులు సూచించారు. ఆహార వస్తువులు సజావుగా రవాణా అయ్యేలాఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ముడి సరుకు అందుబాటులో ఉండేలా  సంబంధిత రవాణా యూనియన్లతో చర్చిస్తానని ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హామీ ఇచ్చారు. 

పరిశ్రమ ప్రతినిధులు టాస్క్ ఫోర్స్ కి సమర్పించిన సమస్యలుఇబ్బందులను సమీక్షించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు.

 

 

                                ****



(Release ID: 1609439) Visitor Counter : 146