విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి అత్యవసర సహాయనిధికి సట్లజ్ జల విద్యుత్ నిగం (ఎస్ జె వి ఎన్) విరాళం రూ. 5 కోట్లు

Posted On: 30 MAR 2020 4:48PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ యాజమాన్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ, మినీ రత్న సట్లజ్ జల విద్యుత్ నిగం ప్రపంచ మహమ్మారి కోవిడ్ -19ను ఎదుర్కోవడానికి సహాయ చర్యలు చేపట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రధానమంత్ర్హి అత్యవసర సహాయ నిధికి రూ. 5 కోట్ల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.  కోవిడ్ – 19 వైరస్ కబంధ హస్తాల్లో చిక్కి ప్రపంచ దేశాలు గడ గడ వణకుతున్న ప్రస్తుత తరుణంలో రోజురోజుకు పెరుగుతున్న కేసులతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను, ఆర్ధిక సవాళ్ళను ఇండియా కూడా  ఎదుర్కొంటున్నది.

 

కోవిడ్ -19 మహమ్మారిపై జరుపుతున్న పోరాటం తీవ్రతను అర్ధం చేసుకున్న బాధ్యతాయుతమైన కార్పోరేట్ సంస్థగా సట్లజ్ జల విద్యుత్ నిగం ప్రధానమంత్రి  అత్యవసర సహాయ నిధికి (PM CARES Fund.)రూ. 5 కోట్ల విరాళం ఇవ్వాలని నిర్ణయించిందని సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నంద లాల్ శర్మ తెలియజేశారు.

బాధితులకు సహాయం అందించే ఉద్దేశంతో దేశ ప్రధానమంత్రి “పౌరులకు తోడ్పాటు మరియు సహాయం అందించేందుకు ప్రధానమంత్రి అత్యవసర సహాయ నిధి” పేరిట ధార్మిక సంస్థను ఏర్పాటు చేశారు.  ఏలాంటి అత్యవసర పరిస్థితి లేక కోవిడ్ -19 లాంటి విపత్కర  పరిస్థితి వచ్చినా వాటిని ఎదుర్కోవాలనే ప్రాధమిక లక్ష్యానికి  అంకితమైన నిదిగా ఈ అత్యవసర సహాయ నిధి పనిచేసే భాదితులకు సహాయం అందజేస్తుంది.

సామజిక కార్యకలాపాలకు తోడ్పడటంలో, దేశం, ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టే పనులకు చేయూతను ఇవ్వడంలో ఎస్ జె వి ఎన్ సర్వదా ముందున్నదని కూడా  శ్రీ శర్మ తెలిపారు.  కరోనా మహమ్మారి విస్తరించకుండా ఎదుర్కొనేందుకు ఆసుపత్రులకు అవసరమైన వెంటిలేటర్లు, మాస్కులు, చేతి తొడుగులు మొదలగు వ్యక్తిగత సంరక్షణ సాధనాల పంపిణీ, ప్రాజెక్టు ఆసుపత్రులలో క్వారెంటైన్ విభాగాల ఏర్పాటు, ఆహారం పంపిణీ, అవసరమైన ఇతర అత్యవసరాలు కొనేందుకు  దాదాపు మూడు కోట్ల రూపాయలు సహాయం ఇవ్వడానికి ఎస్ జె వి ఎన్ ఇదివరకే హామీ ఇచ్చింది.  ఎస్ జె వి ఎన్ ఉద్యోగులు కూడా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తమ వేతనాల నుంచి రూ. 32 లక్షలు విరాళం అందజేశారు.

 

******



(Release ID: 1609402) Visitor Counter : 97