శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 పై పోరాటానికి వీలుగా మ‌హారాష్ట్ర ఆస్ప‌త్రుల‌ను ఇన్‌ఫెక్ష‌న్ ర‌హిత ప్రాంతాలుగా చేయ‌నున్న పూణే స్కైటెక్ పార్క్‌కు చెందిన స్టార్ట‌ప్ కంపెనీ,

స్కైటెక్ ఎయిరాన్ పేరుతో నెగ‌టివ్ అయాన్‌ను ఉత్ప‌త్తిచేసే యంత్రం మూసిఉన్న గ‌ది వాతావ‌ర‌ణంలో వైర‌స్‌, బాక్టీరియా, ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్ల‌ను నియంత్రించ‌డానికి ఉ ప‌క‌రిస్తుంది.

ఇది గాలిని శుభ్రం చేయ‌డానికి, కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, అనుమానిత కేసుల‌ కార‌ణంగా ఇన్‌ఫెక్ష‌న్ సోకే అవ‌కాశం ఉన్న‌ ప్రాంతాల‌ను వైర‌స్ ర‌హితంగా చేయ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.

దీనివ‌ల్ల క్వారంటైన్ కేంద్రాల‌లో ప‌నిచేస్తున్న‌ సిబ్బంది, డాక్ట‌ర్లు, న‌ర్సుల రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి, వైర‌స్‌పై పోరాటంలో వారి సామ‌ర్ధ్యాన్ని మ‌రింత పెంచ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.
డిఎస్‌టి ఈ ఉత్ప‌త్తిని త‌యారు చేయ‌డానికి, పెద్ద సంఖ్య‌లో వీటి ఉత్ప‌త్తికి కోటి రూపాయ‌లు విడుదల చేసింది.
ఇలాంటి వెయ్యి ప‌రిక‌రాల్ని మ‌హారాష్ట్ర‌లోని వివిధ ఆస్ప‌త్రుల‌లో వినియోగించ‌నున్నారు.

Posted On: 30 MAR 2020 4:07PM by PIB Hyderabad

పూణేకి చెందిన స్కైటెక్ పార్క్ కు చెందిన ఒక ఇంక్యుబేటీ కంపెనీ కోవిడ్ -19 మ‌హ‌మ్మారిపై భార‌త‌దేశం సాగిస్తున్న పోరాటానికి చురుకైన ప‌రిష్కారంతో ముందుకు వ‌చ్చింది. ఇది గ‌ది వాతావ‌ర‌ణంలో గంట‌లోనే ఇన్‌ఫెక్ష‌న్‌కు గురైన ప్రాంతంలో వైర‌స్ ప్ర‌భావాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌గ‌లుగుతుంది.   కేంద్ర డిపార్ట‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ (డిఎస్‌టి) కింద చేప‌ట్టిన నిధి ప్ర‌యాస్ కింద ఈ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.
దీని ఉత్ప‌త్తిని పెంచేందుకు డి.ఎస్‌.టి కోటి రూపాయ‌లు విడుద‌ల చేసింది. ఇందులో వెయ్యి ప‌రిక‌రాలు త్వ‌ర‌లోనే మ‌హారాష్ట్ర‌లోని వివిధ ఆస్ప‌త్తుల‌లో ఏర్పాటు చేయ‌డానికి సిద్దంకానున్నాయి. పుణే కి చెందిన జె క్లీన్ వెద‌ర్ టెక్నాల‌జీ స్ కంపెనీ ఈ ఉత్ప‌త్తిని త‌యారు చేయ‌నుంది.
 
స్కైటెక్  ఎయిరాన్ పేరుతో నెగ‌టివ్ అయాన్‌ను ఉత్ప‌త్తిచేసే  యంత్రం మూసిఉన్న గ‌ది వాతావ‌ర‌ణంలో వైర‌స్‌, బాక్టీరియా, ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్ల‌ను నియంత్రించ‌డానికి ఉ ప‌క‌రిస్తుంది.

ఇది గాలిని శుభ్రం చేయ‌డానికి, కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, అనుమానిత కేసుల‌ కార‌ణంగా ఇన్‌ఫెక్ష‌న్ సోకే అవ‌కాశం ఉన్న‌ ప్రాంతాల‌ను వైర‌స్ ర‌హితంగా చేయ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనివ‌ల్ల క్వారంటైన్ కేంద్రాల‌లో ప‌నిచేస్తున్న‌ సిబ్బంది, డాక్ట‌ర్లు, న‌ర్సుల రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి, వైర‌స్‌పై పోరాటంలో వారి సామ‌ర్ధ్యాన్ని మ‌రింత పెంచ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.
స్కైటెక్ ఎయిరాన్ గురించి...
 
 ఇళ్లు, ఆస్ప‌త్రులు, పాఠ‌శాల‌లు, ప‌రిశ్ర‌మ‌లు త‌దిత‌రాల‌లో రోగ‌కార‌క వైర‌స్‌లు, బాక్టీరియాల వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఇది ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని అంత‌ర్జాతీయంగా పేరెన్నిక‌గ‌న్న సంస్థ‌లు శాస్త్రీయంగా ప‌రీక్షించి చూశాయి. ఒక గంట పాటు ఈ అయాన్ జ‌న‌రేట‌ర్‌ను పనిచేయిస్తే గ‌ది వైశాల్యాన్ని బ‌ట్టి 99.7 శాతం మేర‌కు వైర‌స్‌లు లేకుండా చేయ‌గ‌లుగుతుంది.
స్కైటెక్ ఎయిరాన్ అయోనైజ‌ర్ జ‌న‌రేట‌ర్ యంత్రం నెగ‌టివ్ చార్జ్‌డ్ అయాన్న‌లు ప్ర‌తి 8 సెకండ్ల‌ను సుమారు 100 మిలియ‌న్ల‌ను విడుద‌ల చేస్తుంది. అయోనైజ‌ర్ ఉత్ప‌త్తి చేసే నెగ‌టివ్ అయాన్లు మైక్రో పార్టిక‌ల్స్ చుట్టూ క్ల‌స్ట‌ర్లుగా ఎయిర్ బోర్న్ మోడ్‌లో ఏర్ప‌డి క‌రోనా లేదా ఇన్‌ఫ్ల్యూయంజా వైర‌స్‌లు, బాక్టీరియా , వంటి వాటిని  ర‌సాయ‌న చ‌ర్య ద్వారా నిర్మూలిస్తుంది.
   
 అయాన్ జ‌న‌రేట‌ర్ స‌మర్ధ‌త‌ను ఇన్‌ఫ్లూయంజా వైర‌స్‌.పోలియో వైర‌స్,హ్యూమ‌న్ క‌రోనా వైర‌స్  వంటి ప‌లు ర‌కాల వైర‌స్‌లు, ప‌లు ర‌కాల బాక్టీరియాలు. ఫంగ‌స్‌ల‌పై ప‌రీక్షించి చూశారు. ఇది ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌ల‌లో , రైల్వే స్టేష‌న్ల‌లో, విమానాశ్ర‌యాల‌లో లేదా విమాన కాబిన్‌లు,ఇళ్లు, ఆస్ప‌త్తి వార్డులు, ఇత‌ర ప్రాంతాల‌లో గాలిలో ఉండే వైర‌స్‌ను నియంత్రించ‌డానికి కూడా ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.



(Release ID: 1609401) Visitor Counter : 163