రైల్వే మంత్రిత్వ శాఖ
దేశంలోని వివిధ ప్రాంతాలకు నిత్యావసర సరకులు పూర్తి వేగంతో రవాణా చేస్తున్న భారతీయ రైల్వేలు
గత రెండు రోజుల్లో భారతీయ రైల్వేలు 71,261 వాగ్యన్ల సరకు లోడింగ్ చేసింది.
వీటిలో 48,614 అత్యవసర సరకులవి కాగా, మరో 22647 వ్యాగన్లు ఇతర ముఖ్యమైన సరకులకు సంబంధించినవి.
Posted On:
30 MAR 2020 4:30PM by PIB Hyderabad
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ అమలు జరుగుతుండగా, భారతీయ రైల్వేలు, నిరంతర సరకు రవాణా సేవల ద్వారా నిత్యావసర సరకులు అందుబాటులో ఉండేవిధంగా నిరంతరాయంగా పనిచేస్తోంది.
2020 మార్చి 28న 695 రేక్‌లు,/35942 వ్యాగన్ల సరకు లోడింగ్ జరగగా ఇందులో442 రేక్‌లు,/ 24412 వాగన్ల సరకు నిత్యావసర సరకులకు సంబంధించినవి.( ఒక వ్యాగన్‌లో 50-60 టన్నుల సరకు ఉంటుంది). ఇందులో 54 రేక్ లు /2405 వాగన్ల ఆహారధాన్యాలు ఉన్నాయి. 3 రేక్‌లు/126 వాగన్ల చక్కెర ఉంది. ఒక రేక్/42 వాగన్ల ఉప్పు ఉంది. 1 రేక్ /50 వాగన్లు వంట నూనెల, 356 రేక్‌లు/20519 వాగన్ల బొగ్గు, 27 రేక్ లు/ 1270 వాగన్ల పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి.
29 మార్చి 2020 న మొత్తం 684 రేక్‌లు /35319 వాగన్లు లోడ్ చేయగా, అందులో 437 రేక్‌లు /24202 వాగన్లలో నిత్యావసర సరకులు లోడ్ చేశారు. ఇందులో 40 రేక్‌లు/1727 వాగన్లు ఆహార ధాన్యాలు, 5 రేక్‌లు / 210 వ్యాగన్ల చక్కెర, రేక్/ 42 వ్యాగన్ల ఉప్పు, 1 రేక్ / 42 వ్యాగన్ల వంట నూనె, 363 రేక్‌ల /20904 వాగన్ల బొగ్గు, 27 రేక్‌లు/ 1277 వాగన్ల పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా సరకు రవాణా ప్రక్రియలో పూర్తి గా కొనసాగేవిధంగా కేంద్రహోంమంత్రిత్వశాఖ అనుమతిచ్చింది. రైల్వే మంత్రిత్వశాఖ, హోంమంత్రిత్వశాఖ అధికారులు వివిధ రాష్ట్రప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ నిర్వహణ పరమైన అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ టెర్మినళ్ల వద్ద సరకు రవాణా సులభంగా జరిగేట్టు చూస్తున్నారు.
(Release ID: 1609349)
Visitor Counter : 137