హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తో పోరులో భాగంగా 21 రోజుల లాక్ డౌన్ సందర్భంగా ప్రజలకు ఎలాంటి బాధలు కలగకుండా చూసేందుకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది – కేంద్ర హోం మంత్రి
ఈ కాలంలో వలస కార్మికుల ఆర్థిక ఇబ్బందులు తగ్గించే చర్యలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థవంతంగా అమలు చేయాలి – శ్రీ అమిత్ షా

Posted On: 29 MAR 2020 6:35PM by PIB Hyderabad

21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సంపూర్ణంగా కట్టుబడి ఉన్నారని, లౌక్ డౌన్, సామాజిక దూరం లాంటి చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని, ఈ కాలంలో వలస కార్మికుల ఆర్థిక కష్టాలను తీర్చేందుకు సంపూర్ణంగా కట్టుబడి ఉండాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలకు కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు.

కేంద్ర హోం మంత్రి ఆదేశాలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అన్ని ప్రాథమిక సదుపాయాలతో సహాయ ఆశ్రయాలను ఏర్పాటు చేయడానికి, ఆర్థిక ఇబ్బందులు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖలు రాశారు. పెద్ద సఖ్యంలో వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలు తరలించకుండా నిరోధించి, కోవిడ్ -19 వ్యాప్తిని నివారించాలని తెలిపారు.

లాక్ డౌన్ చర్యలను సమర్థవంతగా అమలు చేసేందుకు మరియు వలస కార్మికుల ఆర్థిక ఇబ్బందులు తగ్గించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ క్రింది అదనపు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది.

·        రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు తాత్కాలిక ఆశ్రయాల కోసం తగిన ఏర్పాట్లు చేయడం మరియు ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ కారణంగా చిక్కుకున్న వలస కార్మికులతో సహా పేదలకు ఆహారాన్ని అందించడం మొదలైనవి.

·         

·        ఇప్పటికే తమ సొంత రాష్ట్రాలు, స్వస్థలాలను చేరుకోవడానికి బయలుదేరిన ప్రజలకు ప్రామాణిక ఆరోగ్య ప్రోటోకాల్ ప్రకారం కనీసం 14 రోజులు సరైన స్క్రీనింగ్ తర్వాత సంబంధిత రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు నిర్బంధ సదుపాయాలు ఏర్పాట్లు చేయాలి.

·        లాక్ డౌన్ కారణంగా మూసివేయబడిన పరిశ్రమలు, దుకాణాలు, వాణిజ్య సంస్థల యజమానులు వారి పని ప్రదేశాల్లో, ఎటువంటి తగ్గింపు లేకుండా కార్మికులకు వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి.

·        వలస కార్మికులు అద్దె వసతి గృహాల్లో ఎక్కడ నివసిస్తున్నారో చూసుకోవాలి. ఆయా వసతి గృహాల యజమానులకు ఒక నెల కాలానికి అద్దె చెల్లించడానికి డిమాండ్ చేయకుండా చర్యలు తీసుకోవాలి.

·        ఎవరైనా కార్మికులను లేదా విద్యార్థులను తమ ప్రాంగణాన్ని ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తుంటే అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసి ఉంటుంది.

పైన పేర్కొన్న చర్యలను ఉల్లంఘించిన వారికి సంబంధిత రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు విపత్తు నిర్వహణ చట్టం -2005 కింద మరియు జిల్లా మేజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనర్ మరియు సీనియర్ పోలిసు సూపరింటెండెంట్ లేదా పోలీసు సూపరింటెండెంట్ కింద అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పైన పేర్కొన్న ఆదేశాలు మరియు లాక్ డౌన్ చర్యల అమలకు డిప్యూటీ పోలీస్ కమిషన్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి.

 

రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు(Release ID: 1609132) Visitor Counter : 42