రైల్వే మంత్రిత్వ శాఖ

లాక్‌డౌన్ స‌మ‌యంలో అవ‌స‌ర‌మున్న ప్ర‌జ‌ల‌కు భోజ‌న‌పాకెట్ల‌ను స‌ర‌ఫ‌రాచేసేందుకు ఐఆర్‌సిటిసి సిద్ధం

భోజ‌న పాకెట్ల పంపిణీకి 13 ఐఆర్‌సిటిసి బేస్ కిచెన్‌ల‌ను నోడ‌ల్ పాయింట్లుగా గుర్తింపు.

దేశ‌వ్యాప్తంగా 11,030 మ‌ధ్యాహ్న భోజ‌న ప్యాకెట్ల‌నుఈరోజు ప్ర‌జ‌ల‌కు స‌ర‌ఫ‌రా చేసిన ఐఆర్‌సిటిసి

సంబంధిత జోన్లు, డివిజ‌న్ల సీనియ‌ర్ రైల్వే అధికారులు ఇందుకు మ‌ద్ద‌తు నిస్తారు.

Posted On: 29 MAR 2020 5:05PM by PIB Hyderabad

ఐఆర్‌.సిటిసి గ‌ల వంట కేంద్రాల ద్వారా, అవ‌స‌ర‌మైన వారికి పేప‌ర్ ప్లేట్ల తోపాటు పెద్ద ఎత్తున భోజ‌నాన్ని స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఐఆర్‌సిటిసి నిర్ణ‌యించింది.
ఐఆర్‌సిటిసికి జోన్ ల‌వారీగా గ‌ల ప్ర‌ధాన వంట కేంద్రాలు కింది ప్రాంతాల‌లో ఉన్నాయి.
1. ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే, విజ‌య‌వాడ‌,
2.ప‌శ్చిమ రైల్వే, అహ్మ‌దాబాద్ , ముంబాయి సెంట్ర‌ల్‌
3. ఈస్ట్ కోస్ట్ రైల్వే ,కుర్దా రోడ్‌
4.ఆగ్నేయ రైల్వే, బాలాసోర్‌
5. ఉత్త‌ర రైల్వే, న్యూఢిల్లీ, ప‌హార్ గంజ్‌
6.ఉత్త‌ర మ‌ధ్య రైల్వే , ప్ర‌యాగ్ రాజ్‌, ఝాన్సీ, కాన్పూర్‌
7. సెంట్ర‌ల్ రైల్వే, సిఎస్ఎంటి, పూణె, షోలాపూర్‌, బుసావ‌ల్‌
8. ప‌శ్చిమ మధ్య రైల్వే , ఇటార్సి
9. నైరుతి రైల్వే, బెంగ‌ళూరు, హుబ్బ‌ళ‌ఙ‌
10. ద‌క్షిణ రైల్వే, తిరువ‌నంత‌పురం, చెంగ‌ల్ప‌ట్టు, కాట్పాడి, మంగ‌ళూరు
11. తూర్పు రైల్వే, సీల్దా, హౌరా
12. తుర్పు సెంట్రల్ రైల్వే, రాజేంద్ర‌న‌గ‌ర్‌
13, ఉత్త‌ర స‌రిహ‌ద్దు రైల్వే, క‌తిహార్‌

మార్చి 29, 2020న ఐఆర్‌సిటిసి మొత్తం 11,030 మ‌ధ్యాహ్న భోజ‌న పాకెట్ల‌ను అవ‌స‌ర‌మైన వారికి, వ‌ల‌స‌కూలీల‌కు, కొన్ని వృద్ధాశ్ర‌మాలు, దేశ‌వ్యాప్తంగా గ‌ల ఇత‌రుల‌కు కింది విధంగా స‌ర‌ఫ‌రా చేసింది.

 ప్రాంతం...స‌ర‌ఫ‌రా చేసిన‌..భోజ‌నాలు
1. ఢిల్లీ                          5030
2.బెంగ‌ళూరు                2000
3.హుబ్లి                            700
4. బొంబాయి సెంట్ర‌ల్ 1500
5.హౌరా, సీల్దా                  500
6. పాట్నా                          400
7. టాటా                            400
8. రాంచి                           300
9. క‌తియార్                       200
             

  ఐఆర్‌సిటిసి అందిస్తున్న ఈ  కార్య‌క్ర‌మాన్ని మ‌రింత విస్తృత‌ప‌రిచేందుకు సంబంధిత జోన్లు, డివిజ‌న్ల జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్లు, డిఆర్ఎం లు త‌మ వ‌ద్ద గ‌ల స‌మాచారాన్ని అందించ‌నున్నారు.ఐఆర్‌సిటిసి అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఆహారాన్ని వండి, స‌ర‌ఫ‌రాచేస్తుంది.  ఇందుకు సంబంధించి ఆఫీస‌ర్లు,డివిజ‌న్లు త‌మ ఇండెంట్ల‌ను పంపుతున్నాయి. వీటి పంపిణీని ఆర్‌.పి.ఎఫ్ ద్వారా లేదా, ఇత‌ర రైల్వే అథారిటీల ద్వారా చేప‌డ‌తారు. ఇందుకు ఎన్‌.జి.ఒలు వాలంటీర్ల సేవ‌లు కూడా వినియోగించుకునే వీలుంది.
ఐఆర్‌సిటిసి సంస్థ‌, ఆర్‌.పి.ఎఫ్‌, ఎన్‌.జి.ఒల తో క‌ల‌సి వివిధ రైల్వే జోన్ల‌లో వండిన ఆహార‌ప‌దార్థాల‌ను పేప‌ర్ ప్లేట్ల‌తో స‌హా స‌ర‌ఫ‌రా అవ‌స‌ర‌మైన వారికి అంద‌జేస్తోంది. ఈ సంద‌ర్భంగా సామాజిక దూరం, శుభ్ర‌త పాటిస్తున్నారు.

 లాక్ డౌన్ కాలంలో ఇంకా ఎక్కువ మొత్తంలో ఆహార స‌ర‌ఫ‌రా అవ‌స‌ర‌మైనా అలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు ఐఆర్‌సిటిసి సిద్ద‌మౌతోంది.కోవిడ్ -19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు లాక్ డౌన అమ‌లులో ఉన్న నేప‌థ్యంలో ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఎలాంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఐఆర్‌సిటిసి సిద్దంగా ఉంది. ఇందుకు సంబంధ‌ఙంచి ఆహార‌ధాన్యాలు, ఇత‌ర ముడి స‌ర‌కుల‌ను సిద్ధంగా ఉంచుకుంటున్నారు.

****



(Release ID: 1609129) Visitor Counter : 125