ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
నేషనల్ టెలికన్సల్టేషన్ సెంటర్ (కాన్ టెక్)ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్
Posted On:
28 MAR 2020 7:53PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ నేషనల్ టెలి కన్సల్టేషన్ సెంటర్(కాన్‌టెక్) ను ప్రారంభించారు. అలాగే రాష్ట్రాల మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ ల నోడల్ అధికారులతో మాట్లాడి , కోవిడ్ -19 సన్నద్ధతపై సమీక్షించారు.
ప్రాజెక్ట్ కాన్ టెక్ అనేది కోవిడ్ -19 నేషనల్ టెలి కన్సల్టేషన్ సెంటర్.కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ దీనికి రూపకల్పన చేసింది. దీనిని న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అమలు చేస్తోంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ , డాక్టర్ హర్షవర్ధన్, కాన్ టెక్‌ను ఎయిమ్స్‌లో అమలులోకి తీసుకువచ్చామని, కోవిడ్ -19 రోగులకు చికిత్సకువీలుగా దేశవ్యాప్తంగా గల వైద్యులను ఎయిమ్స్‌తో అనుసంధానం చేశామన్నారు. ఈ కేంద్రంలో వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉంటారని, ఇది నిరంతరాయంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ కేంద్రాన్ని నిర్వహించే డాక్టర్లకు భోజన, వసతి సదుపాయాలు కల్పించినట్టు చెప్పారు. చిన్న రాష్ట్రాలకు కూడా ఎయిమ్స్ వైద్యులకు గల అపార అనుభవాన్ని అందిపుచ్చుకోవడానికి దీనిని ఎయిమ్స్‌లో ఏర్పాటు చేసినట్టు డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. కోవిడ్ -19 చికిత్సకు ప్రపంచవ్యాప్తంగా వైద్యులు పలు రకాల ప్రొటోకాల్స్ పాటిస్తున్నారని అన్నారు. ఈ కేంద్ర ఏర్పాటు లక్ష్యం, దేశవ్యాప్తంగా డాక్టర్లను ఎయిమ్స్‌తో అనుసంధానం చేయడం ద్వారా పరస్పరం వారు చర్చించుకోవడానికి వీలు కల్పించి తద్వారా రోగులకు అత్యుత్తమ చికిత్స అందేట్టు చేయడమేనని చెప్పారు.
భారత ప్రభుత్వం టెలి మెడిసిన్ మార్గదర్శకాలను జారీచేసిందని, డిజిటల్ ప్లాట్ ఫాం, సాంకేతికతల సహాయంతో కొవిడ్ -19 కే కాకుండా ఇతర జబ్బులు నయం చేసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. ఎయిమ్స్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి గల అంతిమ లక్ష్యం దేశంలోని నిరుపేదలకు కూడా అత్యుత్తమ చికిత్స అందేలా చూడడమే నని డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు.
భారతదేశం. పెద్ద దేశమని ,ఇలాంటి దేశంలో పేదలకు వైద్య సహాయం అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ఎలాంటి పరిస్థితులలో కూడా పేదలకు నాణ్యమైన వైద్యం అందని పరిస్థితి ఉండకూడదన్నారు. ప్రస్తుత కేంద్రంతో పేదలుకూడా దేశంలోని అత్యున్నత స్థాయి వైద్యులనుంచి కూడా వైద్య సలహాలు పొందడానికి వీలు కలుగుదుందని ఆయన చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మారుతున్నాయి. అందువల్ల ఈ కేంద్రాన్ని ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను తట్టుకునే విధంగా బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. విదేశాలకు కూడా ఈ సేవలు విస్తరించే ఆలోచన ఉందని ఆయన చెప్పారు.
దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ లను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, దీనివల్ల దేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలను పరస్పరం చర్చించి, అమలు చేయడంలో తోడ్పడడానికి వీలు కలుగుతుందని అన్నారు. జిల్లా ఆస్పత్రుల కన్సల్టేషన్, టెలిమెడిసిన్, విద్య, శిక్షణ, సంప్రదింపులు, తమ మధ్య ప్రొటోకాల్స్ మార్పిడి వంటి విషయాలకు ఎయిమ్స్ ఒక హబ్‌గా రూపుదిద్దుకోవాలన్నారు. ఈ వ్యవస్థ సమర్ధతను పరీక్షించేందుకు డాక్టర్ హర్షవర్ధన్ ఒక కాల్‌ను ఈ కేంద్రం నుంచి స్వీకరించారు.
కాంటెక్ అనేది న్యూఢిల్లీ లోని ఎయిమ్స్ ఏర్పాటు చేసిన టెలిమెడిసిన్ హబ్. ఇందులో వైద్య రంగానికి చెందిన వివిధ విభాగాల నిపుణులు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. వీరు దేశవ్యాప్తంగా గల స్పెషలిస్టుల నుంచి వచ్చే పలు రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఇది మల్టీ మోడల్ టెలి క మ్యూనికేషన్ హబ్. దీనిద్వారా ఇరువైపులా ఆడియో- వీడియో , టెక్స్ట్ కమ్యూనికేషన్‌ను దేశంలోని,. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా అందుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ కమ్యూనికేషన్ లో భాగంగా సాధారణ మొబైల్ టెక్నాలజీ నుంచి ఇరువైపులా వీడియో కమ్యూనికేషన్ , వాట్పప్ , స్కైప్, గూగుల్ డ్యుయో వంటివి కూడా ఉపయోగించుకోవచ్చు.
కాంటెక్ నేషనల్ మెడికల్ కాలేజ్ నెట్ వర్క్ - ఎన్.ఎం.సి.ఎన్ తో పూర్తిగా అనుసంధానమై ఉంటుంది. దీనిద్వారా ఎన్.ఎం.సి.ఎన్‌తో అనుసంధానమైన 50 వైద్య కళాశాలల మధ్య పూర్తి స్తాయి వీడియో కాన్ఫరెన్స్‌ను ఈ సంస్థకు లక్నోలో ఎస్.జిపిజిఐ లోగల నేషనల్ రిసో్ర్స్ సెంటర్ ద్వారా నిర్వహించవచ్చు.
పేషెంట్ మానేజ్‌మెంట్ సలహలను జాతీయ స్థాయి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రమాణీకరిస్తారు. ఇందుకు సంబంధించి ఎయిమ్స్ డైరక్టర్ నామినేట్ చేసిన టీమ్ అభివృద్ధి చేసిన మార్గదర్శకాలు అదనంగా ఉంటాయి.
కాన్ టెక్ ను సంప్రదించడం ఎలాఝ
ఇందుకు ఒకే ఒక మొబైల్ నంబర్-+ 91 9115444155 కు కోవిడ్ -19 సంబంధిత చికిత్స అందిస్తున్న వైద్యులు ఎవరైనా దేశంలోని లేదా ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా డయల్ చేసి కాంటెక్‌తో మాట్లాడవచ్చు. ప్రస్తుతానికి ఏకకాలంలో ఇందుకు ఆరు లైన్లు ఉన్నాయి. అవసరమైతే లైన్ల సంఖ్యను భవిష్యత్తులో మరింత పెంచుతారు. ఈ నంబర్‌కు వచ్చే కాల్స్‌ను కాంటెక్ మేనేజర్లు అందుకుని వాటిని ఆయా క్లినికల్ డొమైన్లకు సంబంధించి, సంబంధిత నిపుణుడికి పంపుతారు.
వాట్సప్, స్కైప్, లేదా గూగుల్ డ్యుయో ద్వారా ఇరువైపులా వీడియో కాల్ ను ఉపయోగించుకునేందుకు కాంటెక్ మేనేజర్లు తగిన విధంగా సూచనలిస్తారు. ఎన్.ఎం.సి.ఎన్ నెట్ వర్క్ నుంచి కాల్ చేయదలచుకున్న వారు తమ వద్ద గల టెలి మెడిసిన్ సదుపాయాలను ఉపయోగించుకుని ఎప్పుడైనా ఈ కేంద్రం సేవలు అందుకోవచ్చు.
(Release ID: 1608945)
Visitor Counter : 178