వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఎగుమ‌తి ప్రోత్సాహ‌క మండ‌లి ప్ర‌తినిధుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన కేంద్ర మంత్రి శ్రీ‌ పియూష్ గోయ‌ల్‌

Posted On: 27 MAR 2020 5:07PM by PIB Hyderabad

కోవిడ్ -19 కార‌ణంగా  ప్ర‌స్తుతం అమ‌లు జ‌రుగుతున్న లాక్ డౌన్ ప్ర‌భావాన్ని అంచ‌నా చేసేందుకు దేశవ్యాప్తంగా గ‌ల వివిధ ఎగుమతి ప్రోత్సాహ‌ఖ మండ‌ళ్లు(ఇపిసిల) ప్ర‌తినిధుల‌తో కేంద్ర రైల్వేలు, వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయ‌ల్ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. వారి నుంచి స్పంద‌న అడిగి తెలుసుకోవ‌డంతోపాటు ప్ర‌స్తుత ప‌రిస్థితిని అధిగ‌మించేందుకు వారి నుంచి సూచ‌న‌లు స్వీక‌రించేందుకు ఈ సమావేశం నిర్వ‌హించారు.
వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌ల శాఖ స‌హాయ‌మంత్రి శ్రీ హ‌ర్దీప్ సింగ్ పూరి, వాణిజ్య కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ అనుప్ వాధ్వాన్‌, డిజిఎఫ్ టి డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ శ్రీ అమిత్ యాద‌వ్ త‌దిత‌రులు ఈ స‌మావేశంలొ పాల్గొన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా త‌మ కార్య‌క‌లాపాలు, వ్యాపారాల‌పై ప‌డిన ప్ర‌భావం గురించి ఇపిసిలు వివ‌రించాయి. ఈ క‌ష్టాన్ని అధిగ‌మించేందుకు కొన్ని సూచ‌న‌లు ఈ స‌మావేశంలో వ‌చ్చాయి.
 
ఈ సమావేశంలో మాట్లాడుతూ శ్రీ పియూష్ గోయ‌ల్‌, దేశానికి సంబంధించి ఎగుమ‌తి-దిగుమ‌తి కీల‌క కార్య‌క‌లాప‌మ‌ని అన్నారు. అదే స‌మ‌యంలో 130 కోట్ల మంది భార‌తీయుల ర‌క్ష‌ణ , ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ నిమిత్తం లాక్ డౌన్ అవ‌స‌ర‌మ‌న్నారు. అందువ‌ల్ల రెండింటి మ‌ధ్య స‌మ‌తూకం పాటించ‌డం జ‌రుగుతుంద‌ని,  ప్ర‌స్తుత క‌ష్టాలు త‌గ్గించేందుకు ప‌రిష్కారాలు క‌నుగొన‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు.
ప్ర‌స్తుత స‌మావేశంలో వ‌చ్చిన సూచ‌న‌ల‌ను స‌రైన స్ఫూర్తితో స్వీక‌రించ‌డం జ‌రుగుతుంద‌ని , త్వ‌ర‌లోనే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఎగుమ‌తులు, దిగుమ‌తుల రంగానికి సంబంధించి స‌హేతుక డిమాండ్ల‌ను నెర‌వేర్చేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంద‌ని, ఆచ‌ర‌ణాత్మ‌క చ‌ర్య‌ల‌తో ముందుకు వ‌స్తుంద‌ని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఎఫ్.ఐ.ఇ.ఒ, ఎఇపిసి, ఎస్‌.ఆర్‌టి.ఇ.పి.సి, జిజెఇపిసి, సిఎల్ఇ, సిఇపిసి, షెఫిక్సిల్‌, ఫార్మెక్సిల్, ఎల‌క్ట్రానిక్ , సాఫ్ట్‌వేర్ ఇపిసి, స‌ర్వీసెస్ ఇపిసి, సిల్క్ ఇపిసి, ఇఇపిసి, ఇపిసిహెచ్‌, ప్రాజెక్ట్ ఇపిసి, టెక్స్‌ప్రోసిల్‌, టెలికం ఇపిసి, కాష్యూ ఇపిసి, ప్లాస్టిక్ ఇపిసి, స్పోర్ట్స్ గూడ్స్ ఇపిసి, కాపెక్స్‌సిల్‌, కెమ‌క్స్‌సిల్‌, ఇపిసి ఫ‌ర్ ఇఒయు ,ఎస్.ఇ.జెడ్‌, ఊల్‌, ఉల‌న్ ఇపిసి, హెచ్ఇపిసి, ఐఒపిఇసి పాల్గొన్నాయి.


*****


(Release ID: 1608687) Visitor Counter : 85