ఉప రాష్ట్రపతి సచివాలయం
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి ఒక నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఉపరాష్ట్రపతి
Posted On:
27 MAR 2020 6:24PM by PIB Hyderabad
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ శ్రీ ఎం.వెంకయ్యనాయుడు, దేశంలో కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి (పిఎంఎన్ ఆర్ ఎఫ్)కు ఈరోజు తమ ఒక నెల వేతనానికి సమానమైన మొత్తాన్ని అందజేశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కి లేఖ రాస్తూ ఆయన, కోవిడ్ -19 విపత్తు ఎంతో తీవ్రమైనదని, ప్రపంచవ్యాప్తంగా దీనివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం ఎప్పటికప్పుడు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సకాలంలో సత్వర చర్యలు తీసుకుంటున్నదన్నారు.కరోనాపై పోరుకు ఇది తన స్వల్ప కంట్రిబ్యూషన్‌గా ఆయన పేర్కొన్నారు.
(Release ID: 1608685)
Visitor Counter : 112