రక్షణ మంత్రిత్వ శాఖ
గోవాలో ఆరోగ్య కార్యకర్తల కోసం ఢిల్లీ నుండి ఫేస్ మాస్కులను తరలించడానికి ఐఎల్38 విమానాన్ని వినియోగించిన భారత నావికా దళం
Posted On:
27 MAR 2020 6:54PM by PIB Hyderabad
భారత నావికా దళం తగు ఏర్పాట్లు చేయడంతో గోవాలో ఫేస్ మాస్కులకు ఏర్పడిన కొరతను సకాలంలో తీర్చగలిగారు. గోవా- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ మేరకు 60,000 ఫేస్ మాస్కులు ఢిల్లీ నుండి తెప్పించాల్సి ఉంది. అయితే లాక్ డౌన్ వల్ల ఢిల్లీలో ట్రక్కులు కదలకపోవడంతో రవాణా స్తంభించింది. వెంటనే భారత నావికా దళాన్ని రంగంలోకి దింపారు.
ఈ మేరకు, భారత నావికా దళానికి చెందిన దీర్ఘ శ్రేణి సముద్ర పర్యవేక్షణ విమానం ఇల్యూషిన్ 38 ఎస్డీ (ఐఎల్ -38) ని ఈ రోజు (27 మార్చి 2020) న్యూఢిల్లీ లోని పాలమ్ విమానాశ్రయానికి ఐఎన్ఎస్ హన్సా నుండి తెప్పించి సిద్ధం చేసారు. ఢిల్లీలో మాస్కుల సమీకరణను పాలం వైమానిక దళం స్టేషన్ సమన్వయము చేసింది. వెంటనే ఫేస్ మాస్కులను గోవా కి తరలించారు.
****
(Release ID: 1608643)
Visitor Counter : 134