ఆర్థిక మంత్రిత్వ శాఖ

కరోనా వైరస్ పై జరుగుతున్న పోరాటంలో పేదలకు ఊతం ఇచ్చేందుకు రూ.1.70 లక్షల కోట్ల సహాయ ప్యాకేజీ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రకటించిన కేంద్ర ఆర్ధిక మంత్రి

Ø బీమా పథకం కింద కోవిడ్-19పై పోరాటం చేస్తున్న ఆరోగ్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా సౌకర్యం

Ø 80 కోట్ల మంది పేదలకు నెలకు 5 కిలోల గోధుమలు లేదా బియ్యం, ఒక కిలో పప్పు దినుసులు వచ్చే మూడు నెలలు ఉచితంగా

Ø 20 కోట్ల మంది మహిళలలు జనధన్ ఖాతాలకు వరుసగా 3 నెలలూ, నెలకు రూ.500 నగదు జమ

Ø మహాత్మగాంధీ నరెగా(ఎంఎన్ఆర్జిఏ) పనివారికి దినసరి వేతనం రూ.182 నుండి రూ.202 కి పెంపు; 13.62 కోట్ల కుటుంబాలకు లబ్ది

Ø పేద వృద్ధులు, పేద ఒంటరి మహిళలు, పేద దివ్యంగులకు రూ.1,000 ఆర్ధిక సహాయం ; 3 కోట్ల మంది పేదలకు ప్రయోజనం

Ø పి.ఎం కిసాన్ యోజనలో భాగంగా ముందుగానే రైతులకు ప్రయోజనం చేకూరేలా ఏప్రిల్ మొదటి వారంలోనే రు.2,000 చెల్లింపు; 8.7కోట్ల మంది రైతులకు లబ్ది

Ø భవన, నిర్మాణ రంగం కార్మికులకు ఉద్దేశించిన సంక్షేమ నిధిని ఆ కార్మికుల కోసం వినియోగించుకోడానికి రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

Posted On: 26 MAR 2020 5:12PM by PIB Hyderabad

కరోనా వైరస్ తో జరుగుతున్న పోరాటంలో దేశవ్యాప్తంగా పేదలకు తగు ఊతం ఇవ్వడానికి రూ. 1.70 లక్షల కోట్ల సహాయ ప్యాకేజీని ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పేరుతో ఈ పథకాన్నితక్షణమే అమలు చేయనున్నట్టు ఈ రోజు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘ఈ రోజు ప్రకటించిన ఈ చర్యలు నిరుపేదలకు ఆహరంనగదు చేతిలో అందుబాటులో ఉండేలా చేస్తున్నాం. ప్రస్తుత కష్టకాలంలో అత్యవసర సరుకులు పేదలకు అందాలి అనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టాం" అని ఆర్ధిక మంత్రి చెప్పారు.

 ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ తో పాటు ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శ్రీ అతాను చక్రబోర్తిఆర్ధిక సేవల కార్యదర్శి శ్రీ దేబశీష్ పాండా కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ అంశాలు ఈ కింద విధంగా ఉన్నాయి.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్

 

I.  ప్రభుత్వ ఆస్పత్రులుఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్-19 పై పోరాటం చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు బీమా పథకం:

·        సఫాయి కర్మచారిలువార్డ్ బాయ్స్నర్సులుఆశా వర్కర్లుపారామెడిక్స్టెక్నిషియన్లువైద్యులుస్పెషలిస్టులుఇతర ఆరోగ్య సహాయకులు ఈ ప్రత్యేక బీమా పథకం కిందకు వస్తారు.

·        కోవిడ్-19 వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడంలో నిమగ్నమై ఉన్న వైద్యఆరోగ్య రంగానికి చెందిన వారు ఎవరికైనా ప్రమాదం జరిగితే వారికి కూడా ఈ బీమా వర్తిస్తుంది. 

·        కేంద్రంరాష్ట్రం పరిథిలో ఉన్న ఆరోగ్య కేంద్రాలువెల్నెస్ సెంటర్స్ఆస్పత్రులు కూడా ఈ బీమా కిందకు వస్తాయి. సుమారు 22 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు బీమా వర్తిస్తుంది

 

IIపీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన :

·        ఈ మూడు నెలల అంతరాయం వల్ల ఏ పేద కుటుంబం ఆహరం ధాన్యాలు అందక  ఆకలితో అలమటించరాదన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం

·        80 కోట్ల మంది వ్యక్తులుఅంటే దేశ జనాభా లో సుమారు మూడింట రెండొంతులు మంది  ఈ పథకం కిందకు వస్తారు

·        ఈ లబ్ధిదారుల్లో ప్రతి ఒక్కరికి వచ్చే మూడు నెలల్లో వారి ప్రస్తుత అర్హత కంటే రెట్టింపు ఇవ్వబడుతుంది.

·        ఈ అదనపు లబ్ది ఉచితంగానే వారికి అందుతుంది

 

పప్పు ధాన్యాలు:

·        పైన పేర్కొన్న వ్యక్తులందరికీ తగినంత ప్రోటీన్ లభ్యత ఉండేలాప్రతి కుటుంబానికి ఒక కిలో చొప్పునవచ్చే మూడు నెలల పాటు స్థానిక ప్రాధాన్యతల ప్రకారం పప్పుధాన్యాలు అందించబడతాయి.

·        ఈ పప్పు ధాన్యాలు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది

 

III. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద...

రైతులకు లబ్ది:

·        2020-21లో చెల్లించాల్సిన మొదటి విడత రూ .2,000 ముందుగానే 2020 ఏప్రిల్‌లోనే చెల్లించబడుతుంది

·        ఇది 8.7 కోట్ల మంది రైతులకు వర్తిస్తుంది

 

IV. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద నగదు బదిలీ:

పేదలకు సహాయం:

మొత్తం 20.40 కోట్ల పీఎం జనధన్ యోజన మహిళా ఖాతాదారులకు నెలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు ఆర్ధిక సహాయం అందుతుంది

 

గ్యాస్ సిలెండర్లు:

పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద గ్యాస్ సిలెండర్ల ఉచితంగా మూడు నెలలపాటు అందజేస్తారు. దీని వల్ల 8 కోట్ల కుటుంబాలు లబ్ది పొందుతాయి

 

వ్యవస్థీకృత రంగాలలో తక్కువ వేతనం పొందేవారికి  సహాయం:

·        100 కంటే తక్కువ మంది కార్మికులను కలిగి ఉన్న వ్యాపారాలలో నెలకు రూ .15 వేల లోపు వేతనాలు పొందే వారు. వీరి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

·        ఈ ప్యాకేజీ కింద అటువంటి వారి వేతనంలో 24 శాతం వచ్చే మూడు నెలలు కేంద్ర ప్రభుత్వమే వారి పిఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది.

·        ఈ చర్యలు వారి ఉద్యోగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా చేస్తాయి  

 

వయోవృద్ధులు (60 ఏళ్ల పైబడ్డ వారు)ఒంటరి మహిళలుదివ్యంగులకు సహాయం:

·        వయోవృద్ధ ఒంటరి మహిళలుదివ్యంగులు కేటగిరికి చెందిన వారు సుమారు 3 కోట్ల మంది ఉంటారు. కోవిడ్-19 వల్ల వీరందరి ఆర్ధిక పరిస్థితి అతలాకుతలం అయ్యే అవకాశం ఉంది

·        అందువల్ల ఈ కష్టకాలంలో వారికి అండగా ఉండడానికి రూ.1,000 ఆర్ధిక సహాయం ప్రభుత్వం అందజేస్తుంది

 

ఎంఎన్ఆర్జిఏ :

·        పీఎం గరీబీ కళ్యాణ్ యోజన కింద ఎంఎన్ఆర్జిఏ వేతనం రూ.20 పెంపు. 2020 ఏప్రిల్ ఒకటో తేదీన ఇది అమలులోకి వస్తుంది.  ఎంఎన్ఆర్జిఏ పథకం కింద పని వారికి అదనంగా ఏటా రూ.2,000 లబ్ది చేకూరుతుంది.

·        ఇది 13.62 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుస్తుంది

 

V. స్వయం సహాయక గ్రూపులు:

·        మొత్తం 63 లక్షల స్వయం సహాయక గ్రూపులు (ఎస్.హెచ్.జి) 6.85 కోట్ల మంది మహిళకు సహాయకారిగా ఉంటున్నాయి.

·        పూచికత్తు లేకుండా వీరందరికి రుణ సదుపాయ పరిమితి రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంపు

 

VI. పీఎం గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ ఇతర అంశాలు:

సంఘటిత రంగం:

·        పీఎఫ్ ఖాతాల నుండి 75 శాతం మొత్తాన్ని లేదా మూడు నెలల వేతనాలను ఏది తక్కువైతే అంత, 'తిరిగి వెనుకకు చెల్లించనవసరం లేకుండాఖాతాదారులు అడ్వాన్స్‌ తీసుకోడానికి అనుమతిస్తారు.  మహమ్మారి వ్యాధులకు కూడా ఇది వర్తిస్తుంది అని నిబంధనలను సవరిస్తారు.

·        ఈపీఎఫ్ కింద నమోదై ఉన్న 4 కోట్ల కుటుంబాలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు

భవనాలుఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ నిధి:

·        కేంద్ర ప్రభుత్వ చట్టం కింద భవనఇతర నిర్మాణ రంగ కార్మికుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు అయి ఉంది.

·        ఈ నిధి కింద సుమారు 3.5 కోట్ల మంది కార్మికులు నమోదై ఉన్నారు

·        ఈ కార్మికులకు ఆర్ధిక అవాంతరాలనుండి కాపాడడానికికార్మికులకు సహాయం అందించడానికి రాష్ట్రాలు ఈ సంక్షేమ నిధిని వినియోగించవచ్చని ఆదేశాలు జారీ చేసిన కేంద్రం 

 

జిల్లా ఖనిజ నిధి:

·        కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నివారించడంతో పాటు రోగుల చికిత్సకు సంబంధించి వైద్య పరీక్షలుస్క్రీనింగ్ మరియు ఇతర అవసరాల సౌకర్యాలను కల్పించడానికి  జిల్లా ఖనిజ నిధి (డిఎంఎఫ్) కింద లభించే నిధులను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.

 

****(Release ID: 1608416) Visitor Counter : 732