వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
చేతులు శుభ్రపరచుకునేందుకు గరిష్ఠస్థాయిలో శానిటైజర్లు ఉత్పత్తి చేయాల్సిందిగా డిస్టిలరీలు, చక్కెర మిల్లులను కోరిన ప్రభుత్వం
చేతిని శుభ్రపరచుకునే శానిటైజర్ల ఉత్పత్తికి 100 డిస్టిలరీలు, 500కు పైగా తయారీదారులకు అనుమతి
Posted On:
26 MAR 2020 3:42PM by PIB Hyderabad
కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ కాలంలో అత్య వసర సరకుల సరఫరా సక్రమంగా జరిగేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలూ తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజారోగ్య కార్యకర్తలు, ఆస్పత్రులు హ్యాండ్ శానిటైజర్లను వాడుతాయి. దీనితో వీటి డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఫలితంగా డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం లేకుండా చూసేందుకు, శానిటైజర్ల తయారీలో ఉపయోగించే ఇథనాల్, ఇఎన్ఎ లకు పర్మిషన్లు, లైసెన్సులు ఇచ్చి హ్యాండ్ శానిటైజర్లు తయారు చేసేందుకు ముందుకు వచ్చే వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా వివిధ రాష్ట్రాల ఎక్సైజ్ కమిషనర్లు, చెరకు కమిషనర్లు, డ్రగ్ కంట్రోలర్లు, వివిధ జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సూచించారు.
హ్యాండ్ శానిటైజర్ల తయారీకి 45 డిస్టిలరీలు, 564 ఉత్పత్తిదారులకు హ్యాండ్ శానిటైజర్ల తయారీకి పర్మిషన్లు మంజూరు చేయడం జరిగింది. మరో ఒకటి రెండు రోజులలో 55 డిస్టిలరీలకు పర్మిషన్లు మంజూరు చేయనున్నారు.ప్రస్తుత పరిస్థితులలో మరి కొన్ని సంస్థలను కూడా శానిటైజర్ల తయారీకి ప్రోత్సహించడం జరుగుతుంది. అనుమతులు పొందిన సంస్థలలో చాలావరకు ఇప్పటికే తయారీని ప్రారంభించగా మరికొన్ని వారంలోజులలో ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. దీనితో ఆస్పత్రులు, వినియోగదారులకు సరిపడినంతగా హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉండనున్నాయి.
హ్యాండ్ శానిటైజర్లను అందుబాటు ధరలలో వినియోగదారులు, ఆస్పత్రులకు అందించేందుకు , ప్రభుత్వం వీటి గరిష్ఠ చిల్లర ధరను కూడా నిర్ణయించింది. హ్యాండ్ శానిటైజర్ల గరిష్ఠ చిల్లర ధర 200 మిల్లీలీటర్ల బాటిల్ రూ 100గా నిర్ణయించారు. మిగతా పరిమాణాలను ఈ ధరల దామాషా ప్రకారం నిర్ణయిస్తారు.
(Release ID: 1608365)
Visitor Counter : 140