మంత్రిమండలి

దేశీయంగా వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు

Posted On: 21 MAR 2020 4:23PM by PIB Hyderabad

  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి- దిగువ పేర్కొన్న పథకాలకు ఆమోదముద్ర వేసింది.
దేశంలో వైద్య పరికరాల తయారీ పార్కులను ప్రోత్సహించే పథకంలో భాగంగా  రూ.400 కోట్ల అంచనా వ్య‌యంతో నాలుగు వైద్య పరికరాల పార్కుల‌లో సార్వ‌త్రిక మౌలిక వ‌స‌తుల కల్పనకు రుణసాయం.
దేశీయంగా వైద్య పరికరాల తయారీని ప్రోత్స‌హించేందుకు రూ.3,420 కోట్ల అంచ‌నా వ్య‌యంతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహ‌క ప‌థ‌కం (PLI).
పేన పేర్కొన్న పథకాలకు ఉద్దేశించిన నిధులను 2020-21 నుంచి 2024-25 మధ్య ఐదేళ్ల వ్యవధిలో ఖర్చుచేస్తారు.
వివరాలు:
వైద్య పరికరాల పార్కులకు ప్రోత్సాహం
వైద్య పరికరాల తయారీ ఎదుగుతున్న రంగం కాగా, ఆరోగ్య సంరక్షణ మార్కెట్‌లోని ఇతర రంగాలతో పోలిస్తే అత్యధిక వృద్ధికి అవకాశం ఇందులోనే ఉంది. ఆ మేరకు 2018-19లో దీని రూ.50,026కోట్లు కాగా, 2021-22నాటికి రూ.86,840కోట్లకు చేరుతుందని అంచనా. కాగా, నేడు దేశానికి అవసరమైన వైద్య పరికరాలలో 85శాతం దాకా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది.
దేశంలో వైద్య పరికరాల తయారీ పార్కులను రాష్ట్రాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలన్నది ఈ పథకం లక్ష్యం. ప్రతి పార్కుకూ రూ.100 కోట్ల గరిష్ఠ పరిమితితో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు ఆర్థిక సహాయం మంజూరవుతుంది.
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహ‌క ప‌థ‌కం:
వైద్య ప‌రిక‌రాల రంగం 12 నుంచి 15 శాతందాకా త‌యారీ వ్య‌య సామ‌ర్థ్య లోపం దృష్ట్యా ఉత్పాదక వైకల్యంతో బాధపడుతోంది, అంతేగాక పోటీ ఆర్థిక వ్యవస్థలు, ఇతరత్రా అంశాల‌తోపాటు త‌గు మౌలిక వ‌స‌తుల లేమి, దేశీయ సరఫరా శృంఖ‌లం, ర‌వాణా,  రుణ స‌మీక‌ర‌ణ‌కు అధిక వ్య‌యం, నాణ్యమైన విద్యుత్ కొర‌త, ప‌రిక‌ర రూప‌క‌ల్ప‌న‌లో ప‌రిమిత సామ‌ర్థ్యంస‌హా ప‌రిశోధ‌న‌-అభివృద్ధి, నైపుణ్య వృద్ధిపై శ్ర‌ద్ధా లోపం త‌దిత‌రాలు దీనికి తోడ‌వుతున్నాయి. కాబట్టి ఉత్పాదక వైకల్యాన్ని భర్తీ చేసేందుకు ఒక యంత్రాంగం అవసరం ఎంతయినా ఉంది.
వైద్యపరికరాల రంగంలోకి పెద్దస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించి, దేశీయంగా ఉత్పత్తికి ఉత్తేజమివ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. అలాగే ఈ పథకం కింద ప్రాతిపదిక సంవత్సరం (2019-20) నుంచి పెరిగే వైద్య పరికరాల అమ్మకాలనుబట్టి ఎంపిక చేసిన తయారీ సంస్థలకు 5 శాతం నగదు ప్రోత్సాహకం ఇవ్వబడుతుంది.
అమలు:
   దేశంలో వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించే ఈ పథకం- ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేసే ‘పథకం అమలు ఏజెన్సీ’ (SIA)ద్వారా అమలు చేయబడుతుంది.   ఔషధ మంత్రిత్వశాఖ ప్రతిపాదించే ‘ప్రాజెక్టు నిర్వహణ ఏజెన్సీ (PMA)ద్వారా దేశీయంగా వైద్య పరికరాల తయారీ సంస్థలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం అందించే పథకం అమలు చేయబడుతుంది. నిర్దేశిత నాలుగు వైద్య పరికరాల తయారీ పార్కులలో ఉమ్మడి మౌలిక సదుపాయాలు కల్పనకు ఆర్థిక చేయూతనివ్వడం ఈ పథకం లక్ష్యం. తదనుగుణంగా దిగువ పేర్కొన్న రకాల వైద్య పరికరాలు ఉత్పత్తిచేసే 25 నుంచి 30 మంది తయారీదారులకు సహాయం అందించడం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం లక్ష్యం:-
కేన్సర్ సంరక్షణ/రేడియో థెరపీ వైద్య పరికరాలు
రేడియాలజీ-ఇమేజింగ్ (అయోనైజింగ్, నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ఉత్పత్తులుసహా) పరికరాలు, న్యూక్లియర్ ఇమేజింగ్ పరికరాలు.
ఎనెస్థటిక్స్-కార్డియో రెస్పిరేటరీ (కార్డియో రెస్పిరేటరీ కేటగిరీ కేథెటర్స్, రీనల్ కేర్ వైద్యపరికరాలుసహా) వైద్య పరికరాలు.
కాక్లియర్ ఇంప్లాంట్స్, పేస్ మేకర్స్ సహా శరీరంలో అమర్చే అన్నిరకాల ఎలక్ట్రానిక్ పరికరాలు.
ప్రభావాలు:
   వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించే మూడు నిర్దేశిత వైద్య పరికరాల పార్కులలో ఉప-పథకం కింద ఆర్థిక సహాయంతో ఉమ్మడి మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. దీనివల్ల దేశంలో వైద్య పరికరాల తయారీ వ్యయం గణనీయంగా తగ్గుతుందని అంచనా. దేశీయంగా వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకంతో ఈ రంగంలోకి భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే అవకాశం కలగడంతోపాటు ప్రత్యేకంగా గుర్తించిన నిర్దిష్ట విభాగాల్లో దేశీయంగా వైద్య పరికరాల తయారీకి ఉత్తేజం లభిస్తుంది. దీనివల్ల రానున్న ఐదేళ్లలో రూ.68,347 కోట్ల మేర ఉత్పాదకత పెరిగే వీలుందని అంచనా. అంతేకాకుండా ఈ పథకాలు ఐదేళ్ల వ్యవధిలో అదనంగా 33,750 ఉద్యోగాల సృష్టికి బాటలు వేస్తాయి. నిర్దిష్ట వైద్య పరికరాల విభాగంలో దిగుమతులను గణనీయంగా తగ్గించడంలోనూ ఈ పథకాలు ఎంతగానో తోడ్పడతాయి.
***
 



(Release ID: 1607584) Visitor Counter : 186