ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ – 19 గురించి తాజా సమాచారం

ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు

Posted On: 11 MAR 2020 3:57PM by PIB Hyderabad

విశ్వవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాధి ప్రబలిన నేపధ్యంలో వివిధదేశాలలో ఉన్న/చిక్కుబడిపోయిన భారతీయ పౌరులను, భారత జాతీయులను ఇతర దేశాల నుంచి స్వదేశానికి తరలించే/తీసుకువచ్చే  చర్యలను భారత ప్రభుత్వం చేపట్టింది.

ఇరాన్ లో కోవిడ్ -19 వ్యాధి శరవేగంతో వ్యాపిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే  ఆ దేశంలో ఉన్న భారతీయ పౌరులను రక్షించేందుకు, భద్రంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు భారత ప్రభుత్వం చెర్యలు తీసుకోవడం ప్రారంభించింది.  ఇరాన్ దేశంలో ఉన్న భారత జాతీయులలో యాత్రికులు, విద్యార్ధులు మరియు జాలరులు ఉన్నారు.  మర్చి 7వ తేదీన ఇరాన్ నుంచి అందిన 108 నమూనాలను అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ప్రయోగశాలలో పరీక్షించారు.    అంతేకాక భారత వైద్య పరిశోధనా విజ్ఞాన మండలి ( ఐ సి ఎం అర్ర్)కి చెందిన ఆరుగురు శాస్త్రజ్ఞులను, అవసరమైన పరికరాలను, పరీశాలు జరిపేందుకు అవసరమైన పదార్ధాలను కూడా ఇరాన్ పంపి ప్రయోగశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.  ఇరాన్ నుంచి తరలించిన మొదటి భారతీయుల బృందాన్ని తీసుకువచ్చిన విమానం  మార్చి 10వ తీదీన ఇండియాకు చేరింది.  ఈ బృందంలోని 58 మందిలో 31 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  మొదటి బృందంలోని వారందరికీ పరీశాలు నిర్వహించి చూడగా ప్రస్తుతం వారికి రోగ లక్షణాలు లేవని నిర్ధారణ అయ్యింది.

 

 

కోవిడ్ -19 వ్యాధి ప్రభావిత దేశాల నుంచి భారత ప్రభుత్వం ఇప్పటివరకు 948 మందిని భారత్ తలించింది.  వారిలో 900 మంది భారతీయ పౌరులు కాగా మిగిలిన 48 మంది మాల్దీవులు, మైన్మార్, బంగ్లాదేశ్, చైనా, అమెరికా, మెడగాస్కర్, శ్రీలంక, నేపాల్, దక్షిణాఫ్రికా మరియు పేరూ తదితర దేశాలకు చెందిన వారు. 

అంతకు ముందు చైనా దేశంలోని హుబీ రాష్ట్రం వుహాన్ నగరంలో చిక్కుపడిపోయిన వారిని తీసుకువచ్చేందుకు ఎయిర్ ఇండియా రెండు ప్రత్యేక విమానాలను నడిపింది.  ఆ విమానాలలో ఇండియాకు తరలించిన  654 ప్రయాణీకులలో 647 మంది భారతీయ పౌరులు.

ఆ విధంగా తరలించిన భారతీయ పౌరులను ఇండో టిబెట్ సరిహద్దు పోలీసు చావ్లా శిబిరంలో ,  మానేసర్ లోని సైనిక కేంద్రంలో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిని గమనిచారు. వారిని 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులలో ఉంచి వారిలో వ్యాధి లక్షణాలు లేవని నిధారణ అయ్యాక పంపివేశారు.  అంతకు ముందు వార్డులలో ఉన్నప్పుడు రెండేసి సార్లు వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపారు. 

ఈ రోజు వరకు దేశంలో 60 మందికి (కేరళలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసిన ముగ్గురితో కలిపి) కోవిడ్ -19 వ్యాధి ఉన్నట్లు పాజిటివ్ వచ్చింది.  నిన్నటి నుంచి కొత్తగా 10 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.  వాటిలో 8 కేసులు కేరళ నుంచి, ఒకటి రాజస్థాన్ నుంచి, మరొకటి డిల్లీలో నమోదైంది.

 

 



(Release ID: 1607022) Visitor Counter : 167