ప్రధాన మంత్రి కార్యాలయం

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తో టెలిఫోన్ ద్వారా సంభాషించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 17 MAR 2020 9:14PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కింగ్ డ‌మ్ ఆఫ్ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ శ్రీ మొహమ్మద్ బిన్ సల్మాన్ తో ఈ రోజు న టెలిఫోన్ ద్వారా సంభాషించారు.  నేత‌లు ఇరువురూ సిఒవిఐడి-19 ప్ర‌పంచ‌వ్యాప్త వ్యాధి ద‌రిమిలా ఉత్ప‌న్న‌మైన ప‌రిస్థితి ని గురించి చ‌ర్చించారు.  

ఈ ప్ర‌పంచవ్యాప్త స‌వాలును స‌మ‌ర్ధం గా ఎదుర్కొని, దీని ని అధిగ‌మించేందుకు స‌మ‌ష్టి ప్ర‌య‌త్నాల ను చేప‌ట్ట‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి నొక్కి వ‌క్కాణించారు.  ఈ వ్యాధి ల‌క్ష‌ల కొద్దీ ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని మ‌రియు క్షేమాన్ని ప్ర‌భావితం చేయ‌డం ఒక్క‌టే కాకుండా, ప్ర‌పంచం లో అనేక ప్రాంతాల లో ఆర్థిక వ్య‌వ‌స్థ పై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని ప్ర‌స‌రించే బెద‌రింపు ను కూడా సృష్టిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

ఈ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి ఎస్ఎఎఆర్‌సి (సార్క్) స‌భ్య‌త్వ దేశాల తో ఒక వీడియో కాన్ఫ‌రెన్స్ ను భార‌త‌దేశం నిర్వ‌హించిన‌ట్లు ప్ర‌స్తావించారు. 

ఇటువంటి ఒక క‌స‌ర‌త్తునే జి20 స‌భ్య‌త్వ దేశాల నాయ‌కుల తో జ‌ర‌పాల‌ని ఉభ‌య నేత‌లు అంగీక‌రించారు.  ప్ర‌స్తుతం సౌదీ అరేబియా జి20 అధ్య‌క్ష స్థానం లో ఉంది.  జి20 స‌భ్య‌త్వ దేశాల నాయ‌కుల స‌మావేశాన్ని నిర్వ‌హించిన‌ట్ల‌యితే అది కోవిడ్‌-19 తాలూకు స‌వాళ్ళ ను ప‌రిష్క‌రించేందుకు నిర్ధిష్ట చ‌ర్య‌ల పై చ‌ర్చించ‌డం తో పాటు, ప్ర‌పంచ జ‌నాభా లో విశ్వాసాన్ని ప్రోది చేయ‌గ‌ల‌ద‌ని కూడా వారు ఇరువురూ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈ విష‌యం లో త‌మ త‌మ అధికారులు స‌న్నిహిత సంప్ర‌తింపులు జ‌ర‌ప‌డాన్ని కొన‌సాగించాల‌ని క్రౌన్ ప్రిన్స్ మ‌రియు ప్ర‌ధాన మంత్రి నిర్ణ‌యించారు.

***



(Release ID: 1607012) Visitor Counter : 76