ప్రధాన మంత్రి కార్యాలయం

క‌రోనా వైర‌స్ ప్ర‌తిస్పంద‌న ను మ‌రియు స‌న్న‌ద్ధ‌త ను స‌మీక్షించిన పిఎంఒ

• పిఎంఒ ద్వారా నిర్వ‌హించిన స‌మీక్ష ల ప‌రంప‌ర లో నేటి స‌మావేశం తాజా ది; ఇటువంటి ఒక‌టో స‌మావేశాన్ని 2020వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 25వ తేదీ న నిర్వ‌హించ‌డ‌మైంది

• ‘అన్ని ప్ర‌భుత్వాల వైఖ‌రి’ క్రియాశీల ధోర‌ణి లో ఉంద‌ని పున‌రుద్ఘాటించిన స‌మావేశం; కేంద్రం, రాష్ట్రం మ‌రియు స్థానిక స్థాయిల లో విభిన్న సార్వజనిక అధికారివర్గాల కు బాధ్యత ను అప్పగించడం కోసం ప్రత్యేక రంగాల ను గుర్తించ‌డమైంది

• ప్ర‌జ‌లు పాలుపంచుకొనేట‌ట్లు గా విశాల స‌ముదాయాని కి మ‌రియు ప్రైవేటు రంగాని కి పెద్ద ప్రాతినిధ్యం పై ఉద్ఘాటన

• డిజీజ్ హాట్-స్పాట్స్ మరియు అందుబాటు లో గల వైద్య కేంద్రాల మ్యాపింగు కు ఒక జిఐఎస్ డేటా-బేస్ ను అభివృద్ధి ప‌ర‌చాల‌ని, అలాగే ప‌రీక్షా కేంద్రాల ను విస్త‌రించాల‌ని నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మైంది

Posted On: 04 MAR 2020 5:35PM by PIB Hyderabad

క‌రోనా వైర‌స్ స‌మ‌స్య పట్ల స్పందించడం మ‌రియు తత్సంబంధిత స‌న్న‌ద్ధ‌త ల‌పై స‌మీక్ష ను నిర్వ‌హించ‌డానికి జరిగిన ఒక అంత‌ర్ మంత్రిత్వ శాఖ స‌మావేశాని కి ప్ర‌ధాన మంత్రి కి  ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ పి.కె. మిశ్రా అధ్య‌క్ష‌త వ‌హించారు.  నేడు జ‌రిగిన ఈ స‌మావేశం తాజా ప‌రిస్థితి ని తెలుసుకోవ‌డానికి పిఎంఒ లో చేప‌ట్టిన ప‌లు స‌మావేశాల లో తాజా ది.  ఇటువంటి ఒక‌టో స‌మావేశాన్ని జ‌న‌వ‌రి 25వ తేదీ నాడు జ‌రిపారు.  నేటి స‌మావేశాని కి హాజ‌రు అయిన వారి లో కేబినెట్ సెక్ర‌ట‌రీ, విదేశీ వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి, ఆరోగ్యం, పౌర విమాన‌యానం, స‌మాచార- ప్ర‌సార శాఖ‌, శిప్పింగ్‌, ప‌ర్య‌ట‌న మంత్రిత్వ శాఖ‌ ల యొక్క కార్య‌ద‌ర్శులు, (ఎయ‌ర్ పోర్ట్ ఆథోరిటి ఆఫ్ ఇండియా) చైర్ మన్, సెక్ర‌ట‌రీ (బార్ డర్ మేనిజ్‌మంట్‌), ఎంహెచ్ఎ లతో పాటు ర‌క్ష‌ణ బ‌ల‌గాలు, నేశ‌న‌ల్ డిజాస్ట‌ర్ మేనిజ్‌మంట్‌ ఆథోరిటి (ఎన్‌డిఎంఎ), నీతి ఆయోగ్, ఇంకా ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం (పిఎంఒ)ల‌కు చెందిన సీనియ‌ర్ అధికార గ‌ణం ఉన్నారు.

 

 

వ్యాధి తాలూకు కేంద్రాని కి భౌగోళిక ప‌ర‌మైన సామీప్యం తో పాటు పెద్ద సంఖ్యల లో జ‌నాభా ను క‌లిగివున్నటువంటి దేశం అయిన‌ప్ప‌టికి కూడాను భార‌త‌దేశం లో వైర‌స్ యొక్క వ్యాప్తి ని అదుపు చేసేందుకు ఇంత‌వ‌ర‌కు అనుస‌రించిన క్రియాశీల చ‌ర్య‌ లు చేపట్టడాన్ని  సమావేశం లో పాల్గొన్న వారంతా ప్ర‌శంసించారు.  అదే కాలం లో, రాష్ట్రాల భాగ‌స్వామ్యం లో ఒక అఖిల ప్ర‌భుత్వాల వైఖ‌రిని అంటూ అనుస‌రించ‌డం ద్వారా ల‌క్షిత చ‌ర్య‌ ల ప్ర‌భావ‌శీల‌త్వాన్ని మ‌రింత గా పెంపొందించాల‌ని నిర్ణ‌యించ‌డ‌మైంది.

 

 

ఈ స‌మావేశం లో అనేక  అంశాల ను గురించి స్థూలం గా స‌మీక్షించ‌డం జరిగింది.  మ‌న స‌న్న‌ద్ధ‌త తాలూకు  స్థాయి ని మ‌రింత పెంచేందుకు గాను నిన్న‌టి నుండి చేసిన రెండు ముఖ్య మార్పుల ను దీటు గా అమ‌లు ప‌ర‌చాల‌ని సంబంధిత వ‌ర్గాలు అన్నీ కూడాను గమనం లోకి తీసుకోవడ‌మైంది.  ఈ రెండు ముఖ్య మార్పుల లో- అన్ని అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాలలో, అన్ని నౌకాశ్ర‌యాల లో థ‌ర్మ‌ల్ ఇమేజ‌రీ ఎక్విప్‌ మెంట్ ను ఉపయోగించి సార్వజనికం గా తనిఖీ ని చేపట్టడం, అలాగే విదేశాల నుండి తిరిగి వ‌స్తున్న ప్ర‌యాణికులు మ‌రియు యాత్రికులు వారు సంద‌ర్శించినటువంటి స్థలాల వివరణ ను తెలియజేస్తూ  పత్రాల ను నింపి ఇవ్వడాన్ని త‌ప్ప‌నిస‌రి చేయడం- అనేవి భాగం గా ఉన్నాయి.  మ‌న భూత‌ల స‌రిహ‌ద్దు ల‌లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ స్ (ఐసిపి స్‌) వ‌ద్ద స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ సంబంధిత నియ‌మావ‌ళి ని ఖ‌చ్చితం గా అనుస‌రించేందుకు పూచీ ప‌డ‌టం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వాల తో, సంబంధిత జిల్లా పాల‌నాధికారుల తో స‌న్నిహితం గా ప‌ని చేసే కార్య భారాన్ని దేశీయ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ కు అప్ప‌గించ‌డ‌మైంది.  ఈ విష‌యం లో ఎంహెచ్ఎ కు మ‌రియు ద బ్యూరో ఆఫ్ ఇమిగ్రేశ‌న్ కు అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని నేశ‌న‌ల్ ఇన్‌ఫ‌ర్మేటిక్స్ సెంట‌ర్ అంద‌జేయ‌నుంది.

 

 

రాష్ట్ర ప్ర‌భుత్వాల తోడ్పాటు తో దేశం లోని వేరు వేరు ప్రాంతాల లో జిల్లా స్థాయి వ‌ర‌కు త‌గిన టెస్టింగ్, ఐసొలేశ‌న్ మ‌రియు క్వారంటీన్ కేంద్రాల ను తెర‌చే ప‌ని ని శ‌ర వేగం గా అమ‌లు చేయ‌డానికి సైతం నిర్ణ‌యాల ను తీసుకోవ‌డ‌మైంది.  ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేస్తున్నటువంటి ప్ర‌య‌త్నాల కు అనుబంధం గా ఎంహెచ్ఎ, ఎంఒడి, రైల్వేస్ మ‌రియు కార్మిక మంత్రిత్వ శాఖ‌ లు పనిచేస్తూ, వైద్య శాల‌ ల మ‌రియు సంబంధిత స‌దుపాయాల  మ‌ద్దతు ను పొందగోరుతాయి.

 

 

సమాచారాన్ని సాధార‌ణ ప్ర‌జానీకం దృష్టి కి త్వరిత గతి న తీసుకు రావడం లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌, మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మ‌రియు ఎన్‌డిఎంఎల తో స‌న్నిహితం గా ప‌ని చేసే బాధ్య‌త ను స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ కు అప్ప‌జెప్ప‌డ‌మైంది.  ఈ స‌మాచారం లో సంబంధిత స‌ల‌హా లు, సూచ‌న‌ లు మ‌రియు పాటించ‌వ‌ల‌సిన అంశాలు’, ‘పాటించ‌కూడ‌ని అంశాలుభాగం గా ఉంటాయి.  ఈ ఉద్దేశం తో ఆరోగ్య మంత్రిత్వ శాఖ త‌న అధికార ప్ర‌తినిధి ద్వారా రోజూ క్ర‌మం త‌ప్ప‌క సంక్షిప్త వివ‌ర‌ణ‌ల ను ఇచ్చే వ్య‌వ‌స్థ ను మొద‌లుపెట్టింది.  ప్ర‌జానీకానికి ఎప్ప‌టిక‌ప్పుడు వాస్త‌వ‌ కాలిక స‌మాచారాన్ని అందుబాటు లోకి తీసుకువ‌చ్చేట‌ట్లు చూడ‌టం లో ఒక భాగం గా ఈ వ్య‌వ‌స్థ ఏర్పాటు అయింది.  ఆరోగ్య మంత్రిత్వ శాఖ డిజీజ్ హాట్ స్పాట్స్యొక్క జిఐఎస్ మ్యాపింగ్ ను ప‌ని చేయించ‌డం లో స‌హ‌కారాన్ని అందించ‌డ‌మే కాకుండా.  ప్ర‌భుత్వ విభాగాలు, సంబంధిత ఏజెన్సీలు మ‌రియు ఎన్‌డిఎంఎ తోడ్పాటు తో వైద్య కేంద్రాలు అందుబాలు లో ఉండేట‌ట్లు కూడా సమన్వయపరుస్తున్న‌ది.  దేశవ్యాప్తం గా 2020వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 23వ తేదీ మొద‌లుకొని ప‌ది ప్ర‌త్యేకించిన టెలిఫోన్ లైన్ ల అండ‌దండ‌ల తో రోజు లో 24 గంట‌ల పాటు ల‌భ్యం అయ్యే ఒక మెడిక‌ల్ హెల్ప్ లైన్ సానుకూల ఫ‌లితాల ను అందిస్తున్న‌ద‌ని, దీని ద్వారా ఇంత‌వ‌ర‌కు 6000కు పైగా ఫోన్ కాల్స్ వ‌చ్చాయ‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స‌మావేశం లో ప్రస్తావించింది.

 

 

వైర‌స్ రువ్విన సార్వజనిక స్వాస్థ్య సంబంధ స‌వాలు తో పోరాటం చేయడం కోసం స్థానిక సంస్థ‌ లు మ‌రియు స‌ముదాయాల యొక్క ప్రాతినిధ్యం ఎంత‌యినా అవ‌స‌ర‌మ‌ని స‌మావేశం లో నొక్కి వ‌క్కాణించ‌డం జ‌రిగింది.  ప్రైవేటు రంగం వైపు నుండి ఇతోధిక ప్ర‌మేయాని కి గ‌ల అవ‌కాశాల ను అన్వేషించాల‌ని నిర్ణ‌యించ‌డమైంది.

 

 

పెద్ద సంఖ్య లో జనం తరలివచ్చే సభల ను నివారించాల‌ని సార్వ‌జ‌నిక స్వ‌స్థ‌త నిపుణులు ఇచ్చిన సిఫారసు ను దృష్టి లో పెట్టుకొని దేశం లో ప్ర‌స్తుతం స‌మావేశాల ను మ‌రియు అంత‌ర్జాతీయ స‌ద‌స్సు ల‌ను ఏర్పాటు చేసే కన్నా ముందుగానే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ను సంప్ర‌దించవ‌ల‌సింది గా అన్ని ప్ర‌భుత్వ మంత్రిత్వ శాఖల ను, అన్ని ప్ర‌భుత్వ విభాగాల కు సూచించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది.

 

 

అంత క్రితం, మాన్య ప్ర‌ధాన మంత్రి ట్విట‌ర్ ద్వారా ఒక సందేశాన్ని అందిస్తూ, అందులో సిఒవిఐడి-19 నోవెల్ క‌రోనా వైర‌స్ యొక్క వ్యాప్తి ని నివారించ‌డానికి ప్ర‌జా కూట‌ముల‌ ను త‌గ్గించాలంటూ ప్ర‌పంచ వ్యాప్తం గా నిపుణులు స‌ల‌హా ఇచ్చారు.  ఈ కార‌ణం గా, ఈ సంవ‌త్స‌రం ఏ ఒక్క హోలీ మిల‌న్ కార్య‌క్ర‌మం లోను పాల్గొన‌ కూడదు అని నేను నిర్ణ‌యించుకొన్నానుఅని తెలిపారు.

 

 

 

**


(Release ID: 1605427) Visitor Counter : 142