ప్రధాన మంత్రి కార్యాలయం
లఖ్ నవూ లో ‘డిఫ్ ఎక్స్ పో’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
భారతదేశం కేవలం ఒక విపణి కాదు, యావత్తు ప్రపంచానికే ఒక అపారమైన అవకాశం అని పేర్కొన్న ప్రధాన మంత్రి
రేపటి సవాళ్ళ ను ప్రతిబింబిస్తున్న ‘డిజిటల్ ట్రాన్స్ ఫర్‌మేశన్ ఆఫ్ డిఫెన్స్’
రక్షణ రంగ తయారీ లో దేశీయ ముద్ర ఉండాలన్న అటల్ బిహారీ వాజ్‌పేయీ కల ను నెరవేర్చుతున్నట్లు తెలిపిన ప్రధాన మంత్రి
‘న్యూ ఇండియా’ కోసం నూతన లక్ష్యాలు: ప‌్రధాన మంత్రి
Posted On:
05 FEB 2020 5:42PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘డిఫ్ ఎక్స్ పో’ యొక్క పదకొండో సంచిక ను ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నవూ లో ఈ రోజు న ప్రారంభించారు. ప్రతి రెండు సంవత్సరాల కు ఒకసారి నిర్వహించే భారతదేశ సైనిక ప్రదర్శన దేశాని కి ఒక ప్రపంచ స్థాయి రక్షణ ఉత్పత్తుల కేంద్రం గా ఉన్న సత్తా ను నిరూపించదలుస్తోంది. ‘డిఫ్ ఎక్స్ పో 2020’ భారతదేశాని కి చెందిన అతిపెద్ద రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన వేదికల లో ఒకటిగానే కాకుండా, ప్రపంచం లో అగ్రగామి డిఫ్ ఎక్స్ పో లలో ఒకటి గా కూడా మారింది. ఈ పర్యాయం ప్రపంచవ్యాప్తం గా 150 కంపెనీలు మరియు ఒక వేయి రక్షణ సంబంధ తయారీదారు సంస్థలు ఈ ఎక్స్ పో లో పాలుపంచుకొంటున్నాయి.
డిఫ్ ఎక్స్ పో యొక్క పదకొండో సంచిక కు ప్రతి ఒక్కరినీ భారతదేశ ప్రధాన మంత్రి హోదా లో మాత్రమే కాకుండా, ఉత్తర్ ప్రదేశ్ యొక్క ఎంపీ గా కూడా ఆహ్వానించడం తన కు రెట్టింపు సంతోషాన్ని ఇస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఇది ప్రజల కు మరియు భారతదేశం లోని యువత కు ఒక చాలా పెద్ద అవకాశం. ‘మేక్ ఇన్ ఇండియా’ భారతదేశ భద్రత ను పెంచడం ఒక్కటే కాకుండా, రక్షణ రంగం లో ఉపాధి తాలూకు నూతన అవకాశాల ను కూడా సృష్టిస్తుంది. ఇది రాబోయే కాలం లో రక్షణ సంబంధిత ఎగుమతుల కు దన్నుగా కూడా నిలుస్తుంది’’ అని ప్రధాన మంత్రి వివరించారు.
భారతదేశం కేవలం ఒక విపణి కాదు, ఇది యావత్తు ప్రపంచానికి ఒక అపారమైన అవకాశం కూడా
నేటి డిఫ్ ఎక్స్ పో భారతదేశం యొక్క విశాలత్వాని కి, దాని వ్యాప్తి కి, వైవిధ్యాని కి, అలాగే ప్రపంచం లో దాని యొక్క విస్తృత భాగస్వామ్యాని కి ఒక సజీవమైన సాక్ష్యం గా ఉంది. భారతదేశం భద్రత మరియు రక్షణ రంగం లో ఒక బలమైన పాత్ర ను పోషిస్తూ, ముందంజ వేస్తోందనడానికి ఇది ఒక రుజువు గా ఉంది. ఈ ఎక్స్ పో రక్షణ కు సంబంధించిన పరిశ్రమ కు ప్రతిబింబం గా ఉండటమే కాకుండా, భారతదేశం పట్ల ప్రపంచాని కి ఉన్న విశ్వాసాని కి కూడా ప్రతిబింబం గా నిలుస్తోంది. రక్షణ గురించి మరియు ఆర్థిక వ్యవస్థ ను గురించి పరిచయం ఉన్నవారు భారతదేశం కేవలం ఒక మార్కెట్ కాదన్న సంగతి ని తప్పక గుర్తెరుగుతారు. భారతదేశం యావత్తు ప్రపంచాని కి ఒక అపారమైన అవకాశాల నిలయం గా కూడా ఉంది.
‘డిజిటల్ ట్రాన్స్ ఫార్మేశన్ ఆఫ్ డిఫెన్స్’ రేపటి సవాళ్ళ ను ప్రతిబింబిస్తోంది
డిఫ్ ఎక్స్‌పో యొక్క ఉప ఇతివృత్తమైనటువంటి ‘డిజిటల్ ట్రాన్స్ ఫార్మేశన్ ఆఫ్ డిఫెన్స్’ రేపటి సవాళ్ళ ను మరియు చింతల ను ప్రతిబింబిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. జీవితం సాంకేతిక విజ్ఞాన చోదకం గా మారుతున్న క్రమం లో భద్రత పరమైన ఆందోళనలు మరియు సవాళ్ళు మరింత గంభీరం గా మారుతున్నాయి. ఇది వర్తమానం విషయం లోనే గాక, మన భవిష్యత్తు కు సంబంధించి కూడా ముఖ్య విషయం. ప్రపంచమంతటా రక్షణ బలగాలు సరిక్రొత్త సాంకేతికత లను అక్కున చేర్చుకొంటున్నాయి. భారతదేశం సైతం, ప్రపంచం తో పాటే కదం తొక్కుతోంది. అనేక మూల రూపాల ను సైతం అభివృద్ధి పరచడం జరుగుతోంది. వచ్చే అయిదు సంవత్సరాల కాలం లో రక్షణ రంగం లో ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ తాలూకు కనీసం 25 ఉత్పత్తుల ను అభివృద్ధి పరచాలనేది మా లక్ష్యం గా ఉంది.
అటల్ బిహారీ వాజ్‌పేయీ కలను పండించడం
లఖ్ నవూ లోని ఈ ఎక్స్ పో మరియొక కారణం వల్ల కూడా ముఖ్యమైనటువంటిది గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం పూర్వ ప్రధాని కీ.శే. అటల్ బిహారీ వాజ్‌పేయీ రక్షణ రంగం లో తయారీ ప్రక్రియ దేశవాళీది గా ఉండాలని కలగన్నారు. మరి ఆ దిశ గా అనేక చర్యల ను తీసుకున్నారు.
“ఆయన దార్శనికత ను అనుసరిస్తూ, మేము అనేక రక్షణ ఉత్పత్తుల తయారీ ప్రక్రియ ను వేగవంతం చేశాం. 2014వ సంవత్సరం లోనే మేము 217 రక్షణ రంగ సంబంధ లైసెన్సుల ను ఇచ్చాము. గడచిన అయిదు సంవత్సరాల లో ఈ సంఖ్య 460 కి చేరుకొంది. భారతదేశం శతఘ్ని దళం వాడే ఆయుధాలు మొదలుకొని, యుద్ధ విమానాల వాహకాల నుండి, పోరాట జలాంతర్గాముల వరకు ప్రస్తుతం తయారు చేస్తున్నది. ప్రపంచ రక్షణ సంబంధ ఎగుమతుల లో భారతదేశం వాటా కూడా అధికం అయింది. గడచిన రెండు సంవత్సరాల కాలం లో భారతదేశం దాదాపు గా 17 వేల కోట్ల రక్షణ రంగ ఉత్పత్తుల ను ఎగుమతి చేసింది. మరి ప్రస్తుతం మా లక్ష్యం రక్షణ సంబంధిత ఎగుమతుల ను అయిదు బిలియన్ డాలర్ స్థాయికి పెంచాలనేదే’’ అని ప్రధాన మంత్రి వివరించారు.
రక్షణ రంగం లో పరిశోధన మరియు అభివృద్ధి అనేది దేశ విధానం లో ఒక ప్రధానమైన భాగం
‘‘గత అయిదారు సంవత్సరాల కాలం లో మా ప్రభుత్వం పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్&డి) ని మా దేశం యొక్క విధానం లో ఒక ప్రధానమైన భాగం గా తీర్చిదిద్దింది. రక్షణ రంగ ఆర్&డి మరియు తయారీ కై దేశం లో అవసరమైన మౌలిక సదుపాయాల ను సన్నద్ధం చేయడం జరుగుతోంది. ఇతర దేశాల తో సంయుక్త సంస్థల తాలూకు కసరత్తులు జరుగుతున్నాయి. కార్యసాధన లో అవరోధాలన్నింటినీ తొలగించేందుకు తదేక దృక్పథం తో ఒక ప్రయత్నం కూడా చేయడమైంది. ఇది పెట్టుబడి కి మరియు నూతన ఆవిష్కరణలకు సిద్ధంగా ఉన్న ఒక వాతావరణానికి బాట వేసింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ఉత్పత్తిదారు కు మరియు వినియోగదారు కు మధ్య భాగస్వామ్యం
వినియోగదారు కు మరియు ఉత్పత్తిదారు కు మధ్య భాగస్వామ్యం ఏర్పరచడం ద్వారా దేశ భద్రత ను మరింత శక్తిమంతం చేయవచ్చని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘రక్షణ సంబంధిత తయారీ కేవలం ప్రభుత్వ సంస్థల కు పరిమితం కాకూడదు. అందులో ప్రైవేటు రంగం కూడా సమానమైన ప్రాతినిధ్యాన్ని మరియు భాగస్వామ్యాన్ని కలిగి ఉండాలి” అని ఆయన అన్నారు.
‘న్యూ ఇండియా’ కోసం నూతన లక్ష్యాలు
భారతదేశం లో రెండు రక్షణ తయారీ కారిడోర్ లు నిర్మాణాధీన దశ లో ఉన్నాయని ప్రధాన మంత్రి తెలిపారు. వాటిలో ఒకటి తమిళ నాడు లో, మరొకటి ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని డిఫెన్స్ కారిడోర్ యొక్క ఆరు భాగాల ను లఖ్ నవూ తో పాటే, కాన్ పుర్ చిత్రకూట్, ఝాన్సీ, ఆగ్రా, ఇంకా అలీగఢ్ లలో నెలకొల్పడం జరుతుంది. భారతదేశం లో రక్షణ సంబంధిత తయారీ కి మరింత జోరును సంతరించడం కోసం క్రొత్త లక్ష్యాల ను నిర్దేశించడమైంది.
“రక్షణ ఉత్పత్తి రంగం లో ఎంఎస్ఎంఇ ల సంఖ్య ను రానున్న అయిదు సంవత్సరాల కాలం లో 15 వేల కు పైబడి తీసుకు పోవడం అనేది మా యొక్క లక్ష్యం గా ఉంది. ఐ-డిఇఎక్స్ (I-DEX) తాలూకు ఆలోచన ను విస్తరింపజేసేందుకు గాను, 200 డిఫెన్స్ స్టార్ట్-అప్ లను క్రొత్త గా ప్రారంభించాలనేది లక్ష్యం గా పెట్టుకోవడమైంది. కనీసం 50 నూతన సాంకేతికత లను మరియు ఉత్పత్తుల ను అభివృద్ధి పరచాలనేది దీని లోని ప్రయత్నం. దేశం లోని ప్రధానమైన పారిశ్రామిక సంఘాలు, రక్షణ రంగ తయారీ కై ఒక ఉమ్మడి వేదిక ను ఏర్పాటు చేయాలని, అలా చేసినప్పుడు అవి రక్షణ రంగం లో సాంకేతికత అభివృద్ధి కి మరియు ఉత్పత్తి కి సంబంధించిన ప్రయోజనాన్ని పొందగలుగుతాయని కూడా నేను సూచన చేస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
(Release ID: 1602131)
Visitor Counter : 265