ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

నావెల్ కరోనా వైర‌స్ పై స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించినకేబినెట్ సెక్ర‌ట‌రీ

ప్ర‌యాణికుల‌కు నూత‌న అడ్వ‌యిజ‌రీ జారీ చేయ‌డ‌మైంది; చైనా కు ప్ర‌యాణాన్ని ఆపివేసుకోనున్న ప్ర‌యాణికులు;  అక్క‌డ నుండి తిరిగి వ‌చ్చిన ప్ర‌యాణికుల నుతాత్కాలికం గా ఏకాంత వాసం లో ఉంచడం జరుగుతుంది.

Posted On: 03 FEB 2020 4:27AM by PIB Hyderabad

నావెల్ క‌రోనా వైర‌స్ కు సంబంధించి స‌న్నాహ‌క చ‌ర్య‌ల పై ఒక ఉన్న‌తస్థాయి స‌మీక్ష స‌మావేశాన్ని కేబినెట్ సెక్ర‌ట‌రీ నిర్వ‌హించారు. ఈ స‌మావేశం లో ఆరోగ్యం మ‌రియు కుటుంబ సంక్షేమం, విదేశీవ్య‌వ‌హారాలు, దేశీయ వ్య‌వ‌హారాలు, పౌరవిమాన‌యాన మంత్రిత్వ శాఖ‌ల కార్య‌ద‌ర్శులు, ఆరోగ్య ప‌రిశోధ‌న విభాగం కార్య‌ద‌ర్శి, ఐటిబిపి, ఎఎఫ్ఎమ్ఎస్ మరియు ఎన్ డిఎమ్ఎ ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. కేబినెట్ సెక్ర‌ట‌రీ ఇంత‌వ‌ర‌కు ఆరు స‌మీక్ష స‌మావేశాలను నిర్వ‌హించారు.

 

చైనా కు ప్ర‌యాణం ఆపివేసుకోవ‌ల‌సిందిగాను, అక్క‌డ నుండి తిరిగి వ‌చ్చిన ప్ర‌యాణికుల ను ఏకాంత‌ వాసాని కి ప‌రిమితం చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌తి ఒక్కరి కి తెలియజేస్తూ ఒక క్రొత్త ట్రావెల్ అడ్వ‌యిజ‌రీ ని జారీ చేయ‌డ‌మైంది. అలాగే,2020వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 15వ తేదీ నాటి నుండి చైనా కు వెళ్ళిన ప్ర‌తి ఒక్క‌రి ని మ‌రియు ఇక‌పై చైనా కు వెళ్ళి వ‌చ్చే వారి ని తాత్కాలికం గా ఏకాంత వాసం లో ఉంచడం జరుగుతుంది.

 

దీనికి తోడు గా, విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ఒక అడ్వ‌యిజ‌రీ ని జారీ చేసింది. కొన్ని ప్ర‌స్తుత ప‌రిణామాల కారణం గా ఇ-వీసా ల‌తో భార‌త‌దేశాని కి ప్ర‌యాణించ‌డాన్ని త‌క్ష‌ణ ప్రాతిపదిక న కొంత కాలం పాటు నిలిపివేస్తున్న‌ట్లు ఆ అడ్వ‌యిజ‌రీ లో తెలిపారు. ఇది చైనా పాస్ పోర్టు లు క‌లిగి ఉన్న‌వారికి మ‌రియు పీపుల్స్ రిప‌బ్లిక్స్ఆఫ్ చైనా లో నివాసం ఉంటున్న ఇత‌ర దేశాల వారి కి వ‌ర్తిస్తుంది.

 

ఇంత‌వ‌ర‌కు 445 విమాన స‌ర్వీసుల లో విచ్చేసిన 58,658మంది ప్ర‌యాణికుల కు త‌నిఖీలు నిర్వ‌హించ‌డ‌మైంది. మొత్తం 142 మంది లో రుగ్మ‌త‌ల ను ఐడిఎస్‌పి గ‌మ‌నించినందున, వారి ని కొంత కాలం పాటు ఏకాంత‌ వాసాని కి పరిమితం కావలసింది గా సూచించ‌డ‌మైంది. 130 న‌మూనాల ను ప‌రీక్షించ‌గా, అందులో128 న‌మూనాలు నెగెటివ్ గా ఉన్న‌ట్లు తేలింది. కేర‌ళ లో వెల్ల‌డైన రెండు పాజిటివ్ కేసుల ను ప‌ర్య‌వేక్ష‌ణలో ఉంచ‌డ‌మైంది. వారి ఆరోగ్య ప‌రిస్థితిచికిత్స‌ ను అందిస్తున్నందువ‌ల్ల నిల‌క‌డ‌గా ఉంది.

 

వుహాన్ నుండి 330 మంది ప్ర‌యాణికుల తో కూడిన (వీరిలో మాల్దీవ్స్ పౌరులు ఏడుగురు ఉన్నారు) రెండ‌వ బ్యాచ్ భార‌త‌దేశాని కి చేరుకొంది. . వీరిలో 300 మంది ని ఐటిబిపి చావ్లా క్యాంప్ లో ఉండవ‌ల‌సిందిగా సూచించారు. 30మంది ని మానేస‌ర్ లో ఉంచారు. వీరంద‌రి ఆరోగ్య ప‌రిస్థితి ని నిశితం గా ప‌ర్య‌వేక్షించ‌డం జ‌రుగుతోంది.

 

 

***



(Release ID: 1601727) Visitor Counter : 154